భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జీ-20 (G20) సమావేశానికి ఢిల్లీ (Delhi) సిద్ధమౌతోంది. సమావేశాలు జరిగే సమయంలో (Time) ఎలాంటి అంతరాయాలూ ఏర్పడకుండా అధికారులు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే ఢిల్లీ మెట్రో స్టేషన్ల (Metro Station)లో కొన్నింటిని మూసివేయనున్నట్లు మెట్రో అధికారులు (Officials) తెలిపారు.
ఈ నెల 8 నుంచీ 10వ తేదీవరకూ జరిగే జీ20 సమావేశాలకు సుమారు ఇరవై అయిదు దేశాలకు చెందిన నాయకులు హజరుకానున్నారు. ఈ నేపథ్యంలో నేతలు సమావేశానికి హజరై తిరిగి వెళ్లే వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జోబైడన్ తో పాటు వివిధ దేశాధినేతలు ఈ సమావేశాలకు హాజరవుతున్న నేపథ్యంలో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
మూసివేసే స్టేషన్లు ఇవే
జీ20 సమావేశాలు జరిగే వేదికకు అత్యంత సమీపంలో ఉన్న సుప్రీం కోర్టు మెట్రో స్టేషన్ ను సమావేశాలు పూర్తయ్యేవరకూ మూసివేయనున్నారు. దీంతోపాటు ఢిల్లీలోని భికాజీ కామా ప్లేస్, మునిర్కా, మోతీబాగ్, ఆర్కే పురం, సదర్ బజార్ కంటోన్మెంట్, ఐఐటీ మెట్రో స్టేషన్లను ఆయా తేదీల్లో మూసివేస్తారు. ధౌలా కువాన్, ఖాన్ మార్కెట్, జన్ పథ్, భికాజీ, కామా ప్లేస్ మెట్రో స్టేషన్లను సున్నితమైన ప్రదేశాలుగా గుర్తించామని అధికారులు తెలిపారు. మిగిలిన అన్ని స్టేషన్లు మామూలుగానే పనిచేస్తాయన్నారు.
మూసివేయనున్న స్టేషన్ పరిధిలోని అనుమానితులెవరైనా కనిపిస్తే వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించడం, వారి వివిరాలు సేకరించడం చేస్తున్నట్లు ఢిల్లీ పోలీస్ అధికారులు తెలిపారు. అత్యంత ప్రతిష్టాకరమైన జీ20 సదస్సును భారత్ నిర్వహిస్తుండటంతో, ఎటువంటి భద్రతపరమైన లోపాలు లేకుండా సజావుగా సాగే విధంగా అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.