టీమిండియా(Team India) స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jaspreeth Bhumhra) భారత్కు తిరిగొచ్చేశాడు. అదేంటి ఓ పక్క ఆసియా కప్(Asia Cup) జరుగుతుంటే బుమ్రా.. ఆడకపోవడం ఏంటి అనుకుంటున్నారా? కానీ ఇది నిజం. ఎందుకంటే జస్ప్రీత్ తండ్రి అయ్యాడు. బుమ్రా భార్య సంజనా గణేశన్(Sanja Ganeshan) సోమవారం ఉదయం మగ శిశువుకు జన్మనిచ్చింది.
బుమ్రా దంపతులకు ఇదే తొలి సంతానం. పట్టరాని సంతోషంతో బుమ్రా ఈ విషయాన్ని ట్విట్టర్ ప్లాట్ ఫామ్ పై (ఎక్స్) పంచుకున్నాడు. ఆసియా కప్ కోసం శ్రీలంకకు వెళ్లిన బుమ్రా, భార్య ప్రసవం నేపథ్యంలో తిరిగి వెనక్కి వచ్చేశాడు. ‘‘మా చిన్న కుటుంబం పెద్దగా మారింది. మా హృదయాలు నిండుదనