01.03.2024 https://www.textise.net/ 1.. Bangladesh : రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం.. 44 మంది దుర్మరణం..! బంగ్లాదేశ్‌, రాష్ట్ర: బంగ్లాదేశ్‌ (Bangladesh) రాజధాని ఢాకా (Dhaka)లో భారీ విషాదం చోటుచేసుకుంది. ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదం (Fire Accident)లో 44 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో 40 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.. ఏడంతస్తుల రెస్టారెంట్ భవనంలో మంటలు చెలరేగడంతో.. స్థానికుల నుంచి సమాచారం అందుకొన్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.. ఫైర్ సిబ్బంది, పోలీసులు, స్థానికుల సాయంతో మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో రెస్టారెంట్లో ఉన్న సుమారుగా మరో 75 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించినట్లు తెలుస్తోంది. కాగా రెస్టారెంట్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలడం వల్ల మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక అధికారులు పేర్కొన్నారు. ప్రమాద ఘటన గురించి అగ్నిమాపక శాఖ అధికారి మహ్మద్ షిహాబ్ మాట్లాడుతూ.. ఢాకాలోని 7 అంతస్తుల రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు మాకు సమాచారం అందింది. వెంటనే మేం ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాం.. ఈ క్రమంలో ఫైర్ సిబ్బంది వేగంగా మంటలు ఆర్పారని తెలిపారు. వేసవి కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయని, అందువల్ల 44 మంది అప్పటికే దుర్మరణం చెందినట్లు వివరించారు. ప్రమాదంలో చిక్కుకొన్న 75 మందిని సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు.. మరోవైపు భవనంలోని దాదాపు అన్ని అంతస్తుల్లో రెస్టారెంట్లతో పాటు వస్త్ర దుకాణాలు, మొబైల్ షాపులు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.. ఇదిలా ఉండగా అగ్నిప్రమాదంపై బంగ్లా ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సంఘటనకు గల కారణాలపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించింది. పూర్తి కథనం.. https://raashtra.com/bangladesh-a-huge-fire-in-a-restaurant-44-people-died/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 2.. Srisailam : శ్రీశైలం వెళ్తున్న భక్తులకు శుభవార్త చెప్పిన టీఎస్ ఆర్టీసీ..! శ్రీశైలం, రాష్ట్ర: తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం (Srisailam) మల్లిఖార్జున స్వామి దేవస్థానం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతుంది. ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టారు. దక్షిణ భారతదేశంలో శ్రీశైలం ప్రముఖ శైవక్షేత్రం కావటంతో.. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఈ నేపథ్యంలో జంట నగరాల నుంచి శ్రీశైలానికి వెళ్ళే భక్తులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ (Hyderabad) నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడనున్నట్లు రంగారెడ్డి (Rangareddy) రీజనల్ మేనేజర్ శ్రీధర్‌ ప్రకటించారు. నగరంలోని బీహెచ్‌ఈఎల్‌ (BHEL), జూబ్లీ స్టేషన్‌, ఎంజీబీఎస్‌ (MGBS) నుంచి శ్రీశైలంకు బస్సులు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ప్రతి గంటకు ఒక బస్సును నడుపుతున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా శ్రీశైలం దేవస్థానం నుంచి ఉదయం 5 గంటల సమయంలో మొదలై హైదరాబాద్‌కు బస్సులు బయలుదేరుతాయని వెల్లడించారు. ముఖ్యంగా ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రతి గంటకు బస్సులు నగరం నుంచి బయల్దేరతాయని వెల్లడించారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏసీ, ఆర్డీనరీ, సూపర్‌ లగ్జరీ బస్సులను నడుపుతున్నట్లు అధికార్లు తెలిపారు. ఏసీ బస్సు సర్వీసుల్లో పెద్దలకు రూ.650, పిల్లలకు రూ.510 ఛార్జీలుగా నిర్ణయించామని రంగారెడ్డి రిజియన్ మేనేజర్ శ్రీధర్ పేర్కొన్నారు. పూర్తి కథనం.. https://raashtra.com/srisailam-ts-rtc-gave-good-news-to-devotees-going-to-srisailam/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 3.. Lasya Nanditha : లాస్య రోడ్డు ప్రమాదంలో లభ్యమైన కీలక ఆధారాలు.. జరిగింది ఇదే..? హైదరాబాద్, రాష్ట్ర: సికింద్రాబాద్ (Secunderabad) కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) లాస్య నందిత (Lasya Nanditha) ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.. పటాన్ చెరు (Patan Cheru) ఓఆర్ఆర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు.. తాజాగా కీలక ఆధారాలు సేకరించారు. లాస్య కారును ఢీకొన్న టిప్పర్‌ను గుర్తించారు. సదరు వాహనాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. మరోవైపు యాక్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత కర్ణాటక (Karnataka)లో టిప్పర్‌ను గుర్తించారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకొన్న పోలీసులు విచారించగా.. అతను కీలక విషయాలు వెల్లడించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కారు అతి వేగంతో వచ్చి టిప్పర్ ను ఢీకొట్టడంతోనే యాక్సిడెంట్ జరిగిందని డ్రైవర్ వెల్లడించినట్లు తెలిపారు. మొదట కారు టిప్పర్ ను ఢీకొని అనంతరం వేగంగా వెళ్లి రెయిలింగ్ ను ఢీకొట్టిందని డ్రైవర్ వివరించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో లాస్య ప్రయాణిస్తున్న కారు వేగంగా టిప్పర్ ను ఢీకొనడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. మరోవైపు నేటి సాయంత్రం రంగారెడ్డి (Ranga Reddy) జిల్లా పోలీసులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కీలక విషయాలు వెల్లడించే చాన్స్ ఉందని సమాచారం.. ఇదిలా ఉండగా లాస్య నందిత ఎమ్మెల్యే అయిన తర్వాత పలుమార్లు ఆమెను మృత్యువు వెంటాడుతూ వచ్చింది. ఒకసారి లిఫ్ట్ లో చిక్కుకొనగా, ఇటీవల రోడ్డు ప్రమాదం నుంచి తప్పించకొన్నారు. కానీ మూడో సారి జరిగిన ప్రమాదం నుంచి మాత్రం తప్పించుకోలేక పోయారు.. పట్టుదలతో కాపు కాసిన మృత్యువు చివరికి ఆమె ప్రాణాలు బలి తీసుకొంది. పూర్తి కథనం.. https://raashtra.com/lasya-nanditha-key-evidence-found-in-the-lasya-road-accident-this-is-what-happened/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 4.. Telangana : తెలంగాణలో మొదలైన ఉచిత విద్యుత్ బిల్లుల జారీ.. వీరికి మాత్రమే..? హైదరాబాద్, రాష్ట్ర: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ (Congress) ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు.. ఈ క్రమంలో గృహజ్యోతి స్కీమ్ (Grihajyoti Scheme) కింద జీరో బిల్లుల జారీ రాష్ట్ర వ్యాప్తంగా మ్ముమ్మరంగా కొనసాగుతుంది. విద్యుత్ సిబ్బంది నేటి ఉదయం 6 గంటల నుంచే ఆయా ప్రాంతాల్లో వినియోగదారులకు జీరో బిల్లులు (Zero bills) అందజేస్తున్నారు. ప్రజాపాలన సభల ద్వారా దరఖాస్తు చేసుకొన్న అర్హులకు ఈ స్కీమ్ వర్తింపజేస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి నెలకు 200 యూనిట్లు వినియోగించే గృహ విద్యుత్ కనెక్షన్లకు ఈ ఉచిత విద్యుత్ వర్తింపజేస్తున్నారు. గత నెలలో విద్యుత్ వినియోగానికి సంబంధించిన బిల్లుల స్థానంలో జీరో బిల్లులు అందజేస్తున్నారు. జీరో బిల్లులో వినియోగించిన విద్యుత్ కు ఎంత ఛార్జీ అయిందో పేర్కొంటున్నారు. అనంతరం ఆ మొత్తాన్ని గృహజ్యోతి సబ్సిడీ కింద మైనస్ గా చూపిస్తూ నెట్ బిల్ అమౌంట్ జీరోగా చూపిస్తున్నారు. ఇక ఈ స్కీమ్ కు అర్హతలు ఉండి లబ్ది పొందలేని వారికి విద్యుత్ సిబ్బంది తగిన సూచనలు చేస్తున్నారు. గృహజ్యోతి పథకం నిరంతర ప్రక్రియ అని అర్హులైన వారు మండల కార్యాలయాలల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు ఈ స్కీమ్ ను, ఫిబ్రవరి నెల 27న సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభించారు. మార్చి ఒకటో తేదీ.. అంటే నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన కాంగ్రెస్.. రూ. 500 గ్యాస్ పథకాన్ని సైతం ప్రారంభించింది. తాజాగా ఉచిత విద్యుత్ స్కీమ్ అమలు చేయడంపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి కథనం.. https://raashtra.com/telangana-issuance-of-free-electricity-bills-started-in-telangana-only-for-them/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 5.. BRS : భయంతో కూడుకొన్న అయోమయంలో బీఆర్ఎస్ నేతలు.. మేడిగడ్డ ప్రయాణంలో అపశకునం..! జనగామ, రాష్ట్ర: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కాళేశ్వరం వ్యవహారం కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) మధ్య మల్ల యుద్ధాన్ని తలపిస్తోంది. అవినీతి ఆరోపణలతో కాంగ్రెస్ దూకుడుగా ప్రవర్తిస్తుండగా.. డ్యామ్ విషయంలో అసలు అవినీతి జరగలేదని సమర్థించుకొంటున్న బీఆర్ఎస్.. ఈ వ్యవహారాన్ని తేల్చడానికి నేడు మేడిగడ్డ (Medigadda) ప్రాజెక్టు సందర్శనకు బయలు దేరారు.. హైదరాబాద్ (Hyderabad) బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నుంచి నేతలు వోల్వో బస్సుల్లో బయలుదేరారు.. కానీ ఊహించని విధంగా వీరు ప్రయాణిస్తున్న బస్సు టైరు బరస్ట్ అయ్యింది. తెలంగాణ భవన్ నుంచి బయలుదేరిన వీరి బస్సు.. జనగామ మండలం నెల్లుట్ల సమీపంలోకి రాగానే.. బస్సు టైరు పేలిపోయింది. పెద్ద శబ్ధంతో టైరు పేలటంతో బీఆర్ఎస్ నేతలు.. భయంతో కూడుకొన్న అయోమయంలో పడిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ విషయాన్ని గుర్తించిన బస్సు డ్రైవర్.. బస్సును రోడ్డున పక్కన నిలిపివేశాడు. అందుబాటులో ఉన్న మెకానిక్ ను తీసుకొచ్చి టైరు మార్పించారు.. కాగా ఈ బస్సులో మాజీ ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నట్లు సమాచారం.. వీరితో పాటు మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో ఊపిరిపీల్చుకొన్నారు. అయితే మేడిగడ్డ వెళుతున్న సమయంలో ఇలా జరగడం అపశకునంగా భావిస్తూ.. కొందరు నేతలు చర్చించుకోన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే బీఆర్ఎస్ నేతలు తొలుత మేడిగడ్డను సందర్శించిన అనంతరం అన్నారం బ్యారేజీని పరిశీలించనున్నారు. అక్కడ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం తలకిందులైంది. ఫలితంగా పార్టీ పునాది భూ పలకలు మరో చోటికి వేగంగా కదిలి పోతున్నాయి. ఇలాంటి సమయంలో చలో మెడిగడ్డ పేరిట సానుభూతి కూడగట్టుకొనే పనిలో గులాబీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పూర్తి కథనం.. https://raashtra.com/brs-leaders-in-confusion-due-to-fear-bad-luck-in-medigadda-journey/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 6.. Global warming : అదే గనుక జరిగితే.. హిమాలయ ప్రాంతాల్లో 90 శాతం కరవు.. హెచ్చరిస్తున్న అధ్యయనాలు..! ఇంగ్లండ్‌, రాష్ట్ర: మనిషి జీవనానికి అనుగుణంగా ప్రకృతి ఏర్పడింది.. కానీ ఆశల జలపాతంలో తడిసిపోతున్న మానవుడు.. తనకు అనుగుణంగా ప్రకృతిని మార్చడం ప్రారంభించాడు.. అప్పటి నుంచి ప్రకృతి (Nature)లో మార్పులు జరగడం అందరూ గమనిస్తున్న అంశం.. ఈ క్రమంలో ముందు తరాల భవిష్యత్తుకు ప్రమాదం ఉందనే నిజాన్ని ఇప్పటికే శాస్త్రవేత్తలు (Scientists) హెచ్చరికల రూపంలో చేరవేస్తున్నారు.. పలు అధ్యయనాలు సైతం ఇదే నిజాన్ని వెల్లడిస్తున్నాయి.. ఆధునికత పేరుతో ప్రకృతిని ధ్వంసం చేస్తున్న మనిషి ముందు ముందు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనే సూచనలు ఇప్పటికే ప్రకృతి అందించడం మొదలుపెట్టినట్లు కొన్ని సంఘటనలు నిరూపించడం కనిపిస్తోంది. ఇదే సమయంలో గ్లోబల్ వార్మింగ్ మరో 3 డిగ్రీలు పెరిగితే హిమాలయ ప్రాంతంలోని దాదాపు 90 శాతం.. ఏడాదిపాటు తీవ్ర కరవులో కూరుకుపోతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉండగా ఇంగ్లండ్‌ (England)లోని ఈస్ట్ అంగ్లియా యూనివర్సిటీ (East Anglia University) నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాలు ‘క్లైమేట్ చేంజ్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. గ్లోబల్ వార్మింగ్‌ను పారిస్ ఒప్పంద లక్ష్యాలకు అనుగుణంగా 1.5 డిగ్రీలకు పరిమితం చేయగలిగితే దేశంలోని 80 శాతం ప్రజలు వేడికి గురికాకుండా నివారించే అవకాశం ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. మరోవైపు గ్లోబల్ వార్మింగ్ (Global warming) స్థాయి పెరిగే కొద్దీ మానవ, సహజ వ్యవస్థలు ప్రమాదంలో పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అదీగాక వాతావరణ మార్పుల ప్రమాదాలు జాతీయస్థాయిలో ఎలా పెరుగుతాయో ఈ అధ్యయనం అంచనా వేసింది. కాగా బ్రెజిల్, చైనా, ఇండియా, ఈజిప్ట్, ఇథియోపియా, ఘనాపై దృష్టిసారించిన 8 అధ్యయనాల సమాహారం కీలక విషయాలు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న భూతాపం వల్ల కరవు, వరదలు, పంట దిగుబడి క్షీణత, జీవ వైవిధ్యం తదితర నష్టాలు పెరుగుతాయని అంచనా వేసింది. భూగోళం వేడెక్కడాన్ని 1.5 డిగ్రీలకు పరిమితం చేయడం వల్ల దేశంలోని సగం మంది జీవవైవిధ్యానికి ఆశ్రయంగా పనిచేయవచ్చని వెల్లడించింది.. పూర్తి కథనం.. https://raashtra.com/global-warming-if-the-same-happens-90-percent-drought-in-the-himalayan-areas-studies-warn/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 7.. Uttar Pradesh : ఉత్తర‌ప్రదేశ్‌లో నకిలీ మెడిసిన్స్.. ముఠా గుట్టురట్టు చేసిన తెలంగాణ అధికారులు..! ఉత్తర‌ప్రదేశ్‌, రాష్ట్ర: తెలంగాణ (Telangana) డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (TDCA) అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా మెడిసిన్స్ (Medicines) తయారు చేసి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకొన్నారు. ఆపరేషన్ జై (Operation Jai) పేరుతో అధికారులు అక్రమంగా నడుపుతున్న మెడిసిన్స్ తయారీ కేంద్రాలపై ఏక కాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా పలు రకాల మందులు, మిషనరీని వారు స్వాధీనం చేసుకొన్నారు. మరోవైపు గత నెలలో రాష్ట్రంలో ఖమ్మం, సంగారెడ్డి, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నకిలీ ప్రాక్టిషనర్స్, అనుమతుల్లేని మెడికల్ షాపులను సీజ్ చేశారు. ఇందులో భాగంగా 150 రకాల యాంటీబెటిక్స్ డ్రగ్స్ ను అధికారులు గుర్తించారు. ఒక ప్రైవేట్ మెడికల్ ప్రాక్టిషనర్ ను సైతం అరెస్టు చేశారు. 2లక్షల 50 వేల మెడిసిన్లను సీజ్ సీజ్ చేశారు. అంతేకాకుండా శామీర్ పేట్, ఆస్పెన్‌ బయో ఫార్మా ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో సైతం అధికారులు దాడులు చేయగా.. పెద్దమొత్తంలో బ్యాన్ చేసిన రెండు డ్రగ్స్‌ లభించినట్లు తెలిపారు. సిప్రోఫ్లోక్సాసిన్ హైడ్రోక్లోరైడ్ 110 కిలోలు, గాటిఫ్లోక్సాసిన్ హైడ్రోక్లోరైడ్ స్వాధీనం చేసుకొన్నారు. అయితే, ఇక్కడ లభించిన ఆధారాల మేరకు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు ఉత్తర ప్రదేశ్‌ (Uttar Pradesh), కోట్ద్వారలో తనిఖీలో చేపట్టారు. ఈ తనిఖీలో తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు ఇక్కడి నుంచే మందులు సరఫరా అవుతున్నాయని అధికారులు గుర్తించారు. ఈ మేరకు యూపీకి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.. పూర్తి కథనం.. https://raashtra.com/uttar-pradesh-telangana-officials-busted-a-gang-of-fake-medicines-in-uttar-pradesh/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 8.. Kodandaram : కాళేశ్వరం కామధేనువని నమ్మించడం సిగ్గుచేటు.. కోదండరామ్..! హైదరాబాద్, రాష్ట్ర: తెలంగాణ (Telangana)లో రాజకీయాలు కాళేశ్వరం చుట్టూ తిరుగుతున్నాయి.. ఎన్నికల ఆరంభంలో అంటుకున్న ఈ మంటలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరింతగా వ్యాపించాయి. ఇప్పటికే కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) నేతలు ఈ అంశంపై మాటలకు అందని విమర్శలు చేసుకొంటున్న ఘటనలు కనిపిస్తున్నాయి.. ఈ క్రమంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో మొదటి నుంచి కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టుపై విమర్శలు వస్తున్నా.. అధికారులు, నిపుణులు చెప్పినా వినకుండా బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం కట్టిందని మండిపడ్డారు.. బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం కామధేనువని నమ్మించడం సిగ్గుచేటని విమర్శించారు. కాళేశ్వరం కామధేనువు కాదు.. తెలంగాణ పాలిట శాపంగా, భారంగా మారిందని కోదండరామ్ (Kodandaram) ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ (BRS) నేతలు నేడు మేడిగడ్డ (Madigadda) సందర్శనకు వెళ్లడంపై స్పందించిన కోదండరామ్.. నాంపల్లి, పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.. ఈ రోజు బీఆర్ఎస్ చేస్తుంది చూస్తుంటే.. దొంగే, దొంగ దొంగ అని అరిచినట్లు ఉందని విమర్శించారు. ఇది మూడు పిల్లర్లకు సంబంధించిన వ్యవహారం కాదని మండిపడ్డారు.. స్లాబ్ ప్రభావం మిగితా పిల్లర్ల మీద కూడా ఉంటుందని వెల్లడించారు. ఈ అంశాన్ని చిన్న సమస్యగా చూస్తున్న బీఆర్ఎస్ నేతలు.. కేవలం సాంకేతిక లోపం అని సమర్థించుకోవడం వారి నిర్లక్ష్య పాలనకు నిదర్శనమని కోదండరామ్ అన్నారు.. ఇప్పటికే ప్రణాళిక, నాణ్యత, డిజైన్, నిర్వహణ లోపం ఉందని నివేదికలు వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు.. ఏదో న్యాయం చేసిన ధీరుల్లాగా మేడిగడ్డకు బయల్దేరిన నేతలు, ఇంకా ఏం మాయచేసి మభ్యపెట్టాలని చూస్తున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరంలో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించిన మూడేళ్లకు పిల్లర్లు ఎందుకు కుంగిపోయాయో బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్ల లెక్క ప్రకారం.. గత నాలుగు సంవత్సరాల్లో 97వేలకు నీళ్లు వచ్చాయి.. కేవలం 40వేల ఎకరాల ఆయకట్టు మాత్రమే అభివృద్ధి చెందిందని అన్నారు. మల్లన్న సాగర్ భూకంపాలు వచ్చే ప్రాంతంలో కట్టారని ఆరోపించారు.. ఆ ప్రాజెక్టు కట్టినా నీళ్లు నింపే పరిస్థితి లేదని కోదండరామ్ పేర్కొన్నారు. పూర్తి కథనం.. https://raashtra.com/kodandaram-it-is-a-shame-to-believe-that-kaleshwaram-is-kamadhenu-kodandaram/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 9.. Vamsichand Reddy : నాడు కేసీఆర్ స్థానంలో రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటే..? వంశీచంద్ రెడ్డి..! పాలమూరు, రాష్ట్ర: మాజీ సీఎం కేసీఆర్ (KCR) పై సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి (Vamsichand Reddy) తీవ్ర విమర్శలు చేశారు.. ఆంధ్రా పాలకులు కృష్ణా జలాలను దోచుకుపోతుంటే దద్దమ్మలా కేసీఆర్ చూస్తుండిపోయారని ఆరోపించారు. రాజకీయ బిక్ష పెట్టిన పాలమూరు (Palamuru) జిల్లాకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. కన్నీళ్ళ గాథలు వినిపిస్తున్న పాలమూరు ప్రజల తరుపున మాట్లాడుతున్నానని తెలిపారు.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన కేసీఆర్.. తొమ్మిదేళ్లయిన పూర్తి చేయలేదని ఆరోపించారు. నాసిరకం పనులు ప్రాజెక్టు పొడవునా జరుగుతున్నాయన్నారు. దక్షిణ తెలంగాణపై కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపించారని వంశీచంద్ రెడ్డి మండిపడ్దారు. పాలమూరు ప్రాజెక్టు 90శాతం పనులు చేశాం అని చెబుతున్న మీరు.. ఆంధ్రోళ్లు సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా 11 టీఎంసీలు దోచుకు వెళ్తుంటే.. అసమర్ధతతో చూస్తూ ఉండిపోయారన్నారు. మీ ప్రభుత్వ హయాంలో కృష్ణా నదిలో రావాల్సిన వాటాపై ఎందుకు పోరాటం చేయలేదని ప్రశ్నించారు. నాడు కేసీఆర్ స్థానంలో రేవంత్ రెడ్డి సీఎంగా ఉండుంటే 299 టీఎంసీలకు బదులుగా 577 టీఎంసీల వాటా వచ్చేదని వంశీచంద్ రెడ్డి తెలిపారు.. నీళ్ళు, నిధులు, నియామకాలు పాలమూరు జిల్లా ప్రజలకు రాలేదు కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులకు వచ్చాయన్నారు.. కేసీఆర్ డిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంగిపోయిందని.. ఉత్తర తెలంగాణ (Telangana)లో లక్షల కోట్ల అవినీతి జరిగిందని, దక్షిణ తెలంగాణనూ సైతం కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. పదేళ్ల నిర్లక్ష్యం తుడిచి పెట్టీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాలన చేస్తుంటే.. బీఆర్ఎస్ కుట్రలు చేస్తూ.. విమర్శలు చేస్తున్నారని వంశీచంద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి కథనం.. https://raashtra.com/vamsichand-reddy-if-revanth-reddy-becomes-cm-instead-of-kcr-vamsichand-reddy/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 10.. Medigadda : మేడిగడ్డపై నడుస్తున్న రాజకీయం.