మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబుని అరెస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమాలను చేస్తున్నారు. ఇంకోపక్క అభిమానులు కూడా అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. చంద్రబాబుని అరెస్ట్ చేయడంతో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ విషయంపై స్పందించడం జరిగింది. అరెస్టుకి వ్యతిరేకంగా నందమూరి కుటుంబ సభ్యులు కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇంతమంది స్పందించినా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఏమి స్పందించకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ మీద ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి.
Also Read: CM KCR : కేసీఆర్ ఎక్కడ..?
జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటిదాకా చంద్రబాబు అరెస్ట్ మీద ఎందుకు స్పందించలేదంటూ ఎంతోమంది ఇప్పటికే ప్రశ్నించడం జరిగింది. కొంతమంది ఎన్టీఆర్ ని విమర్శిస్తుంటే కొంతమంది మాత్రం ఎన్టీఆర్ ని సపోర్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా చంద్రబాబు అరెస్టుపై ఎన్టీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు అనే దానిమీద ఎన్టీఆర్ దోస్త్ రాజీవ్ కనకాల స్పందించారు. ఒక యూట్యూబ్ ఛానల్ కి ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ చంద్రబాబు అరెస్టుపై ఎన్టీఆర్ మౌనం గురించి, ఎన్టీఆర్ పై వచ్చే విమర్శల గురించి ప్రశ్న ఎదురయింది.
Also Read: Ponnala Lakshmaiah: టీ కాంగ్రెస్ కు భారీ షాక్…. !
రాజకీయాలలో ఆసక్తి ఉంటే ఆయనే చెప్తారు. ఇది వరకు ప్రచారం చేశారు అప్పుడు స్పీచ్ లతో అందరినీ ఉర్రుతలూగించారు. రాజకీయాల మీద ఆసక్తి ఉంటే ఆయనే మాట్లాడతారని రాజీవ్ కనకాల చెప్పారు. ఇంకో ఐదేళ్ల తర్వాత రాజకీయాల మీద ఆసక్తి ఉండొచ్చేమో ప్రజెంట్ తన ఫోకస్ అంతా కెరియర్ మీదే ఉన్నట్లు రాజీవ్ కనకాల ఎన్టీఆర్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు.
అయితే ఎందుకు ఎన్టీఆర్ మౌనంగా ఉంటున్నారు అనేదాని వెనుక కారణమైతే తెలియదు. కరోనా వలన ఆర్ఆర్ఆర్ సినిమా వలన నాలుగేళ్ల టైం ఎన్టీఆర్ మిస్ చేసుకున్నారు. ఈ గ్యాప్ లో ఇంకో మూడు సినిమాలు తీసి ఉండేవారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్ సినిమాల కారణంగానే ఇటువంటి విషయాలు పట్టించుకోవట్లేదు అని అంతా అంటున్నారు. ప్రస్తుతం రాజీవ్ కనకాల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.