వరల్డ్ కప్ ఫైనల్(World Cup Final) మ్యాచ్ ఉత్కంఠభరితంగా ప్రారంభమైంది. టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తోంది. ఇక మ్యాచ్ ప్రారంభం కాగానే ఫైనల్ మ్యాచ్ సందర్భంగా వాయుసేన ఎయిర్ షో(Air Show) ఆకట్టుకుంది. టాస్ తర్వాత విమానాలు పొగలు చిమ్ముకుంటూ విన్యాసాలు చేశాయి. దీంతో ఆటగాళ్లతో పాటు స్టేడియంలో ఉన్న 1.30 లక్షల మంది అభిమానులు మంత్రముగ్ధులయ్యారు.
మోటేరా స్టేడియం అని కూడా పిలువబడే నరేంద్ర మోడీ స్టేడియం భారతదేశంలోని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న ఒక అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. ఇది 132,000 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం . ఈ స్టేడియం గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ యాజమాన్యంలో ఉంది.
దేశీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు వేదికగా పనిచేస్తుంది. ఇది భారతదేశంలోని ప్రీమియర్ స్టేడియంలలో ఒకటి. 39 ఏళ్ల (1984-2023) ఈ స్టేడియం చరిత్రలో ఇప్పటి వరకు 30 వన్డేలు జరిగాయి. ఇక్కడి పిచ్పై తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 243. ప్రస్తుతం 50 ఓవర్ల ఫార్మాట్ay భారీ స్కోర్లు నమోదవుతున్న తరుణంలో 243 రన్స్ తక్కువగానే కనిపిస్తుంది.
మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 15 సార్లు గెలిస్తే.. చేజింగ్ చేసిన టీమ్ కూడా అన్నేసార్లు నెగ్గడం గమనార్హం. ఇక ఇక్కడ టాస్ గెలిచిన జట్టు మ్యాచ్ గెలిచే అవకాశం 56.67 శాతం ఉంది. అంటే టాస్ నెగ్గే జట్టుకే విజయావకాశాలు అధికమన్నమాట. ఈ స్టేడియంలో అత్యధిక స్కోరు 365/2. 2010లో భారత్‌పై సౌతాఫ్రికా నమోదు చేసింది. కలిస్, డివిల్లీర్స్ సెంచరీలతో చెలరేగారు. అత్యల్ప స్కోరు 85. 2006లో వెస్టిండీస్‌పై జింబాబ్వే చేసింది.