హర్యానాలో స్కూల్ బస్సు బోల్తా..ఆరుగురు విద్యార్థులు మృతి

by Dishanational2 |
హర్యానాలో స్కూల్ బస్సు బోల్తా..ఆరుగురు విద్యార్థులు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: రంజాన్ పండుగ వేళ హర్యానాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రయివేటు పాఠశాలకు చెందిన బస్సు బోల్తా పడి ఆరుగురు విద్యార్థులు మృతి చెందగా..మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేంద్ర గఢ్‌ జిల్లా కనీనా పట్టణంలోని జీఎల్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సు గురువారం ఉదయం 30 మంది విద్యార్థులతో పాఠశాలకు వెళ్తోంది. ఈ క్రమంలో ఉన్నాని గ్రామ సమీపంలో డ్రైవర్ ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించగా.. బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆరుగురు విద్యార్థులు మరణించగా..మరో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. మరో వాహనాన్ని వేగంగా ఓవర్ టేక్ చేయడమే ప్రమాదానికి కారణమని ధ్రువీకరించారు. ఈ ఘటనపై హర్యానా విద్యాశాఖ మంత్రి సీమా త్రిఖా స్పందించారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. దీనిపై దర్యాప్తు చేపట్టనున్నట్టు తెలిపారు. కాగా, రంజాన్ పండుగ సందర్భంగా సెలవు ఉన్నప్పటికీ పాఠశాల నడుస్తుండటం గమనార్హం.Next Story
Original text
Rate this translation
Your feedback will be used to help improve Google Translate