ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇల్లు ని ఎంతో అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా, వాళ్ళ ఇల్లుని శుభ్రంగా ఉంచుకుంటుంటారు. అలానే చాలామంది ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉంటారు. ఏ వస్తువుని ఎక్కడ పెట్టాలో కూడా చూసుకుని జాగ్రత్తగా సర్దుకుంటూ ఉంటారు. నిజానికి అలా మెయింటైన్ చేస్తేనే బాగుంటుంది. లక్ష్మీదేవి కూడా శుభ్రమైన ఇంటికే వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం వంటింటికి సంబంధించి కొన్ని విషయాలని ఇప్పుడు చూద్దాం. వాస్తు ప్రకారం వంటగది ఇంటి ఆగ్నేయములలో ఉండాలి. అక్కడ అగ్నిదేవత, అగ్నిదేవుడు ఉంటారు అందుకని వాస్తు ప్రకారం గది ఇలా ఉంటేనే మంచిది. తూర్పుముఖంగా ఉన్న ఇంటికి వంటగది ఆగ్నేయం మంచి దిశ.
ఈ స్థలం వంటగది పెట్టడానికి కుదరకపోతే వాయువ్యంలో పెట్టుకోండి ఉత్తర పడమర ఈశాన్య దిశలో మాత్రం పెట్టకూడదు. వంట గదిలో పెట్టుకునే పాత్రలకి కూడా వాస్తు నియమాలని పాటించాలి. సరైన దిశలో గ్యాస్ స్టవ్ ని పెట్టాలి వంట చేసేటప్పుడు తూర్పు వైపు ఉండాలి వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి లేదంటే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రాదు. కొందరు గ్యాస్ స్టవ్ కి సమాంతరంగా సింక్ పెడుతూ ఉంటారు రెండిటికీ కొంచెం దూరం ఉండడం చాలా అవసరం.
Also read:
రెండిటి మధ్య దూరం లేకపోతే ఆడవాళ్ళ మీద ప్రభావం ఎక్కువ కనపడుతుంది. అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఎప్పుడూ కూడా సింగ్, స్టవ్ రెండు కలిపి ఉంచకూడదు. స్టవ్ అగ్ని మూలకం నీరు కి సంబంధించింది రెండు దగ్గరగా ఉండటం వలన ప్రతికూలత ఏర్పడుతుంది. నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్త తీసుకోండి. ఒకవేళ కనుక రెండు దగ్గరగా ఉన్నట్లయితే రెండిటికీ మధ్య ఒక చెక్క బోర్డు లేదంటే గాజు వస్తువు పెట్టండి