సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023 (Worldcup Final 2023) తుది అంకానికి చేరుకుంది. భారత్, ఆస్ట్రేలియా(IND vs AUS) పైనల్‌లో తలపడనున్నాయి. నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రెండు టాప్ టీమ్స్ మధ్య ఫైనల్ కావడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. అయితే 2023 ప్రపంచకప్‌లో భారత్‌కు తిరుగులేదని ఫాన్స్ అంటున్నారు.
ఓ ట్రెండ్ ప్రకారం ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ విజయం ఖాయమని ఫ్యాన్స్ చెబుతున్నారు. అదేంటంటే.. 2011 నుంచి వన్డే ప్రపంచకప్‌నకు ఆతిథ్యమిచ్చిన దేశం టైటిల్ గెలిచింది. 2011లో మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వగా.. ఎంఎస్ ధోనీ సారథ్యంలోని టీమిండియా ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో శ్రీలంకను చిత్తుచేసిన భారత్.. రెండోసారి వన్డే ప్రపంచకప్‌ను అందుకుంది.
2015లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు సంయుక్తంగా ప్రపంచకప్‌నకు ఆతిథ్యమిచ్చాయి. ఫైనల్ పోరు కూడా ఈ రెండు జట్ల మధ్యే జరిగింది. అయితే ఫైనల్ ఎక్కడ జరిగిందో.. ఆ జట్టే విజేతగా నిలిచింది. 2015లో ప్రపంచకప్ ఫైనల్ మెల్బోర్న్ జరగ్గా.. ఆసీస్ గెలుపొందింది. 2019 ప్రపంచకపు ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వగా.. ఆ జట్టే విశ్వవిజేతగా నిలిచింది.
అయితే, ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే.. ఇప్పుడు ప్రపంచకప్ 2023కి భారత్‌కు తిరుగులేదని ఫ్యాన్స్ అంటున్నారు. వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా టోర్నీలన్నీ సునాయాసంగానే విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఆ జోరును అలాగే కొనసాగిస్తూ.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ ప్రపంచకప్‌ను అందుకుంటుందని ఫాన్స్ అనుకుంటున్నారు.