యానిమల్ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగ, సౌరభ్ గుప్తా ఈ మూవీ కి స్క్రీన్ ప్లే అందించారు. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, మురాద్ ఖేతాని, ప్రణయ్ రెడ్డి వంగ మూవీ ని నిర్మించారు. రణబీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, త్రిప్తి డిమ్రి తదితరులు యానిమల్ సినిమాలో నటించారు. అమిత్ రాయ్ సినిమాటోగ్రఫీ అందించారు.
సినిమా: యానిమల్
నటీనటులు : రణబీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, త్రిప్తి డిమ్రి తదితరులు
దర్శకుడు: సందీప్ రెడ్డి వంగా
నిర్మాత : భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, మురాద్ ఖేతాని, ప్రణయ్ రెడ్డి వంగ
విడుదల తేదీ : డిసెంబర్ 01, 2023
యానిమల్ సినిమా కథ, వివరణ:
ఇక కథ చూస్తే.. అర్జున్ (రణబీర్ కపూర్) ఒక బాగా ధనికులు ఇంట్లో పుడతాడు. తండ్రి బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. కానీ ఎన్ని డబ్బులు వున్నా కూడా అర్జున్ తన తండ్రి ప్రేమ ని మాత్రం పొందలేడు. అందుకనే, తండ్రి ప్రేమ కోసం ఆయనకి నచ్చిన పనులు చేయడం మొదలు పెడతాడు. అర్జున్ ఫ్రెండ్ కార్తీక్ స్నేహితురాలు గీతాంజలి. గీతాంజలి (రష్మిక మందన్న) ని అర్జున్ లవ్ చేస్తాడు. ఇదిలా ఉంటే, తండ్రి కోసం అర్జున్ చేసే పనులు వలన గీతాంజలి సఫర్ అవ్వాల్సి ఉంటుంది. వీరిద్దరూ పెళ్లి చేసుకుని పిల్లలతో హ్యాపీ గా వుంటున్నప్పుడు బల్బీర్ సింగ్ పై దాడి జరుగుతుంది.
Also read:
బల్బీర్ సింగ్ మీద ఎందుకు దాడి జరిగింది..? ఎవరు చేశారు…? అప్పుడు అర్జున్ ఏం చేశాడు…? పగ ని తీర్చుకున్నాడ…? అర్జున్ తండ్రి ప్రేమని పొందగలిగాడా..? తెలియాలంటే మూవీ చూడాలి. ఈ మూవీ ని బానే సందీప్ తెర మీదకి తీసుకు వచ్చాడు. నటీనటులు అందరూ కూడా బాగా నటించారు. హీరో రణబీర్ కపూర్ లో కొత్త కోణం చూస్తారు ఆడియన్స్. గీతాంజలి పాత్రలో రష్మిక కూడా బాగా నటించింది. పాటలు కూడా బాగున్నాయి. డబ్బింగ్ క్వాలిటీ అదిరిపోయింది. అమిత్ రాయ్ సినిమాటోగ్రఫీ కూడా ప్లస్ అయింది.
ప్లస్ పాయింట్స్ :
హీరో రణబీర్ కపూర్ నటన
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్
దర్శకత్వం
యాక్షన్ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్:
మూవీ బాగా లెన్తీ
సాగదీసిన సీన్స్
రేటింగ్ : 3/5