దసరా, బతుకమ్మ పండగల సందర్భంగా బడి పిల్లలకు (School Children) సెలవులు (Holidays) ప్రకటించిన తెలంగాణ (Telangana) ప్రభుత్వం, తర్వాతి పండగలైన దీపావళీ, క్రిస్మస్, సంక్రాంతి సెలవులపై కూడా ప్రకటన విడుదల చేసింది. మిగతా పండగలకు ఒక్కరోజు సెలవిచ్చిన తెలంగాణా సర్కార్ సంక్రాంతికి ఆరు రోజుల సెలవు ప్రకటించింది.
తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలకు ప్రభుత్వం ఏకంగా 13 రోజుల సెలవులను ఇచ్చింది. అక్టోబర్ 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అన్ని స్కూల్స్, కాలేజీలకు సెలవులను ప్రకటించింది. మిగతా పండగల విషయానికి వస్తే…దసరా తర్వాత వచ్చే దీపావళి పండగకు ఒక్క రోజు మాత్రమే సెలవు ఇచ్చింది.
డిసెంబర్ నెలలో వచ్చే క్రిస్మస్ కు ఐదు రోజుల సెలవులను ఇచ్చింది. డిసెంబర్ 22 నుంచి 26 వరకు ఐదు రోజులపాటు క్రిస్మస్ సెలవులు ఉంటాయని తెలిపింది. అయితే ఈ సెలవులు మిషనరీ స్కూళ్లకు మాత్రమే. మిగిలిన పాఠశాలలకు మాత్రం ఒక్క రోజు సెలవు ఉంటుందని పేర్కొంది.
ఈ విద్యా సంవత్సరంలో వచ్చే మరో పెద్ద పండగ సంక్రాంతికి ఆరు రోజుల సెలవులను ప్రభుత్వం ఇచ్చింది. భోగి, సంక్రాంతి, కనుమ పండగలతో కలిపి 6 రోజులు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది.
ఏపీలో ఇలా..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా పండగకు సెలవులు ప్రకటించింది. స్కూల్స్, కాలేజీలకు పండుగ సెలవులు ఖరారు చేసింది. ఏపీలో కూడా మొత్తం 10 రోజుల పాటు దసరా సెలవులు ఇచ్చారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దసరా హాలిడేస్ ఉంటాయని తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు ప్రకటించింది.
24వ తేదీ నుంచి స్కూల్స్, కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. క్రిస్మస్ సెలవులను 7 రోజుల నుంచి 5 రోజులకు తగ్గించారు. ఇక జనవరి 12వ తేదీ నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులుగా ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.