ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరులో ఈ మధ్యకాలంలో దుండగులు రెచ్చిపోతున్నారు. నడి రోడ్డు మీదే బరితెగించి దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ శాస్త్రవేత్తను కొంతమంది లోకల్ గుండాలు కత్తులతో వెంబడించి, కారు అద్దాలు పగలగొట్టి భయబ్రాంతులకు గురి చేశారు.
ఈ ఘటన గురించి స్వయంగా శాస్త్రవేత్తే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. కాగా ఈ సంఘటన గురించి పోలీసులు సరిగా స్పందించలేదంటూ ఆయన మండిపడ్డారు కూడా. గత గురువారం మధ్యాహ్నం కారులో వెళ్తున్న అశుతోష్ సింగ్ అనే సైంటిస్ట్ కారును ఆపడానికి కొందరూ రౌడీలు వెంటపడ్డారు.
వారు మొదట కారును ఆపడానికి యత్నించారు. అంతే కాకుండా పెద్దపెద్ద కత్తులతో వారు ఆయన మీద దాడికి ప్రయత్నించారు. దాడిలో ఆయన కారు అద్దాన్ని ధ్వంసం చేశారు. ఎలాగొలా వారి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే వారు ఇంతవరకు సరిగా స్పందించకపోవడంతో ఆయన ట్విటర్ వేదికగా జరిగిన విషయంతో పాటు పగలగొట్టిన కారు ఫోటోలనుకూడా షేర్ చేశారు. దీంతో ఈ ఘటన పై కర్ణాటక ఆడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమర్ స్పందించారు.
వెంటనే వారిని పట్టుకుని రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని తెలిపారు. ఈ కేసు గురించి తానే స్వయంగా అధికారులను ఆదేశిస్తానని, దగ్గరుండి కేసును పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు.