Telugu News » YS Sharmila : పీసీసీ చీఫ్‌గా వైఎస్‌ షర్మిల.. ప్రకటించిన కాంగ్రెస్‌ అధిష్టానం..!!

YS Sharmila : పీసీసీ చీఫ్‌గా వైఎస్‌ షర్మిల.. ప్రకటించిన కాంగ్రెస్‌ అధిష్టానం..!!

వైఎస్ఆర్ తెలంగాణ పేరిట కొత్త పార్టీ పెట్టిన షర్మిల.. అసెంబ్లీ ఎన్నికల వేళ పోటీ చేయడం లేదని ప్రకటించి తప్పుకొన్నారు. ఇటీవలే ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జన ఖర్గే, రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

by Venu

ఏపీ కాంగ్రెస్ (AP Congress)లో కీలక పరిణామం చోటు చేసుకొంది. త్వరలో ఎన్నికలున్న నేపథ్యంలో ఇక్కడ పాగా వేయాలని చూస్తోన్న కాంగ్రెస్ అధిష్టానం వైఎస్‌ షర్మిలను పీసీసీ (PCC) చీఫ్‌గా నియమించింది. తన పార్టీని కాంగ్రెస్‌ లో విలీనం చేసి.. హస్తం నీడన చేరిన తర్వాత పార్టీలో ఆమెకు కీలక బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ జోరుగా సాగింది.. దానికి అనుగుణంగానే ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ KC వేణుగోపాల్‌.. వైఎస్‌ షర్మిలను, ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా నియమించినట్టు ప్రకటన విడుదల చేశారు..

manikkam Tagore on ys sharmila joining in congress

మరోవైపు పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజును, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (CWC) ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించినట్టు పేర్కొన్నారు. అయితే హైకమాండ్ ఆదేశం మేరకు పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraja) రాజీనామా చేశారని ప్రచారం జరిగింది. ఆయన రాజీనామాతో వైఎస్‌ షర్మిలకు (YS Sharmila) లైన్‌ క్లియర్‌ అయినట్టు చర్చించుకొన్నారు.

అదీగాక మణిపూర్‌లో జరుగుతోన్న భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో పాల్గొన్న షర్మిలకు.. పీసీసీ అధ్యక్ష పదవిపై మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) స్పష్టత ఇచ్చారని పార్టీ వర్గాల మాట.. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఫామ్ లోకి తీసుకొచ్చేందుకు అధిష్ఠానం వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఏపీ కాంగ్రెస్ పగ్గాలను షర్మిలకు అప్పగించిందంటున్నారు విశ్లేషకులు..

గతంలో వైఎస్ఆర్ తెలంగాణ పేరిట కొత్త పార్టీ పెట్టిన షర్మిల.. అసెంబ్లీ ఎన్నికల వేళ పోటీ చేయడం లేదని ప్రకటించి తప్పుకొన్నారు. ఇటీవలే ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జన ఖర్గే, రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి పనుల్లో వైఎస్‌ షర్మిల బిజీగా ఉన్న విషయం విదితమే.

You may also like

Leave a Comment