కారు ఢీకొట్టిందని ప్రశ్నించినందుకు ఓ డాక్టర్ (doctor) ను 50 మీటర్ల మేర బానెట్ మీద ఈడ్చుకెళ్లిన ఘటన హర్యానా (hayana )లోని పంచకులలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…పంచకులలోని ఎండీసీ నివాసి అయిన డాక్టర్ గగన్ ప్రమాదం జరిగిన సమయంలో తన కొడుకును ట్యూషన్ నుండి ఇంటికి తీసుకువెళుతున్నాడు.
ఈ క్రమంలో సెక్టార్ 8, పంచకుల ట్రాఫిక్ జంక్షన్లో డాక్టర్ గగన్ వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయడానికి ఓ కారు ప్రయత్నించింది. ఆ కారు డాక్టర్ బండిని ఢీకొట్టింది. ఢీకొట్టడంతో కారులోని వ్యక్తుల్ని ప్రశ్నించాలని డాక్టర్ బండి ఆపి.. కారు దగ్గరికి వెళ్లాడు.. కారులోని వ్యక్తి డాక్టర్ ను బానెట్ తో గుద్ది కారుమీద పడగానే.. దాదాపు 50 మీటర్ల వరకు బానెట్ పై అలాగే ఎత్తి ఈడ్చుకెళ్లారు.
దీనిమీద ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. దర్యాప్తు కొనసాగుతోంది… అని తెలిపారు. 50 మీటర్లు ఈడ్చుకెళ్లిన తరువాత దుండగులు అక్కడి నుండి పారిపోయారు. ఘటన చూసిన స్థానికులు వెంటనే డాక్టర్ గగన్‌ను సెక్టార్ 6లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతనికి చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు.
డాక్టర్ గగన్ ఫిర్యాదుతో పంచకుల పోలీసులు కారు యజమానిపై కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యం నమోదయ్యింది. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
#Video: Doctor Dragged For 50 Meters On Car Bonnet In Panchkula
Road Rage Incident in Panchkula#PANCHKULA #ROADRAGE #DOCTORDRAGGED #LatestUpdates pic.twitter.com/JQgpinikw6
— mishikasingh (@mishika_singh) August 28, 2023