మహారాష్ట్ర (Maharastra) లోని వసీం జిల్లాలో ఓ గేదె (Buffelo) మంగళసూత్రాన్ని(Mangalsutra) మింగింది. దీని విలువల రూ. 1.5 లక్షలు. గేదె మంగళసూత్రాన్ని మింగేయడం అందర్ని ఆశ్చర్చపరిచింది. అసలు గేదె మంగళసూత్రాన్ని ఎందుకు మింగేసింది? ఆ తర్వాత ఏం జరిగిందంటే……
వాషిమ్ జిల్లాలోని సార్సి అనే గ్రామంలో గీతాబాయి నివాసం ఉంటోంది. ఆమె ఆదివారం రాత్రి తన మంగళసూత్రాన్ని మెడలో నుంచి తీసి పక్కనే ఉన్న ఓ పాత్రలో ఉంచింది. ఆ సంగతి మర్చిపోయి ఆ రాత్రి అలాగే పడుకుండిపోయింది. ఆమె కుటుంబ సభ్యుడు ఒకరు ఉదయాన్నే ఆ మంగళసూత్రం ఉన్న పాత్రలో సోయాబీన్ పొట్టును వేసి ఆ పాత్రను గేదె ముందు పెట్టాడు. అది దాణాతో పాటుగా ఆ మంగళసూత్రాన్ని కూడా మింగేసింది.
కొంత సేపటి తర్వాత గీతాబాయి తన మంగళసూత్రం విషయం గుర్తుకు వచ్చి దాన్ని ఆ పాత్రలో ఉంచినట్లుగా గుర్తు చేసుకుంది. ఆ పాత్ర దగ్గరికి వెళ్లగా అక్కడ లేదు. మంగళసూత్రం గురించి చుట్టుపక్కలతో పాటు ఇల్లాంతా వెతికినా కనిపించలేదు. దీంతో సోయా పొట్టుతో పాటుగా మంగళసూత్రాన్ని కూడా గేదె తినేసి ఉంటుందని అనుమానించింది.
దీంతో ఏం చేయాలో పాలుపోకపోవడంతో వెంటనే వెటర్నరీ డాక్టర్ ను సంప్రదించారు. జరిగిన విషయం గురించి వివరించారు. గేదెకు వివిధ పరీక్షలు చేసిన వైద్యుడు…ఆ తర్వాత ఆ గేదెకు ఆపరేషన్ చేసి గొలుసును బయటికి తీశారు. దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా శ్రమించి బంగారు గొలుసును డాక్టర్ బయటికి తీశారు. మొత్తానికి గేదెకు 60 నుంచి 65 కుట్లు పడ్డాయి. ప్రస్తుతం ఆ గేదె ఆరోగ్యంగానే ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. మొత్తానికి రూ. 1.5 లక్షల ఖరీదు చేసే బంగారు మంగళసూత్రాన్ని బయటికి తీశారు.