చంద్రుని మీదకు రాకెట్లను పంపుతున్న ఇంకా సమాజంలో వివక్ష మాత్రం పోవడం లేదు. మహారాష్ట్ర (Maharashtra) అహ్మద్ నగర్ లో జరిగిన ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేశారనే అనుమానంతో నలుగురు దళిత యువకులను చెట్టుకు వేలాడదీసి విచక్షణా రహితంగా కొట్టారు.
అహ్మద్‌నగర్ (ahmad nagar) జిల్లా హారేగావ్‌లో ఓ వ్యక్తికి చెందిన మేక , కొన్ని పావురాలు కనిపించకుండా పోయాయి. దీంతో తమ ఇంటికి సమీపంలో ఉండే నలుగురు దళిత యువకులపై వారికి అనుమానం కలిసింది. అనుకున్నదే తడవుగా మరికొందరితో కలిసి యువకులను వారి ఇళ్లకు వెళ్లి ఎత్తుకుని వచ్చారు.
కాళ్లు, చేతులను కట్టేసి.. ఓ చెట్టుకు వేలాడదీశారు. అంతటితో ఆగకుండా విచక్షణారహితంగా వారి వీపులపై దాడికి పాల్పడ్డారు. దీనిననంతటినీ వీడియో తీయించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది వైరల్‌గా మారడంతో విషయం పోలీసుల వద్దకు వెళ్లింది.
బాధితుల్లో ఒకరైన షుభమ్ ఫిర్యాదుతో కేసు నమోదుతో రంగంలోకి దిగారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని యువ్‌రాజ్ గలాండే, మనోజ్ బొడాకే, పప్పు, దీపక్ గైక్వాడ్, దుర్గేశ్ వైద్యా, రాజుగా గుర్తించారు. వారిపై కిడ్నాప్, హత్యాయత్నం కేసులు నమోదుచేశారు.