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్​..! కాళేశ్వరం, రాష్ట్ర: తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) నేతలు ఢీ అంటే ఢీ అంటూ సిద్దం అవుతున్నారు. ఈ క్రమంలో నేడు మేడిగడ్డను బీఆర్​ఎస్​ నేతల బృందం సందర్శించింది. మాజీ మంత్రులు కేటీఆర్ (KTR)​, హరీశ్​రావు (Harish Rao) సహా పలువురు నేతలు, పార్టీ కార్యకర్తలు బ్యారేజీని పరిశీలించారు. అనంతరం మాట్లాడిన కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.. మేడిగడ్డ (Medigadda )లో కనిపించిన చిన్న సమస్యను కాంగ్రెస్ నేతలు భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూస్తున్నారని పేర్కొన్నారు. తమపై కోపం, రాజకీయ వైరం ఉంటే తీర్చుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్న కేటీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టే నిష్ఫలమైందని కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రూ.లక్ష కోట్లు కొట్టుకుపోయాయని ప్రచారం చేయడం తగదన్నారు. నిపుణులు మేడిగడ్డను మరమ్మతులు చేసే అవకాశం ఉందని తెలిపిన నేపథ్యంలో.. వర్షాకాలం వచ్చేలోగా మరమ్మతులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు మేడిగడ్డ అంశంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్​ చేశారు. రైతులకు మాత్రం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వరద వచ్చేలోగా మేడిగడ్డలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు. కరీంనగర్​లో ఇప్పటికే సాగు నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని, ఇతర జిల్లాల్లో సైతం ఇలాంటి పరిస్థితులే వస్తున్నాయని వెల్లడించారు. సాగు నీరు ఎత్తిపోస్తే పంటలకు లాభం చేకూరుతుందని వివరించారు. మేడిగడ్డ అంశంపై అధికారులు, నిపుణులతో కమిటీ వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్న ఆయన, కమిటీ వేసి నివేదిక తీసుకోవాలని కోరారు. మాపై కోపం ఉంటే తీర్చుకోండి. రైతులపై కాదు. రైతులు, రాష్ట్రంపై పగ వద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నామని కేటీఆర్ వెల్లడించారు. 1.6 కిలోమీటర్ల బ్యారేజ్‌లో 50 మీటర్ల ప్రాంతంలో సమస్య ఉంది. కాంగ్రెస్ నేతలు ఇలాంటివి గతంలో ఎప్పుడూ జరగలేదన్నట్లు మాట్లాడటం సరికాదని తెలిపారు. పూర్తి కథనం.. https://raashtra.com/medigadda-politics-running-on-madigadda-ktr-demands-action-against-those-responsible/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 11.. BJP : బీఆర్ఎస్ పేరును BBB గా మార్చుకోవాలి.. బీజేపీ నేతల సంచలన వ్యాఖ్యలు..! జహీరాబాద్‌, రాష్ట్ర: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది బీఆర్‌ఎస్‌ (BRS)కి సొంత పార్టీ నేతలు వరుస షాక్‌లు ఇస్తున్నారు.. చిన్న బాస్ ఎంతలా ప్రయత్నిస్తున్నప్పటికి కారు దిగుతున్న నేతలు రోజు రోజుకు పెరిగిపోవడం కనిపిస్తోంది. ఈ క్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత, నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు ఇప్పటికే బీఆర్‌ఎస్‌ను వీడగా, జహీరాబాద్‌ (Zaheerabad) ఎంపీ బీబీ పాటిల్‌ (MP BB Patil) సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌కు తన రాజీనామా లేఖను పంపారు. నేడు ఢిల్లీలో బీజేపీ రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్‌ ఛుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. అనంతరం మాట్లాడిన బీబీ పాటిల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.. మోడీ (Modi) పదేళ్ల ప్రగతిని చూసి బీజేపీ (BJP)లో చేరినట్లు వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధి కోరుకునేవారు బీజేపీలో చేరుతున్నారని తెలిపిన ఆయన.. బీఆర్ఎస్ మనుగడ ఇక కష్టం అని పేర్కొన్నారు.. పార్టీలో చివరికి తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు మాత్రమే మిగులుతారని జోస్యం చెప్పారు.. బంగారు తెలంగాణ (Telangana) కావాలనుకునే వారు బీజేపీలో ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ (Congress) అసత్య హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కాకముందే.. వ్యతిరేకత మొదలైందని తెలిపారు. మరోవైపు తరుణ్ చుగ్‌ సైతం బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు.. బీఆర్ఎస్ పార్టీ పేరును BBB (బాప్, బేటా, భేటీ) గా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు.. తెలంగాణలో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు అవుతోందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ (Laxman) ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయమని, గడిచిన చరిత్ర అని దుయ్యబట్టారు. తెలంగాణలో దళిత, లింగాయత్‌ నాయకులు బీజేపీలో చేరారని, బీజేపీకి పెరుగుతున్న ఆదరణ ఓర్చుకోలేక కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. పూర్తి కథనం.. https://raashtra.com/sensational-comments-of-bjp-leaders-on-brs/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 12.. Uttam Kumar Reddy : మేడిగడ్డ.. ఓ బొందల గడ్డ.. ? హైదరాబాద్, రాష్ట్ర: మేడిగడ్డ (Madigadda)ను బీఆర్​ఎస్​ నేతల బృందం నేడు సందర్శించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో కాళేశ్వరం (Kaleswaram) చిన్న సమస్య అని కానీ, కాంగ్రెస్ (Congress) నేతలు భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూస్తున్నారని కేటీఆర్ (KTR) విమర్శించారు.. ఈ నేపథ్యంలో గులాబీ నేతల తీరుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.. నేడు సచివాయంలో మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన.. పలు కీలక విషయాలు వెల్లడించారు.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పాపాల్లో కేంద్రం పాత్ర ఉందని ఆరోపించారు. రెండు పార్టీల మధ్య అలాయ్ బలయ్ లేకపోతే రూ. లక్ష కోట్ల రుణం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక అందిందని, బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ వెల్లడించారు.. మేడిగడ్డ నిర్మాణంలో లోపం ఉన్నందున ఎల్అండ్ టీ కంపెనీకి చెల్లించాల్సిన రూ. 400 కోట్ల బిల్లులను ఆపామని తెలిపారు. దీనివల్ల రాష్ట్రంకు చాలా అన్యాయం జరిగిందని మండిపడ్డ ఉత్తమ్.. జరిగిన నష్టానికి ఇరిగేషన్ లో ఉన్న లోన్లన్నీ కేసీఆర్, కేటీఆర్ కట్టాలని తెలిపారు.. నిజాలు దాచడానికి మేడిగడ్డ వెళ్లారా.. లేక సత్యాలు ఒప్పుకోవడానికి వెళ్లారా అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. మరోవైపు తుమ్మిడి హెట్టి వద్ద నీళ్లు లేవని అసత్య ప్రచారం చేశారు కానీ అక్కడ 160 టీఎంసీల నీళ్లున్నట్టు సీడబ్ల్యూసీ వెల్లడించిందని గుర్తుచేశారు.. బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటనపై గరం అయిన ఉత్తమ్.. మేడిగడ్డ.. ఓ బొందల గడ్డ.. ఏం పీక పోతరు అన్నోళ్లు ఇప్పుడు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. కమీషన్లకు కక్కుర్తి పడి బీఆర్ఎస్ లీడర్లు తెలంగాణ (Telangana) రైతుల భవిష్యత్ పణంగా పెట్టారని ఆరోపించారు.. ఎన్టీఎస్ఏ కమిటీని మేడిగడ్డ విచారణ కోసం ఆహ్వానించడాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు.. వారు ఏ సమాచారం అడిగినా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.. రేపు ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిపిన ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy).. మేడిగడ్డ అంశంపై పలువురు నిపుణులను, అధికారులను కలుస్తానన్నారు. నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకొంటామని పేర్కొన్నారు. మరోవైపు ప్రాణహిత చేవెళ్ల ను పూర్తి చేస్తే కాంగ్రెస్ కు క్రెడిట్ వస్తదనే కుట్రతోనే కేసీఆర్ రీ డిజైన్ చేశారని ఆరోపించారు.. మేడిగడ్డ వెళ్తున్న BRS నేతల బస్సు టైర్ బ్లాస్ట్ అయింది.. ఇప్పటికే కారు షెడ్డుకు పోయింది. దీన్ని బట్టి అర్థం అయ్యేది ఏంటంటే.. చేసిన పాపాలు ఎక్కడికిపోవని తెలుస్తోందని ఎద్దేవా చేశారు.. పూర్తి కథనం.. https://raashtra.com/uttam-kumar-reddy-why-did-those-who-criticized-medigadda-o-bondala-gadda-go-now/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 02.03.2024 1.. Bangalore Bomb Blast : రామేశ్వ‌రం కేఫ్‌ పేలుడులో కీల‌క అప్‌డేట్..! బెంగళూరు, రాష్ట్ర: బెంగళూరు (Bengaluru), రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం బాంబు పేలడం (Bomb Blast)తో 10 మంది గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పేలుడుకు సంబంధించిన విషయంలో పోలీసులు నిందితుడిని గుర్తించారు. బాంబు ఉన్న బ్యాగ్‌ను నిందితుడు కేఫ్‌లో వదిలివెళ్లినట్టు తెలిపారు. కాగా ఈ అంశంపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఐఈడీ కారణంగా ఈ పేలుడు సంభవించిందని మీడియాకు తెలిపారు. మరోవైపు పేలుళ్ల కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. వారిని విచారిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని బెంగళూరు నగర కమిషనర్​ బీ దయానంద తెలిపారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపడుతున్నారని పేర్కొన్నారు. కేసు సున్నితత్వం, భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకొని మీడియా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎటువంటి ఊహాగానాలకు తావు ఇవ్వొద్దని కోరారు. మరోవైపు, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రామేశ్వరం కేఫ్​లో జరిగిన పేలుడుకు కారణమైన నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా ఘటన వెనుక ఉన్న వారిని పట్టుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం పేలుడు సంభవించిన రామేశ్వరం కేఫ్​ను సందర్శించారు. పేలుడు ఘటనలో గాయపడి బ్రూక్​ఫీల్డ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. మరోవైపు మంగళూరులో 2022లో జరిగిన కుక్కర్​ పేలుడుకు, రామేశ్వరం కేఫ్ పేలుడుకు మధ్య సంబంధం ఉందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. రామేశ్వర్ పేలుడు ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపడుతున్నారని తెలిపారు. పూర్తి కథనం.. https://raashtra.com/bengaluru-bomb-blast-key-update-in-rameswaram-cafe-explosion/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 2.. Delhi : ఢిల్లీలో మారిపోయిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం..! ఢిల్లీ, రాష్ట్ర: ఢిల్లీ (Delhi)లో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం కారణంగా నేటి ఉదయం నుంచి భారీగా వర్షం పడుతోంది. ఘజియాబాద్ (Ghaziabad), నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్ (Gurugram) సహా ఎన్‌సీఆర్‌ (NCR) ప్రాంతాల్లో ఎడతెగని వర్షం కురుస్తోంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకస్మిక వాతావరణ మార్పుతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు పలు చోట్ల గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తున్నట్లు ఢిల్లీ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం శనివారం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో బలమైన గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో వాతావరణం చల్లగా మారనుందని తెలిపారు. ఇక మార్చి 2న పశ్చిమ హిమాలయ ప్రాంతంలో మెరుపులు, బలమైన గాలులతో పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించింది. మరోవైపు గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో పంజాబ్, హర్యానాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మార్చి 2న ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర మధ్య ప్రదేశ్‌లలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీలో ఆఫీస్‌లు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత కొన్ని రోజులు భానుడి ప్రతాపంతో వేడెక్కిన దేశ రాజధాని.. ఆకస్మిక వర్షాలతో కాస్త చల్లబడింది. పూర్తి కథనం.. https://raashtra.com/delhi-the-weather-has-changed-in-delhi-heavy-rain-in-many-places/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 3.. BJP : లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీకి షాక్.. పాలిటిక్స్‌కు గుడ్ బై చెప్పిన మాజీ క్రికెటర్..! ఢిల్లీ, రాష్ట్ర: టీమిండియా (Team India) మాజీ ఓపెనర్‌, బీజేపీ (BJP) ఎంపీ గౌతం గంభీర్‌ (Gautam Gambhir) సంచలన నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా (JP Nadda)కు ఎక్స్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు.. ఈ క్రమంలో క్రికెట్‌లో కమిట్‌మెంట్ ఇచ్చిన టోర్నమెంట్‌లపై ఫోకస్ చేయనున్నట్లు ప్రకటించారు. అదే విధంగా ప్రజలకు ఇన్నాళ్లు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌ షాకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్‌ అని గౌతం గంభీర్‌ ట్వీట్‌ (X) చేశారు. కాగా గంభీర్‌ తూర్పు ఢిల్లీ (Delhi) నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అతడు తీసుకొన్న నిర్ణయం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. కాగా ఢిల్లీకి చెందిన గౌతం గంభీర్‌ 2003లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకొన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తంగా 147 వన్డేలు, 58 టెస్టులు, 37 టీ20లు ఆడిన గంభీర్‌ ఆయా ఫార్మాట్లలో వరుసగా 5238, 4154, 932 పరుగులు సాధించారు. భారత్‌ తరఫున 2016లో ఆఖరి మ్యాచ్‌ ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. 2019లో రాజకీయాల్లో ప్రవేశించారు. బీజేపీలో నాటి కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, రవిశంకర్‌ ప్రసాద్‌ సమక్షంలో చేరారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తుర్పు ఢిల్లీ స్థానం నుంచి పోటీ చేసి 695109 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.. అప్పటి నుంచి గంభీర్‌, బీజేపీ తరఫున బలంగా గొంతు వినిపిస్తున్నారు. అదీగాక క్రికెట్‌ కామెంటేటర్‌గా, ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ మెంటార్‌గా సేవలు అందిస్తున్నారు. పూర్తి కథనం.. https://raashtra.com/bjp-a-shock-to-the-bjp-during-the-lok-sabha-elections-the-former-cricketer-said-goodbye-to-politics/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 4.. BJP : కంటోన్మెంట్ కి తొలగిన కష్టాలు.. తెలంగాణకు 175 ఎకరాల ల్యాండ్..! హైదరాబాద్, రాష్ట్ర: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది నేతల నుంచి వరాల జల్లులు కురుస్తున్నాయి.. ఇచ్చిన హామీలు త్వరగా పూర్తి చేయాలనే ఆరాటం.. చేసిన అభివృద్ధి.. చేయబోయే అభివృద్ధి అంశాలకు సంబంధించిన ప్రచారాల్లో వేగం కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ (BJP) మూడో సారి అధికారం చేపట్టే ఆలోచనలో భాగంగా ఓటర్లను ఆకట్టుకొనే పనిలో ఉంది. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) ప్రభుత్వానికి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ (Secunderabad) కంటోన్మెంట్ (Cantonment) పరిధిలోని 175 ఎకరాల డిఫెన్స్ ల్యాండ్‌ను తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేసింది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో కంటోన్మెంట్ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధి, ఒకటో నెంబర్, 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఎలివేటేటడ్ కారిడార్లు, టన్నెళ్ల నిర్మాణానికి మార్గం సుగమం అయ్యిందని భావిస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం పట్ల కేంద్రమంత్రి, టీ-బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి (Kishan Reddy) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ (Modi)కి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు హైదరాబాద్‌ (Hyderabad)లో పౌర విమానయాన పరిశోధనా కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బేగంపేట విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ సంస్థను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో 4, 5 తేదీల్లో మోడీ రాష్ట్రంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రధాని టూర్‌కు సంబంధించిన షెడ్యూల్‌ సైతం ఖరారైంది. ఈ పర్యటనలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్‌ జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసే వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. వీటిలో ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్‌ కూడా ఒకటి. ఈమేరకు మార్చ 5వ తేదీన ఈ సెంటర్‌ను ప్రారంభించనున్నారు.. పూర్తి కథనం.. https://raashtra.com/bjp-the-difficulties-of-the-cantonment-have-been-removed-the-center-has-announced-175-acres-of-land-for-telangana/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 5.. Telangana : రాష్ట్రంలో ఎంపీ టికెట్ల పంచాయతీ.. ఫుల్ డిమాండ్ లో ఉన్న బీజేపీ.. ! హైదరాబాద్, రాష్ట్ర: తెలంగాణ (Telangana)లో బీజేపీ (BJP) బలపడుతుందనే టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం రాష్ట్రంలో బీజేపీ సీట్లకు భారీ పోటీ నెలకొనడం.. పార్లమెంట్ ఎన్నికల్లో కాషాయం విజయం సాధించి.. మోడీ (Modi) ప్రధానిగా మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తారనే నమ్మకం బలంగా నెలకొందని అందుకే బీజేపీలో చేరేందుకు పలు పార్టీల నాయకులు ఆసక్తి చూపిస్తున్నారని చర్చలు సాగుతున్నాయి. ముచ్చటగా మూడో సారి అధికారం చేపట్టాలనే ఆలోచనతో.. అధిక ఎంపీ స్థానాలు గెలవాలనే లక్ష్యంతో వరుస యాత్రలు చేపడుతున్న తెలంగాణ బీజేపీ నేతలు, బీఆర్ఎస్ (BRS) నేతలకు గాలం వేశారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నాగర్ కర్నూలు (Nagar Kurnool) సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ రెండు రోజుల తేడాతో బీజేపీ కండువా కప్పుకొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై గ్రాఫ్ కోల్పోయిన బీఆర్ఎస్ అభ్యర్థిగా కంటే, బలంగా పనిచేస్తున్న మోడీ చరిష్మాతో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అనే ధీమాగా ఉన్న నేతలు.. బీజేపీ ఎంపీగా బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాలకు చెందిన ఒకరిద్దరు కీలక నేతలు సైతం బీజేపీలో చేరే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బీజేపీకి నాలుగు ఎంపీ సిట్టింగ్ స్థానాలున్నాయి. వీటిలో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఖరారు అవ్వగా.. కరీంనగర్ ఎంపీ సీటు బండి సంజయ్ కు, నిజామాబాద్ పార్లమెంటు సీటును ప్రస్థుత సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు ఖరారు చేశారు. మరో సిట్టింగ్ అయిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావును అధిష్టానం పెండింగులో పెట్టింది. గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేవేళ్ల సీటును దక్కించుకోగా.. ఖమ్మం నుంచి డాక్టర్ వెంకటేశ్వరరావు, భువనగిరి సీటును మాజీ బీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కు ఖరారు చేసిందని ప్రచారం జరుగుతోంది. అదే విధంగా మహబూబ్ నగర్ , మల్కాజిగిరి నియోజక వర్గాలలో గట్టి పోటీ నెలకొంది. అయితే బలమైన నేతలు వస్తే చేర్చుకోవాలని కమలం భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక బీజేపీకి తెలంగాణలో నాలుగు సిట్టింగ్ స్థానాలుండగా, ఈ సారి ఎన్నికల్లో వీటి సంఖ్యను రెట్టింపు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఇందులో భాగంగా 12 ఎంపీ సీట్లపై గురి పెట్టిన కమలనాథులు దీనికి అనుగుణంగా బలమైన అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దించాలని నిర్ణయించారు. ఇందుకోసం వలసా వచ్చే నేతలను జల్లెడ పడుతున్నట్లు తెలుస్తోంది. రామమందిర నిర్మాణం, పదేళ్ల అభివృద్ధి పనులతో ఓటర్లలో మోడీ పట్ల ఆదరణ పెరిగిన నేపథ్యంలో కనీసం 8 స్థానాలనైనా సాధించాలని బీజేపీ నేతలు కృతనిశ్చయంతో ఉన్నారు. దీనిలో భాగంగా పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటేందుకు నేతలు దీటైన వ్యూహాలతో ముందుకు పోతున్నారు. ప్రస్తుత వాతావరణం తమకు అనుకూలంగా ఉందని గట్టిగా నమ్మడం వల్ల బీజేపీ నాయకుల మధ్య ఎంపీ టికెట్ల పంచాయతీ నెలకొందని ప్రచారం జరుగుతోంది.. పూర్తి కథనం.. https://raashtra.com/telangana-mp-tickets-panchayat-in-the-state-bjp-in-full-demand/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 6.. BRS : బయటపడ్డ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీల రాజీనామా రహస్యం.. ఇంత జరుగుతుందా..? హైదరాబాద్, రాష్ట్ర: రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) అధిష్టానం తీరుపై సొంత పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అసలే సార్వత్రిక ఎన్నికలు ముంచుకు వస్తున్నాయి.. ఈ సమయంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించక.. తలొదిక్కుగా వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది. దీనికి తోడు ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రధాన పార్టీలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకొంటున్నాయి. తెలంగాణ (Telangana)లో అధికార కాంగ్రెస్ (Congress), ప్రతిపక్ష బీజేపీ (BJP) పోటాపోటీగా తలపడుతుండగా.. బీఆర్ఎస్ లో మాత్రం ఆ జోష్ కనిపించకపోవడంతో, కారునే నమ్ముకొని ఉన్న నేతల్లో కలకలం మొదలైనట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పక్క పార్టీలోకి వలసలు సైతం ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు వరుసగా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్, బీజేపీలో చేరుతుండటం కారును కంగారు పెట్టిస్తోందని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ఓటమి తర్వాత పార్టీకి అండగా నిలుస్తారనుకున్న నేతలే ఇలా చేజారిపోవడం బలమైన కారణం ఉందనే కొత్త వాదన తెరపైకి వస్తోంది. బీఆర్ఎస్ లో నెలకొన్న ఆధిపత్య పోరు.. వలసలకు కారణం అవుతోందనే చర్చ జరుగుతోంది. ఇంత జరుగుతున్నా అసంతృప్త నేతలను ఆపేందుకు అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు బీఆర్ఎస్ క్యాడర్ నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, నాగర్న కర్నూల్ ఎంపీ రాములు, తాజాగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ గులాబీకి గుడ్ బై చెప్పి తమదారి తాము చూసుకొన్నారు. అయితే వీరు పార్టీ మారడం వెనుక బీఆర్ఎస్ లో నేతల మధ్య నెలకొన్న కోల్డ్ వారే కారణం అనే టాక్ వినిపిస్తోంది. సొంత పార్టీ నేతలు పొమ్మన లేక పొగ పెట్టడం వల్ల ఈ ఆధిపత్యపోరు భరించడం కంటే పార్టీ మారిపోవడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చి ఒక్కొక్కరుగా కారు దిగిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఎంపీల పరిస్థితి ఇలా ఉంటే మిగతా నాయకుల విషయంలోనూ ఆధిపత్యపోరే కనిపిస్తోందని అనుకొంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో పలువురు కార్పొరేటర్లు, కేటీఆర్ ముఖ్య అనుచరులు పార్టీ వీడేందుకు అక్కడి నేతలతో ఉన్న వర్గపోరే కారణం అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.. అదీగాక ఎంపీ టికెట్ల విషయంలోనూ ఏమాత్రం తగ్గని నేతలు.. ఎదుటి వారు తామ పార్టీ వారైనా సరే రాజకీయంగా శత్రువుగా భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా నల్గొండ (Nalgonda)లో గుత్తా సుఖేందర్ వర్సెస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మధ్య ఆధిపత్యపోరు నడుస్తోందనే చర్చ జిల్లాలో జోరుగా వినిపిస్తోంది. మిగతా నియోజకవర్గాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉందని ఒక నేతకు మరో నేత అడ్డుపుల్లలు వేస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్య నేతలు కారు దిగివెళ్తుంటే.. నెక్స్ట్ లీడ్ లో ఉన్న లీడర్ ఎవరనేది బీఆర్ఎస్ లో సస్పెన్స్ గా మారిందని సామాచారాం. తాజా పరిణామాలు క్యాడర్ ను తీవ్ర గందరగోళానికి గురి చేస్తుంటే అధినేత కేసీఆర్ మాత్రం సైలెంట్ గా ఉండిపోవడం విమర్శలకు చోటిస్తోంది. పార్టీలో నెలకొన్న ఆధిపత్యపోరుకు చెక్ పెట్టి అసంతృప్త నేతలను బుజ్జగించాల్సిన అధినేత ఫామ్ హౌస్ కే పరిమితం అవడంతో అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అధినేత తీరు మాత్రం మారడం లేదని కేసీఆర్ వైఖరిపై సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారని అంటున్నారు.. పూర్తి కథనం.. https://raashtra.com/brs-the-secret-of-the-resignation-of-brs-sitting-mps-has-been-exposed-is-this-happening/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 7.. Komati Reddy Venkat Reddy : హరీశ్ రావు చూపులు బీజేపీ వైపు.. వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..! హైదరాబాద్, రాష్ట్ర: తెలంగాణలో కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) నేతల మధ్య డైలాగ్ వార్ కాకపుట్టిస్తోంది. ఇప్పటికే హస్తం నేతలు బీఆర్ఎస్ నేతలపై విమర్శల వర్షం ఏకధాటిగా కురిపిస్తుండటం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య రాజకీయ సమరం ఆసక్తికరంగా మారింది. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటవ తేదీనే జీతాలు చెల్లిచడంపై స్పందించిన కోమటిరెడ్డి.. హరీశ్ రావుపై విమర్శలు గుప్పించారు. నాలుగు సంవత్సరాలుగా సమయానికి జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగులను తిప్పలు పెట్టిన గత ప్రభుత్వం తప్పులను దాచి.. హరీష్ రావు (Harish Rao) జీతాలు ఎక్కడ అంటూ అడిగారు కదా.. చూడండి. ఇప్పుడున్నది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వమని అన్నారు. శనివారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావుకు ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వకపోతే బీజేపీ (BJP)లోకి వెళ్తాడని నెన్సేషనల్ కామెంట్ చేశారు. కేటీఆర్ (KTR) ఇప్పటికీ కేసీఆర్ (KCR) చాటు కొడుకే అని సెటైర్ వేశారు. కేటీఆర్ మాదిరిగా తండ్రి పేరుతో రాజకీయాల్లోకి రాలేదని తెలిపిన వెంకట్ రెడ్డి.. తాను ఉద్యమాలు చేసి వచ్చానన్నారు. మేం జీరో బిల్ ఇచ్చినట్లుగా కేటీఆర్ కి జీరో నాలెడ్జ్ ఉందని విమర్శించారు. నాలెడ్జ్ లేని కేటీఆర్ గురించి మాట్లాడటం వృథా అని ఎద్దేవా చేశారు.. కాళేశ్వరం కట్టించిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఎంపీ అభ్యర్థులపై అంతర్గత సర్వే జరుగుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. భువనగిరి నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీని కోరానని చెప్పారు. భువనగిరి, ఖమ్మం, నల్గొండలో దక్షిణాదిలో టాప్ మెజార్టీ వస్తుందని ఈసారీ మోడీ కంటే రాహుల్ గాంధీనే ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. యాదాద్రిని యాదగిరి గుట్టగా మారుస్తూ త్వరలో జీవో విడుదల చేస్తామని వెల్లడించారు.. పూర్తి కథనం.. https://raashtra.com/komati-reddy-venkat-reddy-harish-rao-eyes-towards-bjp-venkat-reddy-sensational-comments/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 8.. Congress : కేసీఆర్ పై కాంగ్రెస్ సంచలన ట్వీట్..!? హైదరాబాద్, రాష్ట్ర: రాష్ట్రంలో జరుగుతున్న పొలిటికల్ వార్ వేసవి వేడిని తలపించేలా ఉంది.. ఇప్పటికే కారు నేతలకు.. హస్తం నేతలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా డైలాగ్ వార్ సాగుతుండగా.. తాజాగా కాంగ్రెస్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. గత ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ నేతలు మండిపడుతుండగా.. అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపణలు చేస్తోంది.. ఈ నేపథ్యంలో పొలిటికల్లో హిట్ పెరిగేలా తెలంగాణ (Telangana) కాంగ్రెస్ పార్టీ సంచలన ట్వీట్ చేసింది. కేసీఆర్ (KCR) ఇగ ఎట్ల రావాలే మీకు బుద్ధి..? అని ట్వీట్ లో పేర్కొంది.. మరోవైపు మేడిగడ్డ డిజైన్, నాణ్యత, నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు, యావత్ మీడియా, ఇంజనీరింగ్ నిపుణులు అంతా ముక్త కంఠంతో వెల్లడిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ (BRS) స్వయం ప్రకటిత మేధావులు మాత్రం అదో అద్భుతం అంటున్నారని పేర్కొంది. జనం ఊంచితే ఊంచిరి మాకేం అన్నట్టు.. నిస్సిగ్గుగా వ్యవహరించడం బీఆర్ఎస్ కే సాధ్యం. యావత్ తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది. ఇలాంటి దొంగల ముఠాకా ఇన్నేళ్లు మేం అధికారం అప్పజెప్పిందని. తెలంగాణ ప్రజలని నిర్బంధించి, మీ బానిసలుగా చూశారు. ఈ పాపం ఊరికే పోదు. తస్మాత్ జాగ్రత్త అని ట్వీట్ లో పేర్కొంది. ఇదిలా ఉండగా ప్రధాని మోడీపై సైతం T-కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయింది. మోడీని ‘స్పీడ్ బ్రేకర్‌’గా అభివర్ణించింది. పేదలకు సాధికారత కల్పించడం ద్వారా అభివృద్ధిని కాంగ్రెస్ (Congress) వేగవంతం చేసింది, అయితే నరేంద్ర మోడీ (Narendra Modi).. కొద్దిమంది స్నేహితుల ప్రయోజనాల కోసం దేశాన్ని ఖాళీ చేస్తున్నారని పేర్కొంది. విధానాల్లో దేశ ప్రజలను అగ్రగామిగా ఉంచకుండా దేశాభివృద్ధి అసాధ్యం అని తెలిపింది.. ఇందుకు గణాంకాలే నిదర్శనం అని ట్వీట్ చేసింది. పూర్తి కథనం.. https://raashtra.com/congress-sensational-tweet-on-kcr-and-modi/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 9.. Khammam : ఖమ్మంలో బీఆర్ఎస్‌ జీరో.. కేసీఆర్ తొందరపాటు వల్లేనా..? ఖమ్మం, రాష్ట్ర: అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు పులిలా ఉన్న బీఆర్ఎస్ పరిస్థితి ప్రస్తుతం పిల్లిలా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కారు దిగుతున్న నేతలు.. పక్క పార్టీల్లోకి వలసలు వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని పెద్ద బాస్ పార్టీపై దృష్టి మరలించినట్లు జోరుగా ప్రచారం సైతం మొదలైంది. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎడారిలో నీటి చుక్కలా మారుతుందా అనే అనుమానాలు పుడుతున్నాయి.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఖమ్మం (Khammam) జిల్లాలో బీఆర్ఎస్ (BRS) తుడిచి పెట్టుకుపోయే సూచనలు కనిపిస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిక్కెట్లు నిరాకరించడంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy), తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) కాంగ్రెస్ (Congress) గూటిలో చేరారు.. వారితో పాటే క్యాడర్ సైతం వెళ్లిపోయింది. అయితే ఈ సమయంలో కేసీఆర్ వారిపై సెటైర్లు వేశారు. వారు పార్టీలోకి రాక ముందు ఒక్క సీటే ఉంది.. వారు వచ్చినా ఒక్క సీటే అని వారి అవసరం లేదనుకున్నారు. దానికి తగ్గట్లుగా ఎన్నికల్లో ఒక్క సీటే వచ్చింది. ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ తో పాలునీళ్లలా కలసిపోతున్నారు అని ఎద్దేవా చేశారు.. అప్పుడైతే పార్టీ బలంగా ఉందనే ఆవేశంలో అన్నారు.. కానీ దాని పర్యావసనం ఎన్నికల ఫలితాల్లో తేలింది. ప్రతీ చోటా యాభై వేలకుపైగా ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక్కడ బీఆర్ఎస్ ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.. మరోవైపు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోరాడింది పువ్వాడ అజయ్. ఎంపీ నామా మాత్రమే.. వీరిద్దరూ లేకుంటే బీఆర్ఎస్ జిల్లాలో జీరో... కానీ ఇప్పుడు వారు కూడా బీజేపీలో చేరేందుకు ప్లాన్ చేసుకొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమేరకు ఎంపీ నామా ముందు కాంగ్రెస్ ను సంప్రదించగా.. వారు తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ నేతలను సంప్రదించే పనిలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఖమ్మంలో బీజేపీ బలోపేతం కావాలంటే వీరి చేరిక తప్పని సరి అని అంటున్నారు.. పూర్తి కథనం.. https://raashtra.com/brs-zero-in-khammam-is-it-because-of-kcr-haste/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 10..Mahbubnagar : పాలమూరులో ప్రజాదీవెన సభ.. ఎన్నికల శంఖారావం పూరించనున్న సీఎం..! మహబూబ్‌నగర్, రాష్ట్ర: మహబూబ్‌నగర్ (Mahbubnagar) నుంచి కాంగ్రెస్ (Congress) పార్లమెంటు ఎన్నికల ప్రచారం ప్రారంభించనుంది. పాలమూరు (Palamuru) ప్రజాదీవెన సభతో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ప్రజాదీవెన సభ కోసం ఇప్పటికే సీఎంను సీడబ్ల్యూసీ ప్రత్యేకంగా ఆహ్వానించారు. మార్చ్ 6వ తేదీన సాయంత్రం 4 గంటలకు మహబూబ్‌నగర్‌, MVS కాలేజీ మైదానంలో భారీగా పాలమూరు ప్రజా దీవెన సభను నిర్వహించనున్నారు. కాగా కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల ప్రకటనతో పాలమూరులో ఇప్పటికే కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వీస్తున్నాయని భావిస్తున్నారు. ఇక మార్చి 6న జరగబోయే సభలో సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పాలమూరు న్యాయ యాత్ర చేపడుతుంది. ఈ ముగింపు సభకు ముఖ్యఅతిధిగా ముఖ్యమంత్రి రేవంత్ ని మహబూబ్ నగర్ శాసనసభ్యుల బృందం ఆహ్వానించింది. ఇటీవలే నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతలకు శంకుస్థాపన చేసి, సంగంబండ బాధితులకు ప్రభుత్వం 11 కోట్ల పరిహారం విడుదల చేసింది. ఐదు వేల కోట్ల నిధులు కొడంగల్ కు కేటాయించింది.. అయితే మార్చ్ 6 నిర్వహించే సభలో మహబూబ్ నగర్ జిల్లాకు మరిన్ని అభివృద్ధి వరాలు ప్రకటిస్తారనే అంచనాలున్నాయి. ఇక రేవంత్ ను కలిసిన వారిలో వంశీచంద్ రెడ్డి, శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి ముదిరాజ్, జి. మధుసూదన్ రెడ్డి, వేర్లపల్లి శంకర్, అనిరుద్ రెడ్డి, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ ఉన్నారు. పూర్తి కథనం.. https://raashtra.com/mahbubnagar-prajadivena-sabha-in-palamuru-cm-to-fill-election-conch/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 11. Medchal : మల్లారెడ్డికి బిగ్ షాక్ ఇచ్చిన ప్రభుత్వం.. ! మేడ్చల్, రాష్ట్ర: బీఆర్ఎస్ (BRS) మాజీ మంత్రి మల్లారెడ్డి (Malla Reddy)కి అధికారులు ఊహించని షాకిచ్చారు. గుండ్ల పోచంపల్లి (Gundla Pochampally) మున్సిపాలిటీ, హెచ్‌ఎండీఏ (HMDA) లే అవుట్‌లో సుమారు 2500 గజాల భూమిని ఆక్రమించి కాలేజీ కోసం రోడ్డు నిర్మాణం చేశారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డును అధికారులు తొలగించారు. మేడ్చల్ (Medchal) కలెక్టర్ ఆదేశాలతో నేడు అధికారులు ఈ కార్యక్రమం చేపట్టారు.. మరోవైపు గతంలో ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ వ్యహారంపై అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూమి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు.. ఇదిలా ఉండగా దీనిపై మల్లారెడ్డి స్పందించారు. తనను కావాలనే కొంతమంది టార్గెట్ చేశారని ఆరోపించారు. తనపై ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చేస్తోందని విమర్శించారు. ప్రస్తుతం అధికారం వాళ్ల చేతుల్లో ఉంది కాబట్టి ఎంతకైనా తెగిస్తారని మండిపడ్డారు.. రోడ్డు వేసే సమయంలో హెచ్ఎండీఏ అధికారుల అనుమతి తీసుకొన్నట్లు పేర్కొన్నారు. కాగా రోడ్డుకు ఉపయోగించిన 2500 గజాల స్థలానికి ప్రత్యామ్నాయంగా మరో స్థలాన్ని మున్సిపాలిటీకి ఇచ్చామని మల్లారెడ్డి వెల్లడించారు.. హఠాత్తుగా కాలేజ్ రోడ్డు తొలగించడంతో 25 వేల మంది విద్యార్థులు, అధ్యాపకులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.. కావున ప్రభుత్వం ట్రాఫిక్ సమస్య, విద్యార్థుల జీవితాల్ని దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయాలని మల్లారెడ్డి డిమాండ్ చేశారు. పూర్తి కథనం.. https://raashtra.com/medchal-government-gave-a-big-shock-to-mallareddy-demolition-of-illegal-road/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 12.. BJP : తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల..! హైదరాబాద్, రాష్ట్ర: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల తొలి జాబితా తాజాగా విడుదలైంది. ఢిల్లీ (Delhi) బీజేపీ ప్రధాన కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే (Vinod Thawde) 195 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. తెలంగాణ నుంచి తొమ్మిది సీట్ల అభ్యర్థులను ప్రకటించారు. అందరూ అనుకున్న విధంగా ముగ్గురు సిట్టింగులను ఖరారు చేశారు. మరోవైపు ఈ జాబితాలో కీలక నేతలకు కాషాయం షాకిచ్చింది. యువతకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మూడు, నాలుగు సార్లు పోటీ చేసిన సీనియర్లను పార్టీ పక్కనబెట్టింది. ఇదిలా ఉండగా ప్రధాని మోడీ మరోసారి వారణిసి నుంచి బరిలో డిగానున్నారు.. గాంధీ నగర్ నుంచి అమిత్ షా, లక్నో నుంచి రాజ్‌నాథ్ సింగ్ పోటీ చేయబోతున్నారు. ఈమేరకు తొలి జాబితాలో 34 కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. మహిళలు-28, యువకులు-47, ఎస్సీ-27, ఎస్టీ-18, ఓబీసీ-57 మంది ఉన్నారు. ఇకపోతే కేంద్రంలో బీజేపీ (BJP) మరోసారి అధికారంలోకి వచ్చేందుకు పక్కా వ్యూహంతో వెళ్తోందని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections)కు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీల కన్నా ముందుగానే 195 మందితో తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఇక తెలంగాణ (Telangana) నుంచి బరిలోకి దిగుతున్న పార్లమెంట్ అభ్యర్థుల వివరాలు చూస్తే.. బండి సంజయ్-కరీంనగర్.. అరవింద్ ధర్మపురి-నిజామాబాద్.. బిబి పాటిల్-జహీరాబాద్.. ఈటల రాజేందర్-మల్కాజిగిరి.. కిషన్ రెడ్డి-సికింద్రాబాద్.. మాధవి లత-హైద్రాబాద్.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి-చేవెళ్ల.. భరత్ గౌడ్- నాగర్ కర్నూల్.. బూర నర్సయ్య గౌడ్- భువనగిరి.. పూర్తి కథనం.. https://raashtra.com/bjp-list-of-telangana-bjp-mp-candidates-released/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 13.. Hyderabad : తెలంగాణ ప్రభుత్వం బీసీల పక్షపాతినా.. ? తెలంగాణ (Telangana) రాష్ట్రంలో బీసీ కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం పలువురి నుంచి ప్రశంసలు అందుకోంటుంది. ఈ నేపథ్యంలో బీసీ కులగణన విషయంలో ప్రభుత్వానికి అన్ని విధాలా అండగా ఉంటామని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి పేర్కొన్నారు. మేడ్చల్ (Medchal) జిల్లా పర్యటనలో భాగంగా కుత్బుల్లాపూర్ (Quthbullapur)లో నాయి బ్రాహ్మణుల ఆత్మగౌరవ భవనాన్ని పరిశీలించారు.. ఈమేరకు బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వం సహకరించాలని కోరుతూ నాయీ బ్రాహ్మణుల నాయకులు కుమార స్వామికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్తామని తెలిపారు.. తెలంగాణ ప్రభుత్వం బీసీల అభివృద్దికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.. మరోవైపు రాష్ట్రంలో కులగణన విషయంలో ప్రభుత్వం ఇటీవల చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకొన్న విషయాన్ని గుర్తు చేశారు.. బీహార్ కులగణన తరహాలో తెలంగాణలో కులగణన చేయడం అభినందనీయమన్నారు.. 