సెప్టెంబర్ 11న వివేకనంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (YS Avinash reddy) బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ జరగనుంది. ఈ నేపధ్యంలో సుప్రీంకోర్టులో (Supreme court) సీబీఐ (CBI) అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Viveka Case) మరో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లైయ్యింది.
సీబీఐ వేసిన అఫిడవిట్ లో అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీం కోర్టులో సునీతా రెడ్డి సవాల్ చేశారని ప్రస్తావించింది.వివేకా హత్యకు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలే కుట్ర చేశారంటూ అఫిడవిట్లో సీబీఐ పేర్కొంది. ఇందులో వివేకా హత్యకు దాడి చేసిన పరిణామాలు అనంతరం సాక్షాదారాల జరిపివేతలో నిందితులు పాల్గొన్న తీరును ప్రస్తావించింది.
రాజకీయ వైరంతోనే వివేకా హత్య జరిగిందని సీబీఐ అందులో తెలిపింది. వివేకా హత్యకు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలే సూత్రదారులు అనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని సీబీఐ సుప్రీంలో వేసిన అఫిడవిట్లో సీబీఐ పేర్కొంది.
గుండెపోటు అంటూ కట్టుకథ అల్లారని, ఈ హత్య విషయంలో అవినాష్ రెడ్డి పాత్రపై ఇంకా దర్యాప్తు చేయాలని సీబీఐ తెలిపింది. వివేకా వెంట కారులో ప్రయాణిస్తూనే నిందితుడు సునీల్‌కి గంగిరెడ్డి ఫోన్ చేశారని, ఆ సమయంలో అవినాష్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్నాడని వివరించింది.
సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసిన సీబీఐ గతంలో ప్రస్తావించిన విషయాలను మరోసారి ఈ కౌంటర్ అఫిడవిట్ లో వివరించింది. దీంతో ఇప్పుడు విచారణ తర్వాత సుప్రీంకోర్టు అవినాష్ బెయిల్ పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని ఉత్కంఠ మొదలైంది.