అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని కొన్ని వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. వీడియోలు కూడా వైరల్ గా మారుతూ ఉంటాయి. బంగారం కొనేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎన్నో రకాల మోసాలు బంగారం కి సంబంధించి జరుగుతూ ఉంటాయి. నమ్మకం ఉన్న షాపులకి వెళ్లి మాత్రమే బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలి లేదంటే కచ్చితంగా ఏదో ఒక రకంగా మోసపోతూ ఉంటాము. బంగారం వ్యాపారులనే శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరూ కిలాడీ లేడీ లు బురిడీ కొట్టించారు. ఇక అసలు ఏం జరిగింది అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం.
Also read:
ఇద్దరు లేడీస్ షాపుకి బంగారం కొనడానికి వెళ్లినట్టే వెళ్లి చివరికి నకిలీ బంగారాన్ని అంట కట్టి మస్కా కొట్టేశారు. సినిమాటిక్ రేంజ్ లో ఏం మోసం జరిగింది. సెప్టెంబర్ నెలాఖరున శ్రీకాకుళం జిల్లాలోకి అడుగుపెట్టిన ఓ ముఠా ఇదే పనిగా మోసాలు చేస్తోంది. కిందటి నెల 27న శ్రీకాకుళంలో ఎస్ఎస్ జువెలరీస్ లోకి జువెలర్స్ లోకి అడుగుపెట్టి ఏకంగా 45 గ్రాముల బంగారాన్ని కొట్టేశారు. నెక్స్ట్ రోజు 28న పలాస లో ఒక బంగారం షాపుకు వెళ్లి 58 గ్రాములు కొట్టేశారు. సెప్టెంబర్ 29న నరసన్నపేటలో 73 గ్రాములు బంగారాన్ని కొట్టేశారు. ఇలా 10 లక్షల రూపాయలు పైబడి విలువ చేసే 176 గ్రాముల బంగారాన్ని దోచుకు వెళ్లిపోయారు. ఈ కిలాడీలు ఇచ్చిన బంగారాన్ని నెక్స్ట్ డే కరిగించి చూస్తే 80% కాపర్ గా ఉన్నట్లు తెలిసింది.
సిసి కెమెరాలలో చూస్తే అసలు బండారం మొత్తం బయట పడిపోయింది. ఈనెల నాలుగవ తేదీన శ్రీకాకుళం టూ టౌన్ పోలీసులకి కంప్లైంట్ చేశారు షాపువాళ్ళు. ఈ కిలాడీలా ఫోటోలని వాట్సాప్ గ్రూప్ లలో కూడా పోస్ట్ చేశారు. తమిళనాడు రాష్ట్రంలో సేలంకి చెందిన వాళ్ళుగా గుర్తించారు పోలీసులు. వీళ్ళిద్దరూ పిన్ని కూతుర్లు వరుస అవుతారట. ఈ ఇద్దరు మహిళలతో పాటుగా ఇద్దరు మగవాళ్ళు కూడా ఉన్నారు. పోలీసులు ప్రస్తుతం బంగారం ని రికవరీ చేసే పనిలో ఉన్నారు వీళ్లు తమిళనాడుకి చెందిన వాళ్ళైనా తెలుగు క్లియర్ గా మాట్లాడగలరు. ఏది ఏమైనా బంగారం విషయంలో మోసాలు జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.