2022లో బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ కులాల జనాభాను లెక్కించే లక్ష్యంతో కుల-ఆధారిత గణన నిర్వహించింది. ఈ గణన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమై, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని దుండ్ర కుమారస్వామి (Dundra Kumaraswamy) తెలిపారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, బీహార్ మాడెల్ కుల గణన చేపడతాము అని చెప్పడం అభినందనీయం అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల పక్షపాతి అని కొనియాడారు.. ఇకపోతే బీహార్ రాష్ట్రంలో కుల గణన మొదటి దశలో, అన్ని జిల్లాల్లో, బ్లాకుల్లో మరియు పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం కుటుంబాల సంఖ్యను లెక్కించి నమోదు చేశారు.. రెండవ దశలో గుర్తించిన కుటుంబాలలో వ్యక్తుల కులం, ఉపకులం, సామాజిక-ఆర్థిక వివరాలను 17 ప్రశ్నల ద్వారా డాటాను ఎనుమరేటర్లు సేకరించారని కుమారస్వామి వివరించారు.. రాష్ట్రంలో కులగణన ప్రక్రియ సరిలీకృతం చేసి, సంక్షిప్త సమాచార అధ్యయనంతో తెలంగాణ రాష్ట్రంలో వెనుక బడిన తరగతుల ప్రజలను సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా మరియు అన్నీ రంగాలలో ఎదగడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. https://raashtra.com/hyderabad-telangana-government-is-partial-to-bcs/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 03.03.2024 1.. Telangana : విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. అప్పటి నుంచి ఒంటిపూట బడులు..! హైదరాబాద్, రాష్ట్ర: తెలంగాణ (Telangana)లో అప్పుడే భానుడి ప్రతాపం మొదలైంది. రాత్రి సమయంలో వాతావరణం కాస్త చల్లబడుతున్న.. పగలు మాత్రం ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్‌ స్కూళ్లకు ఒంటి పూట బడులు (Half Day Schools) నిర్వహించ‌నున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్‌ 23 వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ఆదేశించింది. కాగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయని తెలిపింది.. అలాగే పదో తరగతి పరీక్షలు జరిగే కొన్ని పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం క్లాసులు జరిపేందుకు పర్మిషన్లు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు మార్చి నెల ప్రారంభానికి ముందే రాష్ట్రంలో ఎండలు సెగలు పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం సీఎం (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) సచివాలయంలో అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రత మార్పుల తీవ్రత దృష్ట్యా ఒంటిపూట బడులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. పూర్తి కథనం.. https://raashtra.com/telangana-good-news-for-students-since-then-off-day-schools/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 2.. KTR : న్యూ లుక్ లో కేటీఆర్.. సినిమాల్లోకి ఎంట్రీ..? హైదరాబాద్, రాష్ట్ర: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సోషల్ మీడియా (Social Media)లో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే.. ఆయన ట్విట్టర్ (X) వేదికగానే చాలా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారనే టాక్ కూడా ఉంది. అదేవిధంగా కేసీఆర్ (KCR) తనయుడుగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకొన్నారు. తెలుగు రాజకీయ నేతల్లో ఒకరైన కేటీఆర్.. ప్రత్యేకశైలితో మాట్లాడే మాటాలకు ఫ్యాన్స్ సైతం ఉన్నారు.. ఇక నిత్యం సోషల్ మీడియా వేదికగా ప్రజలకు అందుబాటులో ఉండే కేటీఆర్.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తన అభిమానులకు, బీఆర్ఎస్ (BRS) శ్రేణులకు తెలియజేస్తారని అనుకొంటారు.. ఈ క్రమంలో ఆయన నేడు న్యూ లుక్‌తో దర్శనమిచ్చారు. క్లీన్ షేవ్ చేసుకొని సరికొత్త లుక్‌తో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లో కేటీఆర్ పోస్టు చేశారు. దీంతో ఆయన అభిమానులు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. కొందరు బాలీవుడ్ హీరోలా ఉన్నవంటూ కామెంట్ పెడుతుండగా.. వెంటనే సినిమాల్లోకి వచ్చేయండి అన్న అంటూ మరికొందరు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం కేటీఆర్‌ అభిమాని ఒకరు ఏఐ టెక్నాలజీ ద్వారా ఆయన కొత్త లుక్‌లో రూపొందించారు. పొడవాటి జట్టు, గడ్డం, మీసంతో ఎడిట్‌ చేసి కేటీఆర్‌కు పంపించాడు. ఆ ఫొటోను తన అధికారిక ఎక్స్‌లో కేటీఆర్‌ షేర్‌ చేశారు. దీంతో అదికాస్త వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.. పూర్తి కథనం.. https://raashtra.com/ktr-in-new-look-entry-into-movies-viral-comments/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 3.. Fire Accidents : పలు చోట్ల అగ్ని ప్రమాదాలు.. భారీగా ఆస్తి నష్టం..! వికారాబాద్, రాష్ట్ర: వికారాబాద్ (Vikarabad) జిల్లా తాండూరు (Tandoor), మార్వాడీ బజార్‌లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభ‌వించింది. ఓ కూలర్ల దుకాణాల్లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలు దుకాణాల్లోని వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయని సమాచారం. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. కాగా స్థానికుల సమాచారం మేరకు.. ఘటనా స్థలానికి చేరుకొన్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఈ ప్రమాదంలో దాదాపు రూ.లక్షల్లో ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు పేర్కొన్నారు. అయితే, ప్రమాదం షాట్ సర్య్కూట్ వల్ల జరిగిందా.. మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇకపోతే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు మంచిర్యాల (Mancherial) జిల్లా నస్పూర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సీసీ కార్నర్, రాజా ఎలక్ట్రికల్స్ పక్కన గల ట్రాన్స్ ఫార్మర్ లో షార్ట్ సర్క్యూట్ జరిగి, భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ట్రాన్స్ ఫార్మర్ పక్కన ఉన్న రెండు షాపులు పూర్తిగా దగ్ధం అయినట్లు సమాచారం.. ఈ ప్రమాదంలో దాదాపు 50 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కాలిపోయిన రెండు షాపుల్లో భారీగా మంటలు ఎగిసి పడడంతో చుట్టు పక్కల ఉన్న ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.. పూర్తి కథనం.. https://raashtra.com/fire-accidents-fire-accidents-in-many-places-huge-loss-of-property/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 4.. Hyderabad : మజ్లిస్ కోటను బద్దలు కొట్టేందుకు.. ఓవైసీపై కొత్త ప్రయోగానికి దిగిన బీజేపీ..! హైదరాబాద్, రాష్ట్ర: లోక్‌సభ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) కోటను బద్దలు కొట్టేందుకు బీజేపీ (BJP) కొత్త వ్యూహాలను రచిస్తోందా? అని ఆలోచించే వారికి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ (Hyderabad) ఎంపీ స్థానంలో బీజేపీ కొత్త అభ్యర్థిని ప్రకటించింది. పాతబస్తీలో మజ్లిస్ ను ఓడించచం కష్టమే కానీ అసాధ్యం కాదు. హిందూ ఓట్లన్నీ ఏకీకృతం అయితే.. చీలిపోకుండా చూసుకుంటే.. మజ్లిస్ కోటను బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఇదే ఆలోచనలో ఉన్న కాషాయం ముందు చూపుతో వ్యవహరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడా బీజేపీ ఉనికిలేని రోజుల్లోనూ ఈ స్థానంలో ఎంఐఎంకి గట్టి ప్రత్యర్థిగా బీజేపీ నిలుస్తూ వస్తోంది. అయితే బీఆర్ఎస్ (BRS) ఓటమితో ఒవైసీ ప్రభావం ఎంతో కొంత తగ్గిందని, దీనికి తోడు కాంగ్రెస్ (Congress) కూడా ఎంఐఎంని గట్టిగా ఢీ కొట్టే ప్రయత్నం చేస్తోందని భావిస్తున్న బీజేపీ బలమైన, కొత్త ముఖాన్ని రంగంలోకి దించితే.. ఒవైసీ మీద గెలుపు సాధ్యమేనని అంచనా వేస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు దేశ వ్యాప్తంగా మోడీ (Modi) చరిష్మా బలంగా పనిచేస్తోంది. ఈ సమయంలో ఒక్కసారి హైదరాబాద్ ఎంపీ సీటు గెలవాలని ఆ పార్టీ అధిష్ఠానం గట్టి పట్టుదలగా ఉందని అంటున్నారు.. అందుకే, బలమైన అభ్యర్థిని రంగంలోకి దించి విజయాన్ని సాధించాలని, తద్వారా అసదుద్దీన్, అతని పార్టీకి చెక్ పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. అదీగాక కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్ అభ్యర్థులుగా బరిలో నిలిస్తే.. భారీగా ముస్లింల ఓట్లలో చీలిక రావొచ్చని బీజేపీ అంచనా వేస్తోంది. అందుకే మాధవీలత వైపు మొగ్గినట్లుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో కొంపెల్ల మాధవీలత (Kompella Madhavilatha)ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. పాతబస్తీ మూలాలున్న మాధవీలత నుదుట రూపాయి కాసంత బొట్టు పెట్టుకొని కాస్త విచిత్రంగా ఉండే వేషధారణతో ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. విరించి హాస్పిటల్స్ ఎండీగా ఎక్కువ మంది గుర్తుంచుకొంటారు. ఎన్నారై అయిన ఈమె మధు సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ అనే ఐటీ సేవల సంస్థతో పాటు అమెరికాలో ‘క్యూ ఫండ్‌’ అనే ఫిన్‌‌కార్ప్‌‌నూ నడుపుతున్నారు. మరోవైపు పాతబస్తీ కేంద్రంగా లోపాముద్రా ఫౌండేషన్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పేదల బస్తీల్లో హెల్త్ క్యాంపులు పెట్టి, ఉచితంగా మందులు ఇవ్వటం, టైలరింగ్ కేంద్రాలు పెట్టి మహిళలకు శిక్షణనిచ్చి, వారికి తగిన పనిని ట్రస్ట్ తరఫున కల్పించటంతో పాటు ప్రజ్ఞాపూర్‌ దగ్గర 4 లక్షల చదరపు అడుగుల్లో గోశాలను నిర్మించి దేశవాళీ ఆవులను పరిరక్షించుకోవాలనే ప్రచారం చేస్తున్నారు. అంతే కాకుండా కొవిడ్ సమయంలో రోజూ ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్న వందలాది మందికి భోజనాన్ని పంపి స్థానికంగా మంచిపేరు తెచ్చుకొన్నారు. అటు సాధుసంతులతో సమావేశాలు పెట్టించటం, ధార్మిక ప్రవచనాలు ఏర్పాటు చేయించి పాతబస్తీ హిందూ ఓటర్లలో చైతన్యాన్ని కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో బాగా చదువుకొన్న, ఆర్థిక వనరులున్న, హిందీలో ప్రజలతో మమేకమయ్యే మహిళను బరిలో దింపితే త్రిముఖపోరులో సత్తా చాటవచ్చని భావించిన బీజేపీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. పూర్తి కథనం.. https://raashtra.com/hyderabad-bjp-launched-a-new-experiment-against-owaisi-to-break-the-fortress-of-majlis/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 5..Ponnam Prabhakar : విమర్శలు ఆపి ఉపయోగపడే సలహాలు ఇవ్వండి.. పొన్నం ప్రభాకర్..! హైదరాబాద్, రాష్ట్ర: రాష్ట్రంలో కొలువుదిరిన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు.. ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు అమలవుతుంది. తాజాగా రూ. 500కి గ్యాస్.. 200 యూనిట్లలోపు కరెంటు ఫ్రీ వంటి పథకాలు అమలవుతున్నాయి.. వీటితో కలిపి మొత్తం నాలుగు హామీలను ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) హైదరాబాద్‌ (Hyderabad), అమీర్‌పేట్‌ (Ameerpet)లో ప్రభుత్వ ప్రతిష్టాత్మక గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీటర్ రీడింగ్ తీసి జీరో బిల్లులను మహిళలకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. తమది హామీలిచ్చి కాలయాపన చేసే ప్రభుత్వం కాదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. సుమారు వెయ్యి రూపాయల విలువజేసే కరెంట్‌ను ఒక్కో ఇంటికి ఉచితంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇలా క్రమక్రమంగా అభివృద్ధి చేస్తున్న కొత్త ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వండి కానీ.. అనవసరమైన విమర్శలు తగదని హితవు పలికారు. అదే విధంగా ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్లతో పాటు మిగతా వాగ్ధానాలు కూడా పూర్తి చేస్తామని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. మరోవైపు ఆరు గ్యారంటీల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం.. 200 యూనిట్లలోపు కరెంటు వాడే వినియోగదారులు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి నెల ప్రారంభం నుంచి అనగా శుక్రవారం నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. 200యూనిట్లకు పైన ఒక్క యూనిట్‌ అధికంగా కరెంట్‌ వాడినా పూర్తి బిల్లు కట్టాల్సిందే అని సూచించింది. పూర్తి కథనం.. https://raashtra.com/ponnam-prabhakar-stop-criticizing-and-give-useful-advice-ponnam-prabhakar/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 6.. Bhadrachalam : సీఎం రేవంత్‌ను అందుకే కలిశాను.. క్లారిటీ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే..! హైదరాబాద్, రాష్ట్ర: రాష్ట్ర రాజకీయాల్లో మరో ఘట్టం తెరపైకి వచ్చింది. భద్రాచలం (Bhadrachalam) బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ( MLA Tellam Venkata Rao), సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) కలవడం ఆసక్తికరంగా మారింది. నేడు హైదరాబాద్‌ (Hyderabad)లోని సీఎం నివాసంలో కుటుంబసభ్యులతో సహా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెల్లం వెంకట్రావుతో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా ఉన్నారు. మరోవైపు గతకొంతకాలంగా వెంకట్రావు కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.. ఇలాంటి సమయంలో ఆయన సీఎంను కలవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా.. దీనిపై ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంని కలిశానని పేర్కొన్నారు. భద్రాచలం రామాలయం అభివృద్ధిపై చర్చించినట్లు వెల్లడించారు. తెలంగాణలో ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి కలపాలని కోరినట్లు తెలిపారు. అదీగాక భద్రాచలం పట్టణంలో రెండు వార్డులు ఆంధ్రాలో ఉన్నాయని.. దీని వలన నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభావం పడుతుందని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు వివరించారు. అదే విధంగా డంపింగ్ యార్డు అంశం గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ నియోకవర్గాలుండగా.. భద్రాచలంలో మాత్రమే బీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. గతంలో బీఆర్ఎస్ లో ఉన్న తెల్లం వెంకట్రావు అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. కానీ, కాంగ్రెస్‌లో సీటు దక్కలేదు. దీంతో బీఆర్ఎస్‌లో చేరి టికెల్ దక్కించుకొని విజయం సొంతం చేసుకొన్నారు.. పూర్తి కథనం.. https://raashtra.com/bhadrachalamthis-is-why-i-met-cm-revanth-brs-mla-who-gave-clarity/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 7.. Kadapa : బెంగళూరు పేలుళ్లు.. కడప జిల్లాకు లింకులు..!? కడప, రాష్ట్ర: బెంగళూరు (Bengaluru), రామేశ్వరం కేఫ్‌లో రెండు రోజుల క్రితం బాంబు పేలడం (Bomb Blast)తో 10 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనలో నిందితుడిని గుర్తించారు. అదీగాక పేలుళ్ల కేసులో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్లు వెల్లడించారు. కాగా దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని బెంగళూరు నగర కమిషనర్​ బీ దయానంద నిన్న తెలిపారు. ఈ నేపథ్యంలో కడప (Kadapa) జిల్లాలో టెర్రరిస్టు లింకులపై తీవ్ర కలకలం రేగింది. ఈమేరకు జిల్లాలో హై అలర్ట్‌ ప్రకటించారు. మరోవైపు బెంగళూరు పేలుళ్ల ఘటన నేపథ్యంలో.. మైదుకూరు (Maidukuru)లో ఎన్‌ఐఏ (NIA) సోదాలు చేపట్టింది. మైదుకూరు మండలం చెల్రోపల్లె వద్ద పిఎఫ్‌ఐ సభ్యుడు సలీం ఓ నివాసంలో తలదాచుకొన్నట్లు అందిన సమాచారంతో అధికారులు అలర్ట్‌ అయ్యారు. ఈ క్రమంలో పక్కా ఇన్ఫర్మేషన్ తో ఎన్‌ఐఏ అధికారులు సలీంను అరెస్టు చేశారు.. కాగా పోలీసులకు అందిన సమాచారం ప్రకారం.. చెర్లోపల్లి జేసీబీ ఓనర్‌ కు ఆగంతకుడు ఫోన్‌ చేసి రెండు రోజులు తన వద్ద ఉంటానని కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చెర్లోపల్లి మస్జీద్‌ లో సలీమ్‌ తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకొన్నట్లు అనుమానిస్తున్నారు. అయితే ఇప్పటికే సలీంపై రెండులక్షల రూపాయల రివార్డ్‌ ఉంది. మరోవైపు మంగళూరులో 2022లో జరిగిన కుక్కర్​ పేలుడుకు, రామేశ్వరం కేఫ్ పేలుడుకు మధ్య సంబంధం ఉందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే.. అదేవిధంగా ఈ పేలుడుకు కారణమైన నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. పేలుడు సంభవించిన రామేశ్వరం కేఫ్​ను నిన్న సందర్శించారు. పేలుడు ఘటనలో గాయపడి బ్రూక్​ఫీల్డ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. పూర్తి కథనం.. https://raashtra.com/kadapa-bangalore-blasts-links-to-kadapa-district/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 8.. Kaleswaram : కాళేశ్వరం నిర్మాణాల అధ్యయనానికి కమిటీ నియామకం..! కాళేశ్వరం, రాష్ట్ర: తెలంగాణ (Telangana) రాజకీయాల్లో సంచలనంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలతో పాటు.. అధికార పార్టీ నేతలు మేడిగడ్డను సందర్శించారు. పలు కీలక విషయాలను వెల్లడించారు.. ఈ నేపథ్యంలో మేడిగడ్డ, అన్నారం మరియు సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలను పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించింది. ఈ మేరకు కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ సారథ్యంలో ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఈ కమిటీకి అమితాబ్ మీనా మెంబర్ సెక్రటరీగా వ్యవహరించనున్నారు. మరోవైపు మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయిన ఘటనపై కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు నుంచి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. రాష్ట్ర పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం డ్యామ్ విషయంలో అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ (Medigadda), అన్నారం (Annaram) మరియు సుందిళ్ల బ్యారేజీలపై సమగ్రంగా విచారణ జరపాలని ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ లేఖపై స్పందించిన ఎన్డీఎస్ఏ మూడు బ్యారేజీలపై కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా బ్యారేజీలను పరిశీలించి కుంగుబాటుకు, పగుళ్లు ఏర్పడటానికి గల కారణాలను కమిటీ సభ్యులు విశ్లేషించాలని సూచించింది. అదేవిధంగా తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలను కూడా తెలపాలన్న ఎన్డీఎస్ఏ (NDSA) .. నాలుగు నెలల్లో నివేదికను అందించాలని కమిటీకి తెలిపింది. ఇదే సమయంలో కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్ట్ నిర్మాణంలో కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన గులాబీ పెద్ద బాస్ ఇప్పటి వరకు నోరు మెదపక పోవడంపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి.. పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.. పూర్తి కథనం.. https://raashtra.com/kaleswaram-appointment-of-committee-to-study-kaleswaram-structures/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 9.. Medigadda : వరద నీటితో బురద రాజకీయం.. బీఆర్ఎస్ ఆసక్తికర వీడియో ట్వీట్.. ! హైదరాబాద్, రాష్ట్ర: రాష్ట్రంలో పాలకులు మారిన కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం నిప్పులా రగులుతూ ఉంది. ఇప్పటికే తెలంగాణ (Telangana)లో అధికార విపక్షాల మధ్య వార్ కాస్తా ప్రాజెక్ట్ వార్ గా మారిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.. చిన్న చిన్న రిపేర్లు చేస్తే ఉపయోగపడే ప్రాజెక్ట్ ను కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని గులాబీ నేతలు ఆరోపిస్తే.. పాలమూరుపై కేసీఆర్ (KCR) పగ పెంచుకొని ప్రాజెక్టులు పెండింగ్ పెట్టారని కాంగ్రెస్ (Congress) ఫైర్ అవుతోంది. ఇదే సమయంలో కాళేశ్వరం (Kaleswaram) కుంగడంతో డిఫెన్స్ లో పడ్డ బీఆర్ఎస్ (BRS) ఎదురుదాడికి సిద్ధమైందని తెలుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో కాళేశ్వరం ఎఫెక్ట్ ఊహించని విధంగా పడటంతో.. