ప్రపంచ వ్యాప్తంగా ఐ-ఫోన్ (iPhone) ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐ-ఫోన్ 15 (iPhone 15) సిరీస్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చేశాయి. ఆపిల్(Apple Ceo) సీఈఓ టిమ్‌కుక్ (Tim cook) లాంఛనంగా వీటిని ఆవిష్కరించారు. మంగళవారం రాత్రి 10.30 గంటలకు కాలిఫోర్నియాలోని ‘ఆపిల్ పార్క్’లో స్టీవ్ జాబ్స్ థియేటర్లో ‘వండర్ లస్ట్’ అనే పేరుతో నిర్వహించిన ఈవెంట్లో వాటిని మార్కెట్లోకి విడుదల చేశారు.
ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు డైనమిక్ ఐలాడ్ టెక్నాలజీతో ఆవిష్కరించారు. 2000 పీక్ బ్రైట్ నెస్ గల ఐ-ఫోన్ 15 6.1 అంగుళాల డిస్ ప్లే, ఐ-ఫోన్ 15 ప్లస్ 6.7 అంగుళాల డిస్ ప్లే ప్యానెల్‌తో వస్తుంది. ఐ-ఫోన్ 15 కెమెరా 48-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, న్యూ 2x టెలిఫోటో జూమ్ కలిగి ఉంటుంది. ఏ16 బయోనిక్ చిప్‌తో వస్తుంది.
సెకండ్ జనరేషన్ ఆల్ట్రా వైడ్ బాండ్ చిప్ (యూడబ్ల్యూబీ) ఫీచర్ కూడా జత చేశారు. ఇందులో శాటిలైట్ కనెక్టివిటీ సర్వీస్ అందుబాటులోకి తెచ్చారు. తొలిసారి యూఎస్బీ టైప్-సీ పోర్ట్ చార్జర్ తో ఐ-ఫోన్ 15 ఆవిష్కరించారు.తొలుత ఆపిల్ వాచ్ సిరీస్ 9 స్మార్ట్ వాచ్ విత్ న్యూ ఎస్9 చిప్ ఆవిష్కరించారు. ఆల్ డే 18 గంటల బ్యాటరీ లైఫ్ దీని సొంతం.
ఇంగ్లిష్, మండారిన్ భాషల్లో మీ వాయిస్ వినిపిస్తే చాలు మీ హెల్త్ డేటా చెక్ చేస్తుంది. ఇందులో యాక్సిలో మీటర్, గైరో స్కోప్ ఫీచర్లతోపాటు 2000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉంటుందని ఆపిల్ ప్రకటించింది. కస్టమ్ ఎస్9 చిప్ గల ఈ వాచ్.. వాచ్ఓఎస్10 వర్షన్ పై పని చేస్తుంది. ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ ఉంటుంది.
వండర్ లస్ట్’ ఈవెంట్ ప్రారంభానికి రెండు గంటల ముంగిట టిమ్ కుక్.. నెటిజన్లకు, ఐ-ఫోన్ ప్రేమికులకు శుభాకాంక్షలు చెబుతూ ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’లో పోస్ట్ పెట్టారు. ఆపిల్ ఐఫోన్ల ఆవిష్కరణ కోసం ట్విట్టర్ ప్రత్యేకంగా ‘యానిమేషన్ అకౌంట్’ యాక్టివేట్ చేసింది. #AppleEvent అనే బటన్‌పై క్లిక్ చేస్తే ఆన్ లైన్ లైవ్ ప్రసారం అవుతుంది.
సూపర్ రెటీనా ఓఎల్‌డీ డిస్ ప్లే విత్ డైనమిక్ ఐలాండ్. 2000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్.. 6.1 అంగుళాల డిస్ ప్లే. సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్. ఎన్ క్లోజర్ మేడ్ ఆఫ్ 75 పర్సెంట్ అల్యూమినియం. 48 -మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సఱ్ విత్ సెన్సర్ షిఫ్ట్ ఓఐఎస్. ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా.మెయిన్ కెమెరాలో 2x సెన్సర్ జూమ్.ఆటో పోర్ట్రైట్ ఇన్ ఫొటో మోడ్ విత్ ఆప్షన్ టూ అడ్జస్ట్ డెప్త్ క్యాట్స్ అండ్ డ్యాగ్స్ వంటి పెంపుడు జంతువుల కోసం పొర్ట్రైట్. ఏ16 బయోచిప్ కెపాసిటీ. యూ2 ఆల్ట్రా వైడ్ బాండ్ చిప్ ఫర్ ప్రిసిసన్ లొకేషన్ షేరింగ్ కేపబిలిటీస్. ఎమర్జెన్సీ ఎస్‌వోఎస్.
శాటిలైట్ ద్వారా రోడ్ సైడ్ అసిస్టెన్స్.. ప్రస్తుతానికి అమెరికాకు మాత్రమే ఈ సేవలు పరిమితం. యూఎస్బీ టైప్-సీ పోర్ట్ విత్ సపోర్ట్ ఫర్ చార్జింగ్, డేటా ట్రాన్స్ ఫర్, ఆడియో అండ్ వీడియో. రివర్స్ వైర్డ్ చార్జింగ్ విత్ యూఎస్బీ -సీ. మాగ్ సేఫ్ వైర్ లెస్ చార్జర్.