Telugu News » World Cup : నగరంలో వరల్డ్ కప్ క్రికెట్ సందడి.. మ్యాచ్ చూడాలంటే ఈ రూల్స్ తెలియాల్సిందే..

World Cup : నగరంలో వరల్డ్ కప్ క్రికెట్ సందడి.. మ్యాచ్ చూడాలంటే ఈ రూల్స్ తెలియాల్సిందే..

మ్యాచ్ చూడటానికి వచ్చే ప్రేక్షకులను 11 గంటలకు గ్రౌండ్‌లోకి అనుమతిస్తామని, 2 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుందని సీపీ తెలిపారు.

by Venu

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆశతో ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. వరల్డ్ కప్ సీజన్ ఆనందాల హద్దులను చెరిపేసే సమయం ఆసన్నమైంది. నేటి నుంచి ఇండియాలో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభం అవుతున్న నేపధ్యంలో ఉప్పల్ స్టేడియాన్ని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ పరిశీలించారు. 1200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

 

ఇప్పటికే ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాం. వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లో కూడా అభిమానులకు, ఇక్కడికి వచ్చే టీమ్స్‌కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒక ప్లాన్ ప్రకారం బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక మ్యాచ్ చూడటానికి వచ్చే ప్రేక్షకులను 11 గంటలకు గ్రౌండ్‌లోకి అనుమతిస్తామని, 2 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుందని సీపీ తెలిపారు.

పార్కింగ్ ప్లేసెస్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు చేశామని, ట్రాఫిక్ డైవర్షన్స్ అడ్వైజరీ కూడా ఇష్యూ చేస్తామంటూ వెల్లడించారు. కాగా బయట నుంచి ఫుడ్ ఐటమ్స్, వాటర్ బాటిల్స్ గ్రౌండ్‌లోకి అనుమతి లేదని, కంట్రోల్ రూమ్ ద్వారా సెక్యూరిటీ‌ని మానిటరింగ్ చేసేలా చర్యలు తీసుకొంటున్నామని సీపీ అన్నారు.

క్రైమ్ టీమ్స్, షీ టీమ్స్ గ్రౌండ్ లోపలా బయటా మఫ్టీలో ఉంటారని, ప్రేక్షకులకు వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని హెచ్‌సీఏకి ఇప్పటికే సూచించామని అన్నారు. బ్లాక్ టికెట్స్ అమ్మేవారిపై స్పెషల్ ఫోకస్ పెట్టామని సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు..

You may also like

Leave a Comment