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు లైట్ గా తీసుకొంటే కాంగ్రెస్ తో మరింత డ్యామేజ్ తప్పదనుకున్నారో ఏమోగానీ.. వరద రాజకీయం కాస్త బురద రాజకీయంగా మార్చారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మరో కొత్త రాగాన్ని అందుకొందని అంటున్నారు.. మేడిగడ్డ (Medigadda) బ్యారేజీ పై కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్.. ట్విట్టర్ వేదికగా మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల ఆసక్తికర వీడియో ఒకటి పోస్ట్ చేసింది. వీడియోలో కుంగిన పిల్లర్ల వద్ద వరద నీరు పారుతోందని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పిల్లర్ల వద్దకు భారీగా వరద నీరు చేరుతుందని పేర్కొంది. నామమాత్రంగా మరమ్మత్తు చర్యలు చేపట్టి వరద నీటితో కుంగిన పిల్లర్లను మరింత దెబ్బతీయాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని ఆరోపించింది. వరద నీటితో బురద రాజకీయం చేసి బీఆర్ఎస్‌ని బద్నాం చేయాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలు మానుకోవాలని సూచించింది. మేడిగడ్డ పిల్లర్లకు ఏమైనా జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని బీఆర్ఎస్ ట్విట్టర్ వేదికగా హెచ్చరించింది. మొత్తానికి జల వివాదాలు, ప్రాజెక్టుల నష్టాలపై పోరాటాలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదని వీరి వాలకం గమనించిన వారు అనుకొంటున్నారు.. పూర్తి కథనం.. https://raashtra.com/medigadda-kaleswaram-flood-water-mud-politics-brs-interesting-video-tweet/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 10.. Warangal : బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కమలం గూటికి కీలక నేత..? వరంగల్‌, రాష్ట్ర: తెలంగాణ (Telangana)లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ (BRS)లో చోటు చేసుకొంటున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.. ఇప్పటికే కారు వదిలి వెళ్తున్న నేతల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండగా.. తాజాగా వరంగల్‌ జిల్లాలో గులాబీ పార్టీకి మరో బిగ్ షాక్ తలిగింది. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ (Aroori Ramesh) పార్టీకి, తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గులాబీని వదిలి కమలంలోకి వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే కొద్ది రోజుల క్రితం బీజేపీ (BJP) అగ్ర నేతలు ఆయనను కలిసినట్లు సమాచారం. మొత్తానికి రమేష్ పార్టీ మారుతుండటంతో ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో బీఆర్ఎస్ కి బిగ్ షాక్ తగిలినట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీలో సరైన గుర్తింపు లేదని కండువాలు మార్చుకొంటున్న నేతలు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నారు.. ఇవే ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చాయి.. రమేష్ కూడా గత కొంతకాలంగా తనకు పార్టీలో సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లు చర్చించుకొంటున్నారు.. ఇక ఆయన అనుచరులు కూడా ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.. కానీ రమేష్ పార్టీ వీడితే వచ్చే నష్టాన్ని అంచనా వేసుకొన్న అధిష్టానం.. అగ్ర నేతలతో బుజ్జగింపు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మొదట ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఈ బాధ్యతలను అప్పగించింది. కానీ అందుకు కడియం అంగీకరించలేదని తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను రంగంలోకి దించింది. ఆరూరి రమేష్‌ను పార్టీ మారకుండా బస్వ రాజు బుజ్జగిస్తున్నారు. కానీ రమేష్ మాత్రం పార్టీ మారేందుకే సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ స్థానానికి ఆయన పోటీకి దిగే అవకాశం ఉందని అప్పుడే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్‌లో చేరేందుకు ఇప్పటికే 15మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధమైన విషయం తెలిసిందే. పూర్తి కథనం.. https://raashtra.com/warangal-big-shock-for-brs-key-leader-in-bjp/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 11.. BRS : కరీంనగర్‌ నుంచి ఎన్నికల శంఖారావం.. ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్..! కరీంనగర్‌, రాష్ట్ర: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections)కు బీఆర్ఎస్ (BRS) శంఖారావాన్ని పూరించింది. ఈ నెల 12న కరీంనగర్‌ (Karimnagar), ఎస్సారార్‌ డిగ్రీ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో నేడు కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ నేతలతో.. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. అనంతరం పెద్దపల్లి (Peddapally) నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. మరోవైపు ఎంపీ అభ్యర్థులపై గులాబీ బాస్ ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న పలువురి పేర్లను ఖరారు చేసినట్టుగా సమాచారం. బోయినపల్లి సంతోష్ కుమార్, కరీంనగర్‌ నుంచి బరిలో నిలవనుండగా.. పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నేతలతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. అదేవిధంగా యువతకు పెద్ద పీట వేయాలని భావిస్తున్న గులాబీ బాస్.. సికింద్రాబాద్ నుంచి తలసాని సాయి కిరణ్ యాదవ్, వరంగల్ (Warangal) నుంచి కడియం కావ్య, నల్గొండ నుంచి గుత్తా అమిత్ రెడ్డి, జహీరాబాద్ నుంచి పోచారం భాస్కర్ రెడ్డి పేర్లను దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక మల్కాజిగిరి లేదా చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి కాసాని వీరేశంను బరిలోకి దింపాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీకి నిరాకరిస్తున్నారు. ఇప్పటికే అధిష్ఠానం ఆయన పేరుని ఖరారు చేసినప్పటికీ ఆయన సుముఖంగా లేరని అంటున్నారు. దీంతో చేవెళ్ల టికెట్‌‌పై బీఆర్ఎస్ లో అనిశ్చితి కొనసాగుతోంది. ఇక మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి ఎవరు పోటీ చేయనున్నారనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది.. ఇలా మొత్తానికి గులాబీ మళ్ళీ వికసించాలని చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయో చూడాలి అనుకొంటున్నారు.. పూర్తి కథనం.. https://raashtra.com/brs-shankharavam-for-the-election-from-karimnagar-kcr-has-finalized-the-mp-candidates/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 12.. Medak : అధికారుల నిర్లక్ష్యం.. చెరుకు తోటకు నిప్పంటించిన రైతు..! మెదక్, రాష్ట్ర: రాజకీయాల్లోకి వచ్చిన వారి ఆస్తులు పెరుగుతున్నాయి.. పాలకులు మారుతున్నారు.. కానీ రైతుల బ్రతుకులు మాత్రం ఎప్పుడు ఒడిదుడుకుల ప్రయాణంలా సాగడం కనిపిస్తుంది. పండిన పంటకు గిట్టుబాటు ధర లేక.. ప్రకృతి సహకరించక.. చేసిన అప్పులు తీరక ఇలా అడుగడుగున అవరోధాలు పలకరిస్తున్నా నిరతంతరం శ్రమిస్తున్న కర్షకుడికి.. పాలకుల కనికరం కోసం ఎదురు చూడటం తప్పడం లేదు.. ఇక తాజాగా ఒక రైతు అధికారులు పట్టించుకోలేదని.. చెరుకు తోట (Sugarcane plantation)కు నిప్పంటించాడు.. మెదక్ (Medak) జిల్లా కౌడిపల్లి (Kaudipalli) మండలం సదాశివ పల్లి (Sadashiva Palli) గ్రామానికి చెందిన రైతు తన చెరుకు తోటకు నిప్పంటించాడు. ఆఫీసుల చుట్టూ ఎంత తిరిగినా అధికారులు పట్టించుకోలేదని ఆవేదనతో.. ఇలా చేశానని రైతు కృష్ణ గౌడ్ తెలిపారు. చెరువు కట్టపై నుంచి పంట పొలానికి 6 సంవత్సరాల క్రితం దారి ఏర్పాటు చేసుకోన్నానని పేర్కొన్నారు. అయితే ఇదే గ్రామానికి చెందిన కొందరు కక్షపూరితంగా దాన్ని తొలగించారని అధికారులకు కంప్లేంట్ ఇచ్చాడు. తన పట్ట భూమి నుంచే దారిని తొలగించడంతో.. ఆగ్రహించిన రైతు.. ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆరోపించాడు. ఇప్పటివరకు తనకు న్యాయం జరగలేదని ఆవేదనతో చెరుకు తోటకు నిప్పటించాయినట్లు తెలిపాడు. పూర్తి కథనం.. https://raashtra.com/medak-negligence-of-the-authorities-the-farmer-set-fire-to-the-sugarcane-plantation/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 04.03.2024 1.. Nalgonda : నాగార్జునసాగర్ ఫారెస్ట్‌లో అగ్నిప్రమాదం.. ఆరు ఎకరాలకు వ్యాపించిన మంటలు..! నల్లగొండ, రాష్ట్ర: వేసవిలో మండే ఎండలకు అగ్నిప్రమాదాలు చోటు చేసుకొనే అవకాశం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా అడవులు అకారణంగా కాలిపోవడం కనిపిస్తోంది. ఇప్పటికే వేసవి పూర్తిగా ఎంటర్ కాకముందే.. ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో అడవులలో అగ్నిప్రమాదాలు జరగడం తరచుగా కనిపిస్తోంది.. తాజాగా నల్లగొండ (Nalgonda) జిల్లా అమ్రాబాద్ (Amrabad) టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ (Tiger Reserve Forest)లో మంటలు చెలరేగాయి.. నాగార్జునసాగర్ కోర్ ఫారెస్ట్‌, మూలతండా, సమీపంలో మంటలు చెలరేగాయి. ఆదివారం రాత్రి సమయంలో ఫారెస్ట్‌లోని గుట్టపైన మంటలు మొదలైయ్యాయని తెలుస్తోంది. చిన్నగా అంటుకొన్న నిప్పు, క్రమేణా పెద్దివి కావడంతో స్థానిక తండావాసులు ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్‌ సిబ్బంది వచ్చే సరికి సుమారు ఆరు ఎకరాల్లోని అడవికి మంటలు వ్యాపించాయి. దీంతో సమీపంలో నివసిస్తున్న తండావాసులు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు స్థానిక ఫారెస్ట్‌ సిబ్బంది.. మంటలు వ్యాపించిన ప్రాంతానికి వెళ్లి ఫైర్‌బ్లోయర్ల సహాయంతో వాటిని ఆర్పారు. కిలోమీటరు మేరమంటలు అంటుకోవడంతో మంటలను అదుపులోకి తేవడానికి తీవ్ర ఇబ్బంది కలిగినట్లు తెలిపారు.. కాగా ఈ అగ్నిప్రమాదానికి కారణం.. నాగార్జునపేట ప్రాంతం రైతులు పత్తికట్టెతో పాటు చెలకలలో ఉన్న చెత్తచెదారాలను తగుల బెట్టి వాటిని ఆర్పకుండానే వెళ్ళినట్లు తెలుస్తోంది.. ఆసమయంలో వీచిన గాలికి సమీపంలోగల అటవీ ప్రాంతం అంటుకొందని తెలుస్తోంది. పూర్తి కథనం.. https://raashtra.com/nalgonda-fire-in-nagarjunasagar-forest-fire-spread-to-six-acres/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 2.. America : అమెరికా అధ్యక్ష పదవి రేసులో నిక్కీ హేలీకి ఊరట..! అమెరికా, రాష్ట్ర: రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష పదవి అభ్యర్థి రేసు ఉత్కంఠంగా సాగుతుంది. భారత సంతతి మహిళ నిక్కీ హేలీ (Nikki Haley)కి.. అమెరికా (America) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)కు మధ్య పోరు పోటాపోటీగా ఉన్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికే నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న అధ్యక్ష ఎన్నికలలో హేలీకి కాస్త ఊరట లభించింది. వాషింగ్టన్‌ (Washington)లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో హేలీకి 62.9శాతం ఓట్లు రాగా, మాజీ అధ్యక్షుడు ట్రంపు 33.2శాతం ఓట్లు నమోదు చేసుకొన్నట్లు సమాచారం. హేలీ 19 మంది ప్రతినిధులను కైవసం చేసుకొంది. నామినేషన్ ప్రక్రియలో ఇది నిక్కీకి మొదటి గెలుపు. దీంతో వాషింగ్టన్‌లో రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రైమరీ ఎన్నికల్లో గెలిచిన మొదటి మహిళగా హేలీ నిలిచింది. అయితే హేలీ తన సొంత రాష్ట్రమైన సౌత్ కరోలినాలో 40 శాతం ఓట్లను మాత్రమే గెలుచుకున్నారు. ఇక్కడ ట్రంప్ 47 మందిని కైవసం చేసుకొగా.. హేలీ కేవలం ముగ్గురు డెలిగేట్‌లను మాత్రమే పొందినట్లు తెలుస్తోంది. కాగా, అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు ముందే రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల అభ్యర్థిత్వానికి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో అయోవా, న్యూ హాంప్‌షైర్, నెవాడా, సౌత్ కరోలినా సహా 8 రాష్ట్రాల్లో ట్రంప్ విజయం గెలుపొందారు. తదుపరిగా మంగళవారం ఏకంగా 15 రాష్ట్రాల్లో ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే వాషింగ్టన్‌లో రిపబ్లికన్లు ట్రంపును తిరస్కరించడం ఇదే తొలిసారి కాదు.. 2016లోనే ఇక్కడ జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలయ్యారు. ఇక అధికారం చేపట్టాలనే ఆరాటంలో ఉన్న ట్రంప్ ను విజయం ఉరిస్తుందని తెలుస్తోంది.. పూర్తి కథనం.. https://raashtra.com/america-nikki-haley-relief-in-the-us-presidential-race/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 3.. Rangareddy : రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. ముగ్గురు పిల్లలను హతమార్చిన తండ్రి..! హైదరాబాద్, రాష్ట్ర: రంగారెడ్డి (Rangareddy) జిల్లా శంకర్ పల్లి (Shankar Pally) మండలం టంగుటూరు (Tanguturu)లో తీవ్ర విషాదం చోటు చేసుకొంది. కన్న తండ్రి యముడిలా మారి తన పిల్లల ప్రాణాలు తీసిన సంఘటన నాన్న అనే పదానికి మచ్చగా మారింది. కారణం ఏదైనా కన్న పిల్లలను నిర్దాక్షిణ్యంగా కాటికి పంపి తానుకూడా ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చూస్తే.. స్థానికంగా నివాసం ఉంటున్న రవి(35) తన ముగ్గురు పిల్లలను చంపి.. అనంతరం తాను కూడా చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకొన్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా తండ్రి రవి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకొన్న మోకిలా పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా వెయ్యికి రూ.3వేల ఇప్పిస్తానని రవి పలువురి వద్ద డబ్బు సేకరించినట్లు సమాచారం. డబ్బు తీసుకొన్న వ్యక్తి తిరిగి ఇవ్వకపోవడంతో రవి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు తూప్రాన్ (Thupran) మండలం ఇస్లాంపూర్ (Islampur) గ్రామంలో ఘోరం చోటు చేసుకొంది. గ్రామానికి చెందిన గొల్ల వంశీ (25) పై తండ్రి కిష్టయ్య మరొకరితో కలిసి కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆరు నెలల క్రితమే కిష్టయ్య భార్య ఆత్మహత్య చేసుకోగా.. కొడుకు తాగుడుకు బానిసయ్యాడు. కోడలు సైతం పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో విసుగు చెందిన కిష్టయ్య.. తన వద్ద ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న లక్ష్మణ్‌తో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సమాచారం.. పూర్తి కథనం.. https://raashtra.com/rangareddy-deep-tragedy-in-ranga-reddy-district-father-killed-three-children/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 4.. Chennai : రూటు మార్చిన రజనీ కాంత్.. పేద ప్రజల కోసం బిగ్‌ ప్లాన్‌..!? చెన్నై, రాష్ట్ర: పేద ప్రజల కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) కీలక నిర్ణయం తీసుకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. పేదలకు అతి విలువైన వాటిలో వైద్యం ఒకటి.. ప్రస్తుతం ఇది చాలా ఖరీదుగా మారిన సంగతి తెలిసిందే.. అయితే పేదలకు ఉచిత వైద్య సదుపాయాలు అందించేందుకు భారీ ఆసుపత్రిని రజనీ నిర్మిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక సూపర్ స్టార్ హోదా ఉన్నా.. సాదా సీద జీవితాన్ని ఇష్టపడే రజనీకాంత్ అంటే ఇష్టం లేని వారుండరు.. ఇదిలా ఉండగా వాస్తవానికి ఒకగానొక సమయంలో రజనీ రాజకీయ ప్రవేశం చేయాలని భావించారు. కానీ వయసురిత్యా వచ్చే అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు వస్తాయిని వెనక్కు తగ్గిన విషయం తెలిసిందే.. రాజకీయాల్లోకి రానప్పటికీ సేవా కార్యక్రమాలను కొనసాగించాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు తన రాజకీయ పార్టీని సమాజ్ సేవా సంఘ్‌గా మార్చిన విషయం తెలిసిందే. అయితే సేవా భావం ఉన్న రజనీకాంత్.. పేదల కోసం ఒక ఆసుపత్రిని (Hospital) నిర్మించాలనే ప్లాన్‌ లో భాగంగా.. తమిళనాడు (Tamil Nadu), చంగల్‌పట్టు (Changalpattu) జిల్లా తిరుప్పురూర్‌ (Tiruppurur)లో 12 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారని ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల క్రితమే 12 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకొన్నారని అంటున్నారు.. అందరికీ అందుబాటులో అక్కడ ఆసుపత్రిని నిర్మించాలని రజనీ ఉన్నారట. త్వరలో భూమి పూజ కూడా ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ స్థలంపై కచ్చితమైన సమాచారం బయటకు రానప్పటికీ ఆసుపత్రి నిర్మాణం కోసమే ఈ భూమిని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఇక సినిమాలలో తనదైన మ్యానరిజంతో అభిమానులను ఏర్పరచుకొన్న రజనీకాంత్.. ఇటీవల నటించిన లాల్‌ సలామ్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అంతగా మెప్పించలేక పోయింది. ప్రస్తుతం వెట్టయాన్‌ అనే మూవీలో నటిస్తున్నారు. దీని తర్వాత లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తారని తెలుస్తోంది. పూర్తి కథనం.. https://raashtra.com/chennai-rajinikanth-who-has-changed-his-route-big-plan-for-poor-people/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 5.. Lok Sabha Elections : రంగంలోకి దిగుతున్న కేసీఆర్.. ఎంపీ ఎన్నికల ప్రచారానికి సిద్దమైన రోడ్ మ్యాప్..! హైదరాబాద్, రాష్ట్ర: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి పలు విమర్శలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్.. ప్రస్తుతం జరగనున్న లోక్ సభ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటుందనే అనుమానాలను రేకెత్తించింది. ఇప్పటికే కారు దిగే నేతలతో సతమతం అవుతున్నట్లు తెలుస్తోంది. అయినా ఇంత వరకు కేసీఆర్ మౌనంగా ఉండటం నేతల్లో చర్చాంశనీయాంగా మారింది. మొత్తానికి అసంతృప్తులతో రగిలిపోతున్న బీఆర్ఎస్ భవిష్యత్తుపై రాష్ట్రంలో ఉత్కంఠత నెలకొంది.. అయితే ఈ సమయంలో పార్లమెంట్ ఎన్నికలను (Parliament Elections) గులాబీ ప్రతిష్టాత్మంగా తీసుకొందనే వార్త వినిపిస్తోంది. ఇందులో గులాబీ బాస్ పార్లమెంట్ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు చర్చించుకొంటున్నారు.. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ఓటమి.. అంతలోనే గాయం కారణంగా కొన్నాళ్లు పాలిటిక్స్‌కు బ్రేక్ ఇచ్చిన కేసీఆర్ (KCR) .. పార్లమెంట్ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో తిరిగి యాక్టివ్ అవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ (Telangana) భవన్‌లో నిన్న ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా, ఎన్నికలకు మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉండటంతో బీఆర్ఎస్ (BRS) ఎన్నికల శంఖారావం పూరించనుంది. లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుపే లక్ష్యంగా కేసీఆర్ ఎన్నికల ప్రచారం షురూ చేయనున్నారని అనుకొంటున్నారు. ఈ మేరకు కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార రోడ్ మ్యాప్ సిద్ధం అయ్యింది. బీఆర్ఎస్‌కు అచ్చొచ్చే కరీంనగర్‌లో ఈ నెల 12న భారీ బహిరంగా సభతో ఎంపీ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు రోజులు పర్యటించేలా షెడ్యూల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అదేవిధంగా పార్లమెంట్ సెగ్మెంట్లలో భారీ బహిరంగ సభలతో పాటు.. రోడ్ షోలు నిర్వహించే ప్లాన్ లో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం.. మరోవైపు ఎన్నిలా దృష్ట్యా బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) నేతలు ఇప్పటికే దూకుడు పెంచారు.. దీంతో రాష్ట్రంలో జరిగే త్రీముఖ పోరులో విజయం ఎవరిని వరిస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే కనుమరగు అవుతుందనే అపవాదు మూటగట్టుకొన్న బీఆర్ఎస్ కు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయని అనుకొంటున్నారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో మరో సమరం సిద్దం అవుతోంది. పూర్తి కథనం.. https://raashtra.com/lok-sabha-elections-kcr-entering-the-field-road-map-ready-for-mp-election-campaign/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 6.. Hyderabad : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పట్టుబడిన బంగారం.. విలువ ఎన్నికోట్లు అంటే..! హైదరాబాద్, రాష్ట్ర: హైదరాబాద్ (Hyderabad), శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయం (Airport )లో ఆక్రమంగా తరలిస్తున్న బంగారం భారీగా పట్టుబడింది. గుట్టు చప్పుడు కాకుండా విదేశాల నుంచి తీసుకొస్తున్న బంగారం (Gold) కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కింది. అదీగాక నిందితులు బంగారాన్ని దాచిన తీరు ఆశ్చర్యానికి గురిచేసిందని అధికారులు వెల్లడించారు.. ఇక కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి వివిధ దేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయంకి వచ్చిన ప్రయాణికులను, కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు.. ఈ క్రమంలో అనుమానం వచ్చి, లగేజీ బ్యాగుతో పాటు ప్రయాణికులను స్కానింగ్ చేశారు. వీరిలో ముగ్గురు వ్యక్తుల వద్ద బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ప్రయాణికులు బంగారం ముక్కలను శరీర భాగంలో, పురుషనాలంలో, హార్డ్వేర్ టూల్స్‌తో పాటు లగేజీ బ్యాగులలో అక్రమంగా పెట్టి తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తం అయిన అధికారులు ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకొని వారివద్ద నుంచి రూ.6.03 కోట్ల విలువ చేసే 13.65 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు. ముగ్గురు ప్రయాణికులను అరెస్టు చేసి కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు విమానాశ్రయాలే అడ్డగా స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు.. ఏ మాత్రం భయం లేకుండా యధేచ్చగా బంగారం స్మగ్లింగ్ (Smuggling)కు పాల్పడటం కనిపిస్తోంది. అధికారులు కట్టుదిట్టంగా తనిఖీలు నిర్వహిస్తున్నా దిరికే వారు దొరుకుతున్నారు.. ఇలా ఇప్పటికే భారీగా బంగారం పట్టుబడుతున్న ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. అదీగాక రకరకాల దారుల్లో ప్రయత్నాలు చేస్తున్న చివరికి అధికారులు వారి ఆటలు సాగనివ్వడం లేదు.. పూర్తి కథనం.. https://raashtra.com/hyderabad-heavily-seized-gold-at-shamshabad-airport-the-value-of-these-is-in-crores/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 7.. Lok Sabha Elections : ఎంపీ ఎన్నికల్లో పోటీపై కీలక వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళి సై.. హైదరాబాద్, రాష్ట్ర: ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలపై జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో అన్ని పార్టీల నేతలు గ్రౌండ్ వర్క్ స్టార్ చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ (Telangana)లో అధికార కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections)పై ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త పొలిటికల్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతుంది. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు గత కొన్ని రోజులుగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోతున్నారని పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన గవర్నర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఒక సాధారణ కార్యకర్తనని.. తనకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేశానని తెలిపారు. భవిష్యత్‌లో కూడా తనపై నమ్మకంతో ఏ బాధ్యతలు అప్పగించిన తప్పక నిర్వర్తిస్తానని స్పష్టం చేసిన తమిళి సై.. దేవుడు కరుణించి, బీజేపీ హై కమాండ్ అవకాశమిస్తే చూద్దామని అన్నారు.. మరోవైపు గతంలో రెండు సార్లు ఎంపీగా పోటీ చేసిన గవర్నర్ ఓటమి పాలయ్యారు. 2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తూకూడి నుంచి ఎంపీగా పోటీ చేసి పరాజయం చవి చూశారు. మరో మూడు పర్యాయాలు అసెంబ్లీకి పోటీ చేసినా.. ఆమెను గెలుపు పలకరించలేదు. అయితే పార్టీకీ ఆమె చేసిన సేవలను గుర్తించిన బీజేపీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్‌లో తెలంగాణ గవర్నర్‌గా నియమించారు. 2021 నుంచి పుదుచ్చేరి లెప్టెనెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.. ఇదిలా ఉండగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400 ఎంపీ సీట్లు టార్గెట్ పెట్టుకొంది. దక్షిణ భారతదేశంలో గతంలో కన్నా సీట్ల సంఖ్యను పెంచుకోవాలని ఆపరేషన్ సౌత్ స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగానే తెలంగాణ గవర్నర్‌గా తనదైన ముద్ర వేసుకొన్న తమిళి సై (Governor Tamili Sai)ని పార్లమెంట్ బరిలోకి దించాలనే ప్లాన్ లో బీజేపీ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా గత బీఆర్ఎస్ సర్కార్‌తో ఢీ అంటే ఢీ అనే తీరులో వ్యవహరించి తమిళి సై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో తమిళి సైని ఆమె సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి మరోసారి పోటీలో నిలపాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో గవర్నర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి పొలిటికల్ ఎంట్రీకి క్లియర్ అనే సూచనలు ఇస్తున్నట్లు భావిస్తున్నారు.. పూర్తి కథనం.. https://raashtra.com/lok-sabha-elections-governor-tamili-sai-made-key-comments-on-the-contest-in-the-mp-elections/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 8.. PM Modi : కాళేశ్వరం స్కామ్ లో బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ కుమ్మక్కు.. మోడీ సంచలన వ్యాఖ్యలు..! ఆదిలాబాద్‌, రాష్ట్ర: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణ (Telangana) లో బీజేపీ (BJP) దూకుడు పెంచింది. క్షేత్రస్థాయిలో.. మోడీ సర్కార్ పథకాలు, తీసుకొచ్చిన సంస్కరణలను ప్రచారం చేస్తోంది. ఇక విజయమే టార్గెట్ గా చేపట్టిన విజయ సంకల్ప యాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌ (Adilabad)లో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ (Modi), ఇది ఎన్నికల సభ కాదని, అభివృద్ధి ఉత్సవమని పేర్కొన్నారు. 15 రోజుల్లో 5 ఎయిమ్స్‌ సంస్థలను ప్రారంభించామని, సమ్మక్క-సారక్క సెంట్రల్‌ ట్రైబల్‌ వర్సిటీని స్థాపించామని పేర్కొన్నారు. రాంజీ గోండ్‌ పేరుతో హైదరాబాద్‌ (Hyderabad)లో ఆదివాసీ మ్యూజియం ప్రారంభించామని తెలిపారు. తెలంగాణ రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. అంతేకాకుండా దేశంలో 7 మెగా టెక్స్‌టైల్స్‌ పార్కులు త్వరలో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. అందులో ఒకటి తెలంగాణలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మోడీ గ్యారంటీ అంటే, అది కచ్చితంగా అమలయ్యే గ్యారంటీ అని స్పష్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS)పై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగుబాటు విషయంలో బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ (Congress) కుమ్మక్కవుతుందని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పరిస్థితి.. గతంలో మీరు తిన్నారు, ఇప్పుడు మేం తింటాం అన్నట్లుందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పోయి, కాంగ్రెస్‌ వచ్చినా పాలనలో మార్పు లేదని మోడీ పేర్కొన్నారు. నా కోసం దాచుకోవాలనే ఆరాటం లేని ఒంటరిని అని తెలిపిన ప్రధాని.. 140 కోట్ల ప్రజలే నా కుటుంబం. ప్రజల కలల సాకారం కోసం ప్రతిక్షణం పని చేస్తానని తెలిపారు.. తెలంగాణలో రామమందిర ద్వారాలు తయారవడం ఈ రాష్ట్ర ప్రజల అదృష్టమని తెలిపిన మోడీ.. రాముడి ఆశీర్వాదం తెలంగాణ ప్రజలపై ఎప్పుడూ ఉంటుందన్నారు. బీజేపీ వికసిత్‌ భారత్‌ కోసం కృషి చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ 400 సీట్లలో గెలవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరోవైపు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌ స్థానంలోనూ బీజేపీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. పూర్తి కథనం.. https://raashtra.com/pm-modi-brs-congress-collusion-in-kaleswaram-scam-modi-sensational-comments/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 9.. Lok Sabha Elections : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి ఈ అంశాలు కలిసి వస్తాయా..? హైదరాబాద్, రాష్ట్ర: పార్లమెంట్ ఎన్నికల తేదీని ఇంకా ఖరారు చేయలేదు.. కానీ తెలంగాణ (Telangana)లో అప్పుడే మూడు ప్రధాన పార్టీలు విజయం కోసం పరుగులు పెడుతున్నాయి.. ఇప్పటికే బీజేపీ (BJP) 9 మంది అభ్యర్థులను ప్రకటించగా, సూత్రప్రాయంగా ఐదుగురి పేర్లను బీఆర్ఎస్ (BRS) ప్రతిపాదించింది. అదేవిధంగా ఇటీవల అధికారం చేపట్టిన కాంగ్రెస్ (Congress) సైతం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా 17 ఎంపీ స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలిపి కనీసం 14 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకోవాలనే భావనలో హస్తం ఉందని అంటున్నారు. కాగా ఇటీవల నియోజకవర్గాల వారీగా జరిపిన సర్వేల్లో పార్టీకి బలం చేకూరినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న డెవలప్‌మెంట్, సంక్షేమ పథకాలు పార్టీ బలాన్ని పెంచుతాయని భావిస్తోన్న కాంగ్రెస్.. బీజేపీని, బీఆర్ఎస్ ను ఢీకొట్టే విధంగా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో అమలవుతున్న మహాలక్ష్మీ, గృహలక్ష్మీ వంటి పథకాలు మహిళలపై తీవ్ర ప్రభావం చూపుతాయని వారంతా తమ పార్టీ వైపే మొగ్గు చూపుతారనే ఆశలో హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఫ్రీ బస్సు సౌకర్యం వల్ల మహిళల ఓటు బ్యాంకుకు ఢోకా లేదనే ధీమాలో నేతలున్నట్లు సమాచారం. అదీగాక గత ప్రభుత్వం పై కాళేశ్వరం ప్రాజెక్టు, గొర్రెల స్కీం, ఆవుల స్కీం, హెచ్ఎండీఏలతో పాటు ఆయా శాఖల్లో జరిగిన అవినీతి అంశాలు వెలుగులోకి తేవడం కాంగ్రెస్ కు అనుకూలంగా మారాయని నేతలు అనుకొంటున్నారు.. జనాన్ని గోస పెడుతున్న ధరణి పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం.. రైతు భరోసా పేరిట రైతుబంధును కంటిన్యూ చేయడం ఈ స్కీంకు నిధులు విడుదల చేయడం తమకు బోనస్ అని హస్తం పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ కు ధీటుగా త్వరలోనే ఎంపీ అభ్యర్థులను ప్రకటించి ఎలక్షన్ క్యాంపెయిన్ వేగవంతం చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం.. ఇక అసెంబ్లీ ఎన్నికల విజయంతో ఆత్మవిశ్వాసాన్ని అందనంత ఎత్తులో పెంచుకొన్న కాంగ్రెస్.. సార్వత్రిక ఎన్నికల్లో తమ బలాన్ని చూపిస్తుందా? లేక చతికిల పడి.. బీఆర్ఎస్ విమర్శలకు చిక్కుతుందా? అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.. అదీగాక T-కాంగ్రెస్ తన స్ట్రాటజీ తో టార్గెట్ రీచ్ అవుతుందా? లేదా? అనే చర్చలు సైతం మొదలైనట్లు తెలుస్తోంది. పూర్తి కథనం.. https://raashtra.com/lok-sabha-elections-will-these-factors-come-together-for-the-victory-of-the-congress-in-the-general-elections/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 10.. Supreme Court : ప్రశ్నకు నోటు కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ! ఢిల్లీ, రాష్ట్ర: ఎంపీ (MP), ఎమ్మెల్యే (MLA)ల లంచం కేసులపై సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం సంచలన తీర్పును వెల్లడించింది. లంచం కేసుల్లో చట్టసభ్యులకు మినహాయింపు లేదని, వారు విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. కాగా నేడు ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో రాజ్యాంగ రక్షణ కల్పించడంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) నేతృత్వంలో, ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు ప్రకటించింది. లంచం కేసుల్లో చట్టసభ సభ్యులకు ఎలాంటి మినహాయింపు లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో పార్లమెంటు, అసెంబ్లీలలో లంచాలు తీసుకుంటే ఎవరైనా తప్పకుండా విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఏకగ్రీవ తీర్పును వెల్లడించింది. మరోవైపు 1998లో లంచం కేసుల్లో చట్టసభ్యులకు రాజ్యాంగ రక్షణ కల్పిస్తూ అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. లంచానికి పార్లమెంటరీ అధికారాల ద్వారా రక్షణ లేదని 1998 నాటి సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగంలోని 105, 194 అధికరణలకు విరుద్ధమని CJI జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. లంచం ప్రజా జీవితంలో విశ్వసనీయతను దెబ్బతీస్తుందని అందువల్ల ఉపేక్షించలేమని తెలిపారు. ఇదిలా ఉండగా లంచం అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) స్పందించారు. ఈ తీర్పు స్వచ్ఛమైన రాజకీయాలను బలపరుస్తుందని అన్నారు. ప్రజలకు వ్యవస్థపై విశ్వాసాన్ని పెంపొందించేలా ఉందని ట్వీట్ చేశారు. చట్ట సభల్లో ప్రసంగించేందుకు, ఓటు వేయడానికి లంచం తీసుకొన్న సభ్యులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించారు. పూర్తి కథనం.. https://raashtra.com/supreme-court-sensational-judgment-of-the-supreme-court-in-questionable-note-cases/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 11.. Telangana : లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా.. ఫస్ట్‌ లిస్ట్‌లో ఛాన్స్ వీరికే..! హైదరాబాద్, రాష్ట్ర: రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS)పై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెడుతూ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితా వచ్చేసింది. 4 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత కేసీఆర్‌ (KCR) ప్రకటించారు. వారిలో కొప్పుల ఈశ్వర్, బి. వినోద్ కుమార్, నామ నాగేశ్వర్ రావు, మాలోత్ కవిత ఫస్ట్‌ లిస్ట్‌లో చోటు దక్కించుకొన్నారు. అదేవిధంగా ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణ (Telangana) భవన్‌లో నేడు జరిగిన సమావేశంలో కీలక విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఓటములకు కుంగిపోవాల్సిన అవసరం లేదని, అలా కుంగిపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేవారమా అని నేతల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అన్న కేసీఆర్, ఎన్నో గొప్ప పనులు చేసిన ఎన్టీఆర్ (NTR) అంతటి వారికే తిప్పలు తప్పలేదని వ్యాఖ్యానించారు. పాలనపై కాంగ్రెస్ (Congress) ప్రభుత్వానికి అవగాహన రావడం లేదన్న ఆయన, సర్కార్ తీరుపై ప్రజల్లో విసుగు ప్రారంభమైందని తెలిపారు. ప్రభుత్వానికి ప్రతిపక్ష రుచి చూపుదామని పిలుపునిచ్చారు. ఏడాది, రెండో ఏడాది, ఐదేళ్లు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పూర్తి సిద్ధంగా ఉండాలని తెలిపారు. రాబోయే కాలం తమదేనని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం (Khammam)లో అద్భుతమైన అభివృద్ధి చేశామని, కరీంనగర్ తర్వాత ఖమ్మంలో కూడా సభ పెట్టుకుందామని తెలిపారు. నేతలు కలిసికట్టుగా పని చేసి, పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు.. ఈ క్రమంలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. ఇక పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ (Karimnagar), బి.వినోద్ కుమార్, ఖమ్మం, నామ నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత బీఆర్‌ఎస్‌ తరఫున బరిలో దిగనున్నారు. మరోవైపు బీఆర్ఎస్‌ను వీడుతున్న నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడుతున్న వారితో మనకు ఎలాంటి నష్టం లేదని నేతలకు ధైర్యం చెప్పారు. పూర్తి కథనం.. https://raashtra.com/telangana-the-first-list-of-lok-sabha-candidates-they-have-a-chance-in-the-first-list/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 05.04.2024 1.. Hyderabad : ఛీ ఛీ.. నేటి సమాజంలో మానవత్వం పూర్తిగా మంటగలిసి పోయింది..! హైదరాబాద్, రాష్ట్ర: ప్రస్తుత సమాజంలో మాటలు చెప్పేవారు ఎక్కువైయ్యారు.. మంచిని ఆచరించేవారు తక్కువైయ్యారు అని కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఇక మానవత్వం గురించి గంటలు గంటలు స్పీచ్ ఇచ్చేవారు అది చూపించే సమయం వచ్చినప్పుడు ముఖం చాటేయడం కనిపిస్తుంది. మొత్తానికి నేటి సమాజంలో మానవత్వం పూర్తిగా మంటగలిసి పోయిందనడానికి ఈ ఘటన చాలు అని కొందరు అంటున్నారు.. ఇంతకు ఏం జరిగిందంటే.. రోడ్డుప్రమాదంలో నిన్న సాయంత్రం ఓ జవాన్ మృతి చెందారు.. ఈ విషాద ఘటన నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డు పై చోటు చేసుకొంది. హైదరాబాద్ (Hyderabad), గోల్కొండ (Golconda) ఆర్టిలరీ కేంద్రంలో విధులు నిర్వహించే కునాల్ అనే ఆర్మీ జవాన్ (Army jawan), నార్సింగి (Narsinghi) వద్ద నిలబడి ఉండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందారు. నడిరోడ్డుపై అతని మృత దేహం గంటల తరబడి అలానే పడి ఉందని తెలుస్తోంది. అయితే ప్రజల కోసం సేవ చేసే ఒక జవాన్ నడి రోడ్డుపై చనిపోయి ఉన్న అటుగా వెళ్తున్న ఒక్కరు కూడా పట్టించుకోన్న పాపాన పోలేదని తెలుస్తోంది. రోడ్డుపై అటుగా ఎన్నో వాహనాలు వెళ్తున్న ఒక్కటి కూడా ఆపకూండా అలాగే చూస్తూ వెళ్లిపోయారు. తప్ప మృతి చెందిన జవాన్ శరీరాన్ని పక్కకు తీసే ప్రయత్నం గానీ.. కనీసం అధికారులకు సమాచారం ఇద్దామనే ఆలోచన కూడా ఏ ఒక్కరూ చేయలేదు. నిజమైన మానవత్వం ఉన్న వారి మనస్సును ఈ దృశ్యం కంటనీరు పెట్టించేలా ఉంది. అయితే ఎవరో వీడియో మాత్రం తీశారు.. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. సమాజంలోని మనుషుల్లో మానవత్వం చచ్చిపోయిందంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మానవత్వం మరుగున పడిపోయిందని, ప్రస్తుతం ఉన్న సొసైటీని చూస్తుంటే సిగ్గేస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.. పూర్తి కథనం.. https://raashtra.com/hyderabad-humanity-has-completely-burnt-out-in-the-society/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 2.. Hyderabad : నాచారం పారిశ్రామిక ప్రాంతంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..! హైదరాబాద్, రాష్ట్ర: వేసవి ఎంట్రీ ఇచ్చింది. మండే ఎండలకు తోడు ఉక్కబోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ క్రమంలో తరచుగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు నగరవాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.. అదీగాక పట్టణంలో అగ్నిప్రమాదాలకు ఒక సమయం అంటూ లేదు. కానీ వేసవిలో మాత్రం ఈ ఘటనలు పెరిగే అవకాశాలున్నట్లు ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. అందులో గత సంవత్సరం నుంచి భారీగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం కనిపిస్తున్నది.. మరోవైపు నేటి ఉదయం నాచారం (Nacharam) పారిశ్రామిక వాడాలో భారీ అగ్నిప్రమాదం (Fire Hazard) సంభవించింది. శ్రీకర్ బయోటెక్ అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ తయారీ పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. కెమికల్ మెటీరియల్ ఎక్కువ ఉండడంతో భారీగా మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకొన్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు సమాచారం.. ఈ నేపథ్యంలో ఫైరింజన్ తో మంటలను అదుపు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, కానీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఫైర్ ఆఫీసర్ నాగేశ్వర్ రావు (Nageshwar Rao) మాట్లాడుతూ.. గోడౌన్ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తుందా లేదా అనేది విచారణ చేస్తున్నామని తెలిపారు. ఒకవేళ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకొంటామని వెల్లడించారు.. ఇదిలా ఉండగా నగరంలో ఉన్న పారిశ్రామిక ప్రాంతాలలో (Industrial Area) ఎండల వేడికి ఎక్కువగా అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి.. అందువల్ల ప్రమాదం జరిగాక చర్యలు చేపట్టే బదులు.. ప్రమాదాల నివారణపై అవగహాన కలిగిస్తూ.. ముందు జాగ్రత్తగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని తనిఖీలు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.. పూర్తి కథనం.. https://raashtra.com/hyderabad-fire-in-nacharam-industrial-area-heavy-damage-to-property/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 3.. Telangana : రెడీ అయిన ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్.. తొలి దశ అర్హులు ఎవరంటే..? భద్రాచలం, రాష్ట్ర: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తుంది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) జరగనున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా కార్యక్రమాలను పూర్తి చేసేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే 6 గ్యారంటీల్లో కీలక మైన ఇందిరమ్మ ఇండ్ల స్కీం (Indiramma Indlu Scheme) అమలుకు సిద్దం అయ్యింది. అయితే ఈ పథకానికి లక్షల సంఖ్యలో అప్లికేషన్లు రావటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోన్న ప్రభుత్వం.. