పండుగల సీజన్ (Festival Season) వచ్చిందంటే బంగారం (Gold) కొనుగోళ్లు పెరుగుతాయి. ఈ సీజన్ లో బంగారం కొనుగోలుకు సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుంచి ధనికుల వరకు అందరూ ఆసక్తి చూపుతారు. ఇలా ఈ సీజన్ లో బంగారాన్ని ఆభరణాల (Ornaments) కోసం మాత్రమే కాకుండా భవిష్యత్తు అవసరాలకు పెట్టుబడిగా కూడా కొంటుంటారు.
ఈ సీజనులో బంగారం కొనుగోళ్లు పెరగడంతో పాటు వాటి ధరలూ పెరిగాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. ఇవాళ బంగారం, వెండి ధరల్లో మార్పు చోటు చేసుకుంది. బంగారం ధర 10 గ్రాములపై రూ. 110 పెరిగగా, కిలో వెండి రూ. 300 పెరిగింది. సెప్టెంబర్ 24న బులియన్ మార్కెట్ లో విడుదలైన బంగారం, వెండితో పాటు ప్లాటినం ధరలను ఒక్కసారి చూద్దాం.
బంగారం ఎంత పెరిగిందంటే…
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, హైదరాబాద్, విశాఖ పట్టణంలలో ఆదివారం నమోదైన ధరలను పరిశీలిస్తే.. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 54,950కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 59,950 వద్ద కొనసాగుతుంది.
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 55,100 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 60,100 గా ఉంది. ఇది శనివారం నాటి ధరలతో పోల్చుకుంటే రూ.160 పెరిగింది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 55,210 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 60,230 ఉంది. నిన్నటి రోజుతో పోలీస్తే రూ.120 పెరిగింది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 54,950 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 59,950 ఉండగా…కోల్కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 54,950 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 59,950, ఇక ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 54,950కాగా. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 59,950 ఉంది.
వెండి కూడా…
దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండిపై రూ. 300 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ వంటి నగరాల్లో కిలో వెండి రూ. 79,300 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 79,300, ముంబయి, ఢిల్లీ, కోల్ కతా వంటి ప్రాంతాల్లో రూ. 75,800, బెంగళూరులో కిలో వెండి రూ. 74,250 వద్ద కొనసాగుతుంది.
ప్లాటీనం ధరలు ఇలా…
దేశంలో ప్లాటీనం రేట్లు ఆదివారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 80 పెరిగి.. రూ 24,720కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 24,640గా ఉండేది.ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 24,720గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ధరల్లో మార్పులు ఎందుకుకో తెలుసా…
బంగారం, వెండి, ప్లాటినం వంటి లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాలపై ఈ ధరల మార్పులు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్లో ఈ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్స్ లో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్లో హెచ్చుతగ్గులు ఇలా అనేక అంశాలు ఈ లోహాల ధరల హెచ్చు తగ్గులకు కారణమవుతాయి.