చంద్రబాబు అరెస్టై (Chandra Babu Arrest) రిమాండ్ కు వెళ్లిన తర్వాత ఈ అంశంపై వైసీపీ నాయకులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. అంబటి రాంబాబు (Ambati Rambabu) కూడా చంద్రబాబు అరెస్టైపై మాట్లాడారు. చంద్రబాబు అరెస్ట్, జైలుకు వెళ్లడం దురదృష్టకరం అని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం (Skill Development Scam) తో పాటు అమరావతి, ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు వంటి కుంభకోణాల్లో త్వరలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. ఇన్నాళ్లు వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబు చట్టం నుంచి తప్పించుకున్నారని ఇకపై అవి కుదరదన్నారు.
వ్యవస్థల్ని మేనేజ్ చేసి బయట పడటం చంద్రబాబుకు అలవాటని అన్ని రోజులు చంద్రబాబువి కాదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. న్యాయస్థానంలో సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని భావించి చంద్రబాబుకు రిమాండ్ విధించిందని చెప్పారు
చంద్రబాబు జీవితం మొత్తం ఎలా ప్రవర్తించారో, అవినీతి చేశారో, మోసాలు చేశారో అందరికి తెలుసన్నారు. సమర్ధవంతంగా సంస్థల్ని, వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగారని అన్నారు. వ్యవస్థల్ని మేనేజ్ చేసి బోను ఎక్కకుండా సమర్ధవంతమైన వ్యవస్థలు ఆయన చేతిలో ఇన్నాళ్లు ఉన్నాయన్నారు. ఆయన దురదృష్టం, ప్రజల అదృష్టవశాత్తూ ఆ మేనేజ్మెంట్ చేసే వ్యవస్థలు ఇప్పుడు అందుబాటులో లేవన్నారు. బాబు అరెస్టైన దగ్గర నుంచి చాలా కుట్రలకు తెర లేపరన్నారు.
ఈ నెల 9వ తేదీ బాబును నంద్యాలలో అరెస్ట్ చేశారని, వీఐపీ, సీనియర్ నాయకుడు, వయసులో పెద్ద వ్యక్తి కావడంతో రోడ్డు మార్గంలో కాకుండా…హెలికాఫ్టర్ లో వెళ్దామని సీఐడీ కోరితే రాజకీయం కోసం ఆయనే రోడ్డు మార్గంలో వెళ్లాలని సూచించారన్నారు.