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన గైడ్ లైన్స్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన జీవోను త్వరలో అధికారికంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా భద్రాచలం నియోజకవర్గం, బూర్గంపాడ్​లో మార్చి 11న నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ పథకానికి సంబధించిన గైడ్ లైన్స్ ప్రారంభించనున్నారు. ఈ సభలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన స్కీం అమలు, లబ్ధిదారుడి ఎంపిక, దశల వారీగా ఫండ్స్ రిలీజ్, స్కీం అర్హత వంటి తదితర అంశాలపై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి గైడ్ లైన్స్ ను హౌసింగ్ అధికారులు ప్రభుత్వానికి అందచేసినట్లు తెలుస్తోంది. కాగా సీఎం రేవంత్ రెడ్డి, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైనల్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లను తొలి దశలో సొంత జాగాలు, బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్లకు అందించననున్నారని తెలుస్తోంది. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 70 గజాల జాగాలో 400 SFT లో, బెడ్ రూమ్, హాల్, కిచెన్ ఉండేలా ఇందిరమ్మ ఇంటి ప్లాన్ డిజైన్ చేసి ప్రభుత్వానికి అందచేశారు. అలాగే గతంలో ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూం తీసుకొన్న వాళ్లు దీనికి అనర్హులని అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా సొంత జాగా ఉన్న వాళ్ల కు రూ.5 లక్షలను అందించనున్నారు. కానీ ఒక్కో దశలో రూ.1.25 లక్షల చొప్పున నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాకు జమ చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు ప్రజావాణిలో ఇందిరమ్మ ఇండ్ల స్కీం​కు మొత్తం 82 లక్షల అప్లికేషన్లు రాగా.. గతంలో ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ లు లబ్ది పొందినవారు 18 లక్షలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి కథనం.. https://raashtra.com/telangana-the-final-list-of-indiramma-houses-that-are-ready-who-are-the-first-stage-eligibles/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 4.. Hyderabad : పీర్జాదిగూడలో హై టెన్షన్.. అక్రమ నిర్మాణాలు కూల్చివేత..! మేడ్చల్, రాష్ట్ర: ప్రభుత్వ భూమిలో నిర్మించిన నిర్మాణాలపై అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు.. గతప్రభుత్వ హయాంలో భారీగా కబ్జాలు చోటు చేసుకొన్నాయనే ఆరోపణలున్న నేపథ్యంలో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు.. వాటిని గుర్తించి కూల్చివేస్తున్నారు. తాజాగా మేడ్చల్ (Medchal) జిల్లా మేడిపల్లి (Medipalli) మండలం పీర్జాదిగూడ (Pirjadiguda) మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకొంది. పర్వతాపూర్ సాయిప్రియా కాలనీ సర్వే నంబరు 1, 10,11 సీలింగ్ స్థలంలో వెలసిన నివాసా సముదాయాలను మంగళవారం తెల్లవారు జామున రెవెన్యూ అధికారులు.. పోలీసు బందో బస్త్ మధ్య పలు నివాసాలను నేలమట్టం చేశారు. అక్కడ ఉన్న మొత్తం 15 ఎకరాల స్థలంలో దాదాపు 300 వందలకు పైగా ప్లాట్లు ఉన్నాయి. అయితే కోర్టు పరిధిలో ఉన్న 70 ఇళ్లను అధికారులు ముట్టుకోలేదు. అయితే ప్రభుత్వ భూమిలో కూల్చివేతలు చేపట్టగా అప్పుడు కొందరు బాధితులు అడ్డుకొని కోర్టు‌ను ఆశ్రయించారు. కోర్టు కేసు ఉన్నవాటిని కాకుండా మిగతా వాటిని మంగళవారం ఉదయం రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. గతంలో ఇంటి నంబర్లు ఇస్తామంటే చందాలు వేసుకుని కొందరికి కోట్లలో డబ్బు ముట్ట జెప్పామని తక్షణమే కొత్త ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని.. జీవో 118ను సవరించి తమకు న్యాయం చేయాలని వేడుకొంటున్నారు. ఇదిలా ఉండగా కొందరు భాదితులు కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వ భూమిని తెలియకుండా మోసపోయి కొన్నారు. అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. అయితే గత ప్రభుత్వం ఇచ్చిన 118 జీవో‌తో వీరి సమస్యలు తొలగి పొతాయాని భావించారు.. కానీ అప్పటికే సీలింగ్ ల్యాండ్‌లో నిర్మాణంలో ఉన్నవాటికి మాత్రమే 118 జీవో అమలవుతుందని తెలపడంతో.. కొందరు వారు కొన్న సీలింగ్ ల్యాండ్‌లో నిర్మాణాలు చేపట్టారు. పూర్తి కథనం.. https://raashtra.com/hyderabad-high-tension-in-peerjadiguda-demolition-of-illegal-structures/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 5.. Modi : ప్రపంచానికి భారత్‌ ఆశాకిరణంలా మారింది.. మోడీ..! సంగారెడ్డి, రాష్ట్ర: లోక్ సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ (BJP) బహిరంగ సభలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) రెండు రోజులు తెలంగాణ (Telangana)లో పర్యటిస్తున్నారు.. నేడు సంగారెడ్డి (Sangareddy) జిల్లా పర్యటనలో ఉన్న ప్రధాని, పటేల్ గూడాలోని ఎస్ఆర్ ఇన్ ఫినిటిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ.. కేంద్రం రాష్ట్ర అభివృద్దికి కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్ వే అని తెలిపారు. దేశవ్యాప్తంగా రూ.56వేల కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. సంగారెడ్డిలో రూ.9వేల కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. బేగంపేటలో తొలి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించినట్లు వెల్లడించారు.. దేశంలో ఎయిర్ పోర్టుల సంఖ్య పదేళ్లలో రెట్టింపు చేశామని వివరించారు. వికసిత్ భారత్ దిశగా మా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ప్రధాని.. ఘట్ కేసర్-లింగంపల్లి మధ్య ఎంఎంటిఎస్ రైళ్లను ప్రారంభించామని... ఈ ఎంఎంటీఎస్ తో అనేక ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతోందని పేర్కొన్నారు. మౌళిక సదుపాయాల కోసం బడ్జెట్ లో రూ.11 లక్షల కోట్లు కేటాయించామని తెలిపారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధాని అన్నారు. తాను ఇచ్చిన మాట ప్రకారం ఆర్టికల్‌ 370 రద్దు హామీ అమలు చేశామన్న ప్రధాని.. ప్రపంచం గర్వించే రీతిలో అయోధ్యలో రాముడి ప్రతిష్ఠాపన జరిగిందని తెలిపారు. ఇప్పటికే ప్రపంచానికి భారత్‌ ఆశాకిరణంలా మారిందని అభివర్ణించారు. ప్రపంచ దేశాల్లో తెలుగు ప్రజలు కీలకభూమిక పోషిస్తున్నారని కితాబు ఇచ్చారు. వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నట్లు, కుటుంబ పార్టీల వల్ల ప్రతిభ ఉన్నవారికి అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. అంతేకాకుండా యువతకు అవకాశాలు దొరకట్లేదని ప్రధాని వివరించారు. అంతకుముందు ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయాన్ని ప్రధాని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయం దగ్గర అర్చకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం మోడీకి ఆశీర్వచనం చేసిన పూజారులు... అమ్మవారి వస్త్రంతో తో పాటు మహంకాళి ఫొటో ఫ్రేమ్ ను బహుకరించారు. పూర్తి కథనం.. https://raashtra.com/modi-india-has-become-a-ray-of-hope-for-the-world-modi/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 6.. Modi : ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నది హిందుస్థాన్ కాదా.. ? మోడీ సంచలన వ్యాఖ్యలు..! సంగారెడ్డి, రాష్ట్ర: ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) వరుస పర్యటనలతో తెలంగాణ (Telangana)లో పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. ఈ ఎలక్షన్‌ సీజన్‌ వేసవిని తలపించేలా మంటెక్కుతోంది. నిన్న ఆదిలాబాద్‌లో పర్యటించిన ప్రధాని.. పవర్‌ఫుల్‌ పంచ్‌లతో రెండు పార్టీలకూ చెమటలు పట్టిస్తున్నారు. మూడోసారి విజయమే లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు.. ఇక నేడు సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పై పలు విమర్శలు చేశారు. తెలంగాణను కాంగ్రెస్ (Congress) కొత్త ఏటీఎంగా మార్చుకుందని, బీఆర్ఎస్, కాంగ్రెస్‌లది అవినీతి బంధం అని ఎద్దేవా చేశారు. వీరిద్దరూ ఒకే నాణేనికి రెండు ముఖాలని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ (BRS) మధ్య పొత్తు ఉందన్న విషయం ప్రజలందరికి అర్థమైందన్నారు. బీఆర్ఎస్ వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం పేరుతో దోచుకుందని ఆరోపించారు. ఒకరి స్కామ్‌ను మరొకరు కప్పిపుచ్చుకొంటున్నారని విమర్శించారు. ప్రజలను మోసం చేస్తూ.. ఆడే ఇలాంటి ఆటలు ఎక్కువ రోజులు సాగవని.. సర్జికల్ స్ట్రైక్స్ చేయడానికి గానీ, వైమానిక దాడులు చేసేందుకు గానీ మోడీ సర్కార్ వెనుకాడదని పేర్కొన్నారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నది హిందుస్థాన్ కాదా? మోడీ హామీ నెరవేరిందా లేదా? అని ప్రశ్నించారు. కొన్నేళ్లలో భారత్‌ను ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చబోతున్నామని.. ఈ హామీ కూడా నెరవేరుతుందని.. ఎందుకంటే ఇది మోడీ గ్యారంటీ అని తెలిపారు. మరోవైపు కుటుంబ పార్టీలపై విరుచుకుపడ్డ మోడీ.. జమ్మూ కశ్మీర్‌ నుంచి తమిళనాడు వరకు ఎక్కడైనా సరే.. కుటుంబ పార్టీలు ఉన్న చోట కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయని.. రాష్ట్రాలు మాత్రం బాగుపడలేదని మండిపడ్డారు. కుటుంబ పార్టీలు అధికారంలో ఉన్నచోట.. యువతకు అవకాశాలు దొరకడం లేదని అన్నారు. మోడీకి కుటుంబం లేదని విమర్శించడంపై ఆగ్రహించిన ఆయన.. ఈ దేశ ప్రజలే తన కుటుంబం అని చెప్పారు. వాళ్లు ఫ్యామిలీ ఫస్ట్ అని అంటున్నారని.. మోడీ మాత్రం నేషన్ ఫస్ట్ అని భావిస్తారని తెలిపారు. నల్లధనాన్ని దాచుకోవడానికి కుటుంబ పార్టీల సభ్యుల భారతదేశం వెలుపల బ్యాంకు ఖాతాలను తెరుస్తారని.. తాను మాత్రం పేదలకు జన్ ధన్ ఖాతాలు తెరిచి వారి వృద్ధికి తోడ్పడుతున్నాని పేర్కొన్నారు. వారి పిల్లలను ఉద్ధరించడానికి కుటుంబ పార్టీలు భారతదేశ వనరులను విక్రయించారని.. తాను దేశ ప్రజల పిల్లల కలలను నిజం చేయడానికి ప్రయత్నిస్తున్నానని మోడీ తెలిపారు.. పూర్తి కథనం.. https://raashtra.com/modi-isnt-hindustan-the-fastest-growing-in-the-world-modi-sensational-comments/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 7.. Medchal : అన్నం-స్వీట్ లో పురుగులు.. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ లీలలు..! మేడ్చల్, రాష్ట్ర: మాజీ మంత్రి, మేడ్చల్ (Medchal) ఎమ్మెల్యే మల్లారెడ్డి (MLA Mallareddy) ఇంజినీరింగ్ కాలేజ్(Engineering College)లో ఉద్రిక్తత చోటు చేసుకొంది. లక్షలకు లక్షలు ఫీజు తీసుకొనే ప్రైవేట్ కళాశాలో స్టూడెంట్స్ కు వడ్డించే అన్నంలో పురుగులు రావడం కలకలం సృష్టించింది. హైదరాబాద్ (Hyderabad) శివారు గండి మైసమ్మలో ఉన్న MREC క్యాంపస్ లో గత రాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాత్రి డిన్నర్ సమయంలో తీసుకొనే అన్నం, స్వీట్ లో పురుగులు వచ్చాయని ఆరోపించిన విద్యార్థులు యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్యాంపస్ లో నిరసన చేపట్టారు. క్వాలిటీ ఫుట్ పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. వీ వాంట్ జస్టీస్ అంటూ నినాదాలు చేశారు. అయితే గతంలో కూడా తమకు అందిస్తున్న భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.. ఆ సమయంలో స్వయంగా కళాశాల చైర్మన్ మల్లారెడ్డి ఇకపై భోజనం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనితో విద్యార్థులు తమ నిరసన విరమించుకున్నారు. కానీ మరోసారి ఇదే సమస్య ఉత్పన్నం అవడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మల్లారెడ్డి వచ్చేంత వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. దీంతో క్యాంపస్ లో ఉద్రిక్తత నెలకొంది. ఇక విద్యార్థులకు అందించే భోజనం విషయంలో యాజమాన్యం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడుతున్న విద్యార్థులు.. తల్లిదండ్రులకు దూరంగా లక్షల కొద్ది ఫీజులు ధారపోసి ఉంటున్న తమ ఆరోగ్యాలతో కాలేజీ యాజమాన్యం ఆడుకోవడం దారుణమని వాపోయారు. ఇప్పటికైనా ఈ విషయంలో స్పందించి తమ విషయంలో న్యాయం చేయాలని కోరుతున్నారు.. మరోవైపు ఓ ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలల్లోని విద్యార్థులు నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారని ఆందోళన చేపట్టడం నిజంగా సిగ్గుచేటనే విమర్శలు వినిపిస్తున్నాయి.. లక్షలకు లక్షలు ఫీజులు చెల్లించే విద్యార్థుల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక ప్రభుత్వ హాస్టళ్లల్లో ఉండే విద్యార్థులకు ఎమ్మెల్యే మల్లారెడ్డి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు.. పూర్తి కథనం.. https://raashtra.com/medchal-insects-in-rice-sweet-atrocity-in-mallareddy-engineering-college/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 8.. Jogu Ramanna : మోడీ ఆదిలాబాద్ పర్యటనపై జోగురామన్న సంచలన వ్యాఖ్యలు..! అదిలాబాద్, రాష్ట్ర: ప్రధాని మోడీ (Modi) ఆదిలాబాద్‌ జిల్లా పర్యటనపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ (BRS) జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న (Jogu Ramanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధాని పర్యటనపై ఆశలు పెట్టుకున్న ప్రజలకు నిరాశే మిగిలిందని తెలిపారు.. ఇది ముమ్మాటికి సంకల్ప సభ కాదు. ప్రజలను నిరాశపర్చిన సభగా అభివర్ణించారు. ఆదిలాబాద్‌లో మీడియాతో మాట్లాడిన రామన్న.. టెక్స్ టైల్ పార్కు ఇవ్వని మోడీ.. ఎందుకు వచ్చినట్టని ప్రశ్నించారు. సిసిఐ పరిశ్రమతో పాటు.. అదిలాబాద్ (Adilabad)టు ఆర్మూర్ రైల్వే లైన్, విమానాశ్రయ ఏర్పాటు తో పాటు టెక్స్టైల్ పార్క్ నిర్మాణంపై ఎంతగానో ఎదురుచూస్తున్న ఆదిలాబాద్ ప్రజానీకాన్ని ప్రధాని మరోసారి నిరాశ నిస్పృహలకు గురి చేశారని ఆరోపించారు.. బీజేపీ (BJP) నేతలు ఆదిలాబాద్ పై చిన్న చూపు చూసారని విమర్శించారు. రాష్ట్రంలో నలుగురు ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపిస్తే.. మీరిచ్చే గౌరవం ఇదేనా అని మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో ఎన్నికల సభ నిర్వహించారని, ఇప్పటి దాకా మీ డ్రామాలు నడిచాయని అన్నారు. మోడీ, రేవంత్ రెడ్డి పొగుడుకోవడం తప్ప జిల్లా ప్రజలకు ఒరిగింది ఏంటని ప్రశ్నించారు.. గతంలో కేంద్రహోంశాఖ సహాయ మంత్రి సీసీఐను సందర్శించి త్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు ఉలుకు పలుకు లేదని రామన్న ఆరోపించారు. ఆదివాసీలు అని గొప్పలు చెప్పే బీజేపీ.. ఆదివాసీ అయిన సిట్టింగ్ ఎంపీకి ఎందుకు టికెట్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ (Congress), బీజేపీ నేతల మధ్య ఉన్న రహస్య ఒప్పందం నిన్నటి సభతో బయటపడిందన్నారు.. ఈ రెండు పార్టీలు గ్యారంటీల పాట పాడుతు ప్రజలను మభ్యపెట్టడం అలవాటు చేసుకొన్నాయని విమర్శించారు. నిన్నటి దాకా చౌకిదారు.. ఇప్పుడు మోడీకా పరివార్ అంటూ సెటైర్లు వేశారు.. వారసులు ఉంటే తప్పేం కాదు.. నీకు వారసులు లేరని, మా పార్టీల నుంచి తీసుకొని తెల్లారే టికెట్లు ఇస్తున్నారన్నారని రామన్న మండిపడ్డారు.. పూర్తి కథనం.. https://raashtra.com/joguramanna-sensational-comments-on-modi-visit-to-adilabad/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 9.. Telangana : డీఎస్పీ ప్రణీత్ రావు ఘనకార్యాలు.. సంచలనంగా మారిన ఆయన చర్యలు..! హైదరాబాద్, రాష్ట్ర: తెలంగాణ (Telangana) పోలీస్ శాఖ, డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు (Dugyala Praneeth Rao)ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చట్ట విరుద్దమైన చర్యలకు పాలడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. తాజాగా ఈ అంశంలో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. కేసీఆర్ (KCR) ప్రభుత్వంలో అప్పటి కాంగ్రెస్ (Congress) సహా ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు గుర్తించిన అధికారులు మరిన్ని సంచలన నిజాలు బయటపెట్టారు.. అప్పటి అధికార పార్టీకి దాసోహమైన ప్రణీత్ రావు.. ఎస్ఐబీ (SIB) ఆఫీస్ లో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను మాయం చేసినట్లు గుర్తించారు. 42 హార్డ్ డిస్క్‌లను ఎత్తుకెళ్లినట్లు తేల్చారు. 1600 పేజీల కాల్ డేటాను తగులబెట్టినట్లు నిర్ధారించారు. కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు.. కాల్ రికార్డులు ఐఎంఈ నెంబర్లు ధ్వంసం చేసినట్లు అధికారులు కనుగొన్నారు. మరోవైపు హార్డ్ డిస్క్‌లు, ల్యాప్ టాప్ సైతం ధ్వంసం చేసినట్లు తేల్చారు. అదేవిధంగా డేటాబేస్‌లోని మొత్తం డేటాను రిమూవ్ చేసినట్లు గుర్తించిన అధికారులు.. ఎలక్ట్రీషియన్ సాయంతో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి.. రికార్డులను ధ్వంసం చేసినట్లు తేల్చారు.. ఇక గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ డీఎస్పీగా పనిచేస్తున్న ప్రణీత్ రావు.. దాదాపు 30 మంది పోలీసు సిబ్బందితో ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు వెలుగులోకి రావడంతో.. నిన్న సస్పెన్షన్ వేటు పడింది. ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలతో పాటు, మాజీ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించిన వారి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావుపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందగా.. ఇంటర్నల్ ఎంక్వైరీలో రూల్స్ బ్రేక్ చేసినట్లు తేలడంతో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు.. ఇదే సమయంలో మరోసారి రాష్ట్రంలో భారీగా పోలీసు ఉన్నతాధికారుల బదిలీలు చోటు చేసుకొన్నాయి. ఒకేసారి 47 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ, డీజీపీ రవి గుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో.. ఒక పార్లమెంట్ పరిధిలో, గత నాలుగేళ్లలో మూడు సంవత్సరాల పాటు పనిచేసిన వారిని బదిలీ చేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ బదిలీలు చేపట్టారని సమాచారం.. పూర్తి కథనం.. https://raashtra.com/telangana-dsp-praneet-rao-achievements-his-actions-became-a-sensation/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 10.. Telangana : ఎన్నాళ్ళు ఎదురు చూపులు.. న్యాయం కోసం ప్ర‌జా భ‌వ‌న్‌కు డీఎస్సీ బాధితులు..! హైదరాబాద్, రాష్ట్ర: రాష్ట్రంలో డీఎస్సీ (DSC) 2008 బాధితుల కష్టాలు ఇంకా తీరడం లేదు.. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ తమ ఆవేదన ఇలాగే కొనసాగుతున్నాయని కన్నీళ్ళు పెట్టుకొంటున్న బాధితులు నేడు ప్ర‌జా భ‌వ‌న్‌ (Praja Bhavan)కు భారీగా త‌ర‌లివ‌చ్చారు. త‌మ‌కు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలంటూ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. సుమారు 300 మందికి పైగా అభ్యర్థులు రాష్ట్రం నలుమూలల నుంచి త‌ర‌లివ‌చ్చారు. రాష్ట్ర హైకోర్టు తమకు ఉద్యోగాలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సైతం గతంలో హామీ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోపే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి.. వారి జీవితాల్లో వెలుగు నింపిందని పేర్కొన్న బాధితులు.. డీఎస్సీ 2008కి చెందిన వెయ్యి మంది బాధితుల కన్నీళ్లను తుడవాలని కోరారు. ఈ అంశంపై సీఎం త‌క్ష‌ణ‌మే స్పందించి త‌మ‌కు న్యాయం చేయాల‌ని విజ్ఞప్తి చేశారు.. ఇదిలా ఉండగా.. 2008లో నాటి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌ 6వ తేదీన 35 వేల పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించింది. ఎస్జీటీ పోస్టులను కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేస్తామని, బీఈడీ (BED), డీఈడీ (DED)అభ్యర్థులు అర్హులని పేర్కొంది. సుమారు 50 రోజుల తర్వాత ఎస్జీటీ పోస్టుల్లో 30 శాతం డీఈడీ అభ్యర్థులకు కేటాయిస్తూ 2009 జనవరి 29వ తేదీన జీవో నంబర్‌ 28ను తీసుకొచ్చింది. అయితే ఈ విషయంలో బీఈడీ అభ్యర్థులు కోర్టుకు వెళ్లగా కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ కూడా ఇదే ప్రకారం భర్తీ చేయాలని సూచించింది. దీంతో నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం 2010 జూన్ 21న.. జీవో 27ను విడుదల చేసింది. దీని ప్రకారం అధికారులు నియామక కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఆతర్వాత జరిగిన సంఘటనల వల్ల అధికారులు కౌన్సిలింగ్ నిలిపివేశారు. దీంతో మంచి మార్కులు సాధించినా ఉద్యోగం రాక ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 3500 మంది బీఈడీ అభ్యర్థుల కలలు కుప్పకూలిపోయాయి. ఇందులో తెలంగాణ అభ్యర్థులు 1200 మంది వరకు ఉన్నారు. అప్పటి నుంచి వారు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వం చుట్టూ.. కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ధర్నాలు, రాస్తా రోకోలు, నిరాహార దీక్షలు.. ఇలా అన్ని ప్రయత్నాలు చేశారు. అయితే 2013 జూలై 15న సుప్రీంకోర్టు బీఈడీ అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. అయినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే న్యాయం చేస్తామని చెప్పి ఇందిరా పార్కులో హామీ ఇచ్చిన టీఆర్ఎస్.. అధికారంలోకి వచ్చాక మాట మార్చింది. దీంతో అలసిపోయిన అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పూర్తి కథనం.. https://raashtra.com/telangana-waiting-for-many-years-dsc-victims-to-praja-bhavan-for-justice/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 11.. Hyderabad : తెలంగాణలో బయటపడ్డ మరో స్కామ్..! హైదరాబాద్, రాష్ట్ర: తెలంగాణలో మరో స్కామ్ వెలుగు చూసింది. బల్దియాలో నకిలీ బర్త్‌, డెత్‌ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం రేపుతున్నది. నాన్ అవెలబులిటి సర్టిఫికెట్ లేకుండానే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లను అధికారులు జారీ చేసిన వైనం ఫలక్‌నుమా సర్కిల్ లో చోటు చేసుకొంది. నాన్ అవెలబులిటి సమాచారం రికార్డులలో లేకపోవడం అవినీతికి నిదర్శనంగా మారింది. గతేడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఇదే సర్కిల్ నుంచి 80 సర్టిఫికెట్స్ జారీ అయినట్లు సమాచారం. ఈ దందా సికింద్రాబాద్ (Secunderabad), చార్మినార్ (Charminar), గోషామహల్, ఖైరతాబాద్ (Khairatabad) సర్కిల్స్‌లో జోరుగా సాగినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా 1998లో జన్మించిన వ్యక్తికి నవంబర్‌లో నాన్ అవెలబూలిటి కింద సర్టిఫికెట్ జారీ అయ్యాయి.. అయితే ఆధార్, ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్, లాండ్ రిజిస్ట్రేషన్‌లకు ఘరానా మోసగాళ్లు ఈ సర్టిఫికెట్లను ఉపయోగిస్తున్నట్లు బయటపడింది. ఉన్నతాధికారుల అండదండలతో దందా నడుస్తున్నట్లు సమాచారం. అదీగాక వ్యక్తి సమస్యను బట్టి డబ్బులు లాగుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒక్కో సర్కిల్ నుంచి రూ.3 లక్షల ఆదాయం రాగా.. ఎక్కువ ఉన్న సర్కిల్‌లో ఐదు లక్షలు నెలసరి ఆదాయం వసూలు అవుతున్నట్లు సమాచారం.. మరోవైపు గత కమిషనర్ లోకేష్ కుమార్ హయాంలో దాదాపు 36 వేల ఫేక్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్ రద్దు అయ్యాయి. ఇప్పటి వరకు దానిపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో కేటుగాళ్లు మరింత రెచ్చిపోయారని అనుకొంటున్నారు.. అదీగాక ఇప్పటికే సీఎంఓహెచ్‌ (CMOH)పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆమె దగ్గర పని చేస్తున్న మహిళా ఉద్యోగులు సైతం సీఎమ్‌ఓహెచ్ తమను వేధిస్తున్నారని మేయర్‌కు ఫిర్యాదు చేశారు. ఇక జీహెచ్‌ఎంసీలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో అవినీతికి చెక్‌ పెట్టాలన్న ఉద్దేశంతో 2022 నుంచి ‘ఇన్‌స్టంట్‌ అఫ్రూవల్‌’ విధానాన్ని అమలు చేస్తున్నారు. దవాఖానల్లో జరిగే జనన, మరణాల ధ్రువపత్రాల ఆధారంగా జీహెచ్‌ఎంసీ (GHMC) పత్రాలు జారీ చేస్తుంది. వివరాలను నమోదు చేసి, సరైన పత్రాలను అప్‌లోడ్‌ చేస్తే సంబంధిత అధికారులు వాటిని పరిశీలించి వెంటనే ఆన్‌లైన్‌లోనే సర్టిఫికెట్‌ మంజూరు చేస్తారు. ఇక ఇంటి వద్ద జరిగే జనన, మరణాల వివరాలు దవాఖానల్లో అందుబాటులో ఉండవు. కాబట్టి వీటిని నాన్‌ అవైలబిలిటీగా పేర్కొంటారు. ప్రధానంగా నాన్‌ అవైలబిలిటీ ఆధారంగా జారీచేసిన జనన, మరణ ధ్రువీకరణ పత్రాల్లోనే భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. పూర్తి కథనం.. https://raashtra.com/hyderabad-another-scam-in-telangana-fraudsters-who-dont-even-leave-births-and-deaths/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 12.. KCR : కేసీఆర్‌తో ఆర్ఎస్‌ ప్రవీణ్ కుమార్ భేటీ.. పొత్తుకు సిద్దామా..? హైదరాబాద్, రాష్ట్ర: తెలంగాణ (Telangana) రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకొంది. మొన్నటి వరకు బీఆర్ఎస్ (BRS)పై ఏకతాటిగా విమర్శలు చేసిన బీఎస్పీ అధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్ (Praveen Kumar), మాజీ సీఎం కేసీఆర్‌ (KCR)తో సమావేశమయ్యారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో వీరిద్దరి భేటీ, పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. నందినగర్‌లో ఉన్న కేసీఆర్ నివాసానికి వెళ్ళిన ప్రవీణ్ కుమార్.. మరికొంత మంది నేతలు గులాబీ బాస్ ను కలిసి ముచ్చటించారు.. అయితే ఈ భేటీకి రాజకీయాలకు ఎలాంటి సంబంధ లేదని, మర్యాదపూర్వకంగానే ఆర్ఎస్పీ వచ్చి కలిశారంటూ బీఆర్ఎస్ వర్గాలు వివరణ ఇచ్చాయి. మరోవైపు చివరి శ్వాస వరకు సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం దిశవైపే నా ప్రయాణం అంటూ ట్విట్టర్ (X) ద్వారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంజాయిషీ ఇచ్చారు. కానీ అంతలోనే మరో వార్త బయటకు వచ్చింది. సెక్యులర్, లౌకిక పార్టీలు ఏకం ఆవుతున్నాయి. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు కేసీఆర్ తెలిపారు. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనేది రేపు నిర్ణయిస్తామని అన్నారు.. రేపు ప్రవీణ్ కుమార్ మాయావతితో మాట్లాడిన తర్వాత క్లారిటీ వస్తుందని వెల్లడించారు. ఇక ప్రవీణ్ కుమార్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు.. నేడు కేసీఆర్ ను కలవటం ఆనందంగా ఉందని తెలిపిన ఆయన.. మా స్నేహం తెలంగాణను పూర్తిగా మారుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నాలుగు నెలలు కాకముందే కాంగ్రెస్ (Congress)పై వ్యతిరేకత వచ్చిందని ఆరోపించిన ప్రవీణ్ కుమార్.. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు దళిత బంధుతో దళితులను ఆదుకున్నారన్నారు.. రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతుంది. కాంగ్రెస్, బీజేపీని దేశంలో కట్టడి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా బీఎస్పీ (BSP) తరపున నాగర్‌కర్నూల్‌ నుంచి ఎంపీ అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారని, అందుకు కేసీఆర్ మద్దతు కోరినట్టు తెలుస్తోంది. ఇక్కడ బీఆర్‌ఎస్ పోటీ చేయకుండా నేరుగా తనకు మద్దతు ఇవ్వాలని ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.. ఏది ఏమైనా ప్రస్తుతం ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ తో దోస్తికట్టం ఇద్దరికీ ఏ విధంగా కలిసి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.. పూర్తి కథనం.. https://raashtra.com/rs-praveen-kumar-met-with-kcr-are-they-ready-for-alliance/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 7.03.2024 1.. Telangana : రేవంత్ రెడ్డి వార్నింగ్ వెనుక ఉన్న నిజం ఇదేనా..? హైదరాబాద్, రాష్ట్ర: ప్రస్తుతం తెలంగాణ (Telangana) రాజకీయాలు ప్రజల కోసం కాకుండా.. పర్సనల్ రీవెంజ్ కోసం అన్నట్లుగా సాగుతున్నాయనే చర్చలు ప్రారంభం అయ్యాయి. గత ప్రభుత్వంలో ప్రజలకు ఒకరకమైన అనుభవం కలిగితే.. ప్రస్తుత ప్రభుత్వంలో మరో కొత్త కోణం కనిపిస్తుందని అనుకొంటున్నారు. ప్రజల సంక్షేమం కోసం కాకుండా తప్పులు తవ్వుకుంటూ.. జనానికి విసుగుపుట్టె విమర్శలు చేస్తూ నడుస్తున్న రాజకీయాలు.. అధికారం కోసం.. పదవుల కోసం మాత్రమే అనేలా ఉన్నాయనే విమర్శలు మొదలైయ్యాయి.. కొన్ని సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై బీఆర్ఎస్ (BRS) నేతల విమర్శలు పలు అనుమానాలకు చోటిస్తుండగా.. వారి తీరు అధికారం లేకుండా బ్రతలేము అనేలా ఉందని అంటున్నారు.. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సైతం గట్టిగా వార్నింగ్ ఇస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అందులో ఇతర విషయాల్లో ఎలా ఉన్నా తన ప్రభుత్వ మనుగడ గురించిన వ్యాఖ్యలు మాట్లాడే సమయంలో ఆయన పూర్తిగా కంట్రోల్ తప్పుతున్నారని అనుకొంటున్నారు. తాజాగా మహబూబ్ నగర్ (Mahbub Nagar)లో జరిగిన ప్రజాదీవెన సభలో రేవంత్ రెడ్డి మాటలు చాలా వరకూ నాటుగా ఉండటం రాజకీయ వర్గాలలో చర్చాంశనీయంగా మారింది. ప్రభుత్వం జోలికి వస్తే మానవ బాంబులం అవుతామని.. పేగులు మెడలో వేసుకుని తిరుగుతామని సీఎం హెచ్చరించడం ఆసక్తికరంగా మారింది. ఇతర విషయాల్లో చాలా పద్దతిగా కౌంటర్ ఇస్తున్నారు. కానీ ప్రభుత్వంపై కుట్రల విషయం వచ్చే సరికి మాత్రం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.. మరోవైపు లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కష్టాలల్లో పడిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ (BJP) నేతలు బెదిరిస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్లేందుకు కేసీఆర్, కేటీఆర్ (KTR) ప్రయత్నిస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. అందులో చీకట్లో ఉన్న ఇన్ఫార్మర్లు ఎప్పటికప్పుడు గులాబీ బాస్ కు ముఖ్య సమాచారం అందిస్తూ.. ప్రభుత్వం పడిపోయేలా చేస్తున్నారనే అనుమానాలున్నాయి.. ఇలాంటి కొన్ని కుట్రపూరితమైన అంశాల స్పష్టత రావడంతోనే రేవంత్ ముందస్తు హెచ్చరికలు జారీ చేశారన్న అభిప్రాయం కాంగ్రెస్ లో విపిస్తున్నాయి. అదేవిధంగా సందుల్లోనో.. గొందుల్లోనో ఎవర్నైనా గోకితే ఊరుకునేది లేదని హెచ్చరించడం వెనుక.. ప్రభుత్వ పతనానికి ప్లానింగ్ గట్టిగానే చేస్తున్నారనే లోతైన అర్థం ఉందన్న అంచనాలకు వస్తున్నారు. మరోవైపు గత పదేళ్లుగా బీఆర్ఎస్ చేసిన అనేక తప్పుల్ని రేవంత్ రెడ్డి సర్కార్ వెలుగులోకి తెస్తోందనే భయంతో.. ఇలాంటూ దుశ్చర్యలకు పాల్పడుతున్నారనే భావనలో కాంగ్రెస్ నేతలున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చీకటి సామ్రాజ్యం కంపిస్తోందన్న ఆలోచనలతో.. రేవంత్ సర్కార్ ఉండకూడదన్న ఉద్దేశంతోనే గట్టిగా ప్రయత్నిస్తున్నారని.. అది తెలిసే రేవంత్ తన బాష తీరు మార్చుకొని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. ఇక ఈ వార్నింగ్ కేవలం విపక్షాలకే కాదని.. అలాంటి ప్రయత్నాలు చేసే.. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అని కొందరు అన్వయించుకొంటున్నారు.. పూర్తి కథనం.. https://raashtra.com/telangana-is-this-the-truth-behind-revanth-reddy-warning/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 2.. Lok Sabha Elections : రాష్ట్రంలో ఉద్యమాల పార్టీ ఊపిరి ఆగిపోతుందా..? హైదరాబాద్, రాష్ట్ర: తెలంగాణ (Telangana) లో బీఆర్ఎస్ (BRS) మనుగడపై విభిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.. అడ్డదారుల్లో అధికారం చేచిక్కించుకోవాలనే తాపత్రయంలో ముఖ్య నేతలు ప్రయత్నిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. చివరికి దిక్కులేక బీఎస్పీ తో పొత్తువరకు వెళ్ళిన గులాబీ భవిష్యత్తు లోక్ సభ ఎన్నికల తర్వాత గల్లంతు అవుతుందనే విమర్శలు జోరుగా రాజకీయాల్లో నడుస్తున్నాయి.. ఇది వరకు ఉన్నంత జోరు.. జోష్ ప్రస్తుతం కారులో లేదనే అభిప్రాయాలు రాష్ట్రంలో వినిపిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం బీఆర్ఎస్ వ్యవహారం ఉండటం పలు అనుమానాలకు కారణం అవుతున్నట్లు తెలుస్తోంది. కాగా అధికారంలో ఉన్నంత కాలం కంటి చూపుతో రాష్ట్ర రాజకీయాలను శాసించిన కేసీఆర్.. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం తన పార్టీ నేతలను, క్యాడర్ ను కూడా కదిలించలేకపోతున్నారనే వార్తలు జోరందుకొన్నాయి.. ఇప్పటికే కారు దిగుతున్న నేతలు ఒకవైపు.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పై జరుగుతున్న ప్రచారాలు.. రాజకీయాలపై ఆసక్తి ఉండి లేనట్టుగా ప్రవర్తిస్తున్న కేసీఆర్ (KCR) వ్యవహారం ఉన్న కొద్ది మంది పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తుందని అంటున్నారు. విజయాలు అందినప్పుడు ఒకలా ఉన్న గులాబీ బాస్.. ఒక్క ఓటమితో పార్టీపై పూర్తిగా పట్టు కోల్పోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పరాజయం పాలైన మూడు నెలలలోనే బీఆర్ఎస్ అస్థిత్వమే ప్రశ్నార్ధకంగా మారిన పరిస్ధితులు నెలకొన్నాయని అంటున్నారు. ఓటమి నుంచి తేరుకుని లోక్ సభ ఎన్నికలకు (Lok Sabha Elections) సమాయత్తం కావాల్సిన తరుణంలో పార్టీలో వలసలు ఆ పార్టీ అగ్రనాయకత్వం నిస్సహాయ స్థితికి అద్దం పడుతున్నాయని అనుకొంటున్నారు.. ఒకప్పుడు చోటు లేకుండా ఉన్న పార్టీలో ఇప్పుడు లోక్ సభ ఎన్నికలలో రాష్ట్రంలోని 17 స్థానాలలో నిలబడేందుకు అభ్యర్థులే దొరకని దయనీయ స్థితికి దిగజారిపోవడం నాయకత్వ లోపంగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకే అధినేత దర్శనం దుర్లభంగా మారింది. అప్పటి ఫలితం ఇప్పుడు 70 mm లో కనిపిస్తుందని అనుకొంటున్నారు.. ఇక సిట్టింగ్ ఎంపీలు కూడా ఎన్నికల ముంగిట పార్టీని వీడుతున్నారంటే.. ఆ పార్టలో ఉండి పోటీ చేస్తే గెలిచే పరిస్థితులు లేవన్నది స్పష్టంగా తెలుస్తోందని భావిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం డిఫాక్టో సీఎంగా వ్యవహరించిన కేటీఆర్ (KTR), పార్టీలో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన హరీష్ రావు (Harish Rao) వంటి నేతలు కూడా ప్రస్తుతం పార్టీ వ్యవహారాలలో పెద్దగా జోక్యం చేసుకోకుండా, కేవలం ప్రకటనలు, విమర్శలకు పరిమితమౌతుండటం చూస్తుంటే.. గులాబీ తోట వాడిపోవడానికి సిద్దమైందనే సంకేతాలుగా భావిస్తున్నారని తెలుస్తోంది. పూర్తి కథనం.. https://raashtra.com/lok-sabha-elections-there-is-concern-among-activists-about-the-state-of-brs-there-is-no-one-to-contest-in-the-lok-sabha-elections/ >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 3.. మేడిగడ్డకు కేంద్ర కమిటీ.. నేటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలన NDSA Committee: కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఆరుగురు నిపుణుల కమిటీ నేటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించనుంది. ఎన్‌డీఎస్‌ఏ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం లీకేజీతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల డిజైన్ల పరిశీలన, నిర్మాణాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు జాతీయ డ్యాం సేప్టీ అథారిటీ- ఎన్‌డీఎస్ఏ ఆరుగురు నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర వాటర్‌ కమిషన్‌కు చెందిన చంద్రశేఖర్‌ అయ్యర్‌ ఛైర్మన్‌గా, యూసీ విద్యార్థి, ఆర్.పాటిల్‌, శివకుమార్‌ శర్మ, రాహుల్‌ కుమార్‌ సింగ్‌, అమితాబ్‌ మీనాలు సభ్యులుగా ఏర్పాటైన కమిటీ బుధవారం హైదరాబాద్‌ చేరుకుంది. రెండ్రోజుల పాటు డ్యాంలను సందర్శించి డిజెన్లు, నిర్మాణాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని సందర్శనలో భాగంగా నిపుణుల కమిటీ ఈ రోజు మేడిగడ్డ ఆనకట్టను సందర్శించనుంది. మేడిగడ్డకు బయలుదేరనున్న కమిటీ మధ్యాహ్నం 1:30 గంటల వరకూ బ్యారేజీని పరిశీలించనుంది. ప్రధానంగా కుంగుబాటుకు దారితీసిన కారణాలను బృందం అధ్యయనం చేయనుంది. బ్యారేజీ పగుళ్లు కారణంగా ఆనకట్ట సామర్థ్యం గేట్ల పరిస్ధితి సమగ్రంగా విశ్లేషించి ఎలాంటి మరమ్మతులు అవసరమో సిఫార్సులు చేయనుంది. మధ్యాహ్నం అన్నారం బ్యారేజీని సందర్శించనుంది. ఆనకట్టలో సీపేజీకి దారితీసిన కారణాలను సమగ్రంగా పరిశీలించనుంది. వర్షాకాలంలో గోదావరికి వరద ప్రారంభమైయ్యే పరిస్ధితులనూ పరిగణనలోకి తీసుకుని బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను నిపుణుల కమిటీ నివేదిక రూపంలో రాష్ట్ర సర్కారుకు అందజేయనుంది. శుక్రవారం సుందిళ్ల బ్యారేజీని సందర్శించనున్న నిపుణుల కమిటీ, రాత్రికి హైదరాబాద్‌కు చేరుకోనుంది. ఈ నెల 9న హైదరాబాద్‌లో సాగునీటి శాఖ అధికారులతో భేటీ అనంతరం అధికారుల బృందం ఢిల్లీకి వెళ్లనున్నారు. Read Also: Temperature Increase: ఏపీ, తెలంగాణపై భానుడి ప్రతాపం.. అమాంతం పెరిగిన ఉష్ణోగ్రతలు ఈ కమిటీకి అవసరమైన సహకారం అందించేందుకు నీటిపారుదల శాఖ యంత్రాంగం సిద్ధంగా ఉందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. మేడిగడ్డను తిరిగి ఉపయోగంలోకి తెస్తామని నిపుణుల బృందం చెప్పినట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. సమస్యకు కారణం ఎవరనేది కూడా నివేదికలో పొందుపరచాలని కూడా కోరినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కోరగానే కేంద్ర జలశక్తి శాఖ నిపుణుల కమిటీ వేసి, మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలనకు పంపడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. పూర్తి కథనం.. పూర్తి కథనం.. జాతీయ వార్తలు మహిళా అఘోరీల గురించి ఎవరికీ తెలియని ఘోరమైన నిజాలు.. అందరూ తెలుసుకోండి. పూర్తి కథనం.. ఐటీ రెయిడ్స్ - https://telugu.abplive.com/politics/telangana-politics-after-parliament-elections-2024-who-will-take-advantage-abpp-134152 కాంగ్రెస్ స్టోరీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో పావులు కదిపేదెవరు ? https://muchata.com/if-they-three-big-leaders-contest-from-one-seat/ ఆ ముగ్గురూ ఇక్కడి నుంచే పోటీ చేస్తే..? మరో కామారెడ్డి, మరో గజ్వెల్...!! - Muchata.com Latest Telugu News swatantralive.com https://www.dialtelugu.com/national/cbi-will-arrest-mla-kavitha-and-delhi-cm-arvind-kejirwal-in-delhi-liqour-scam-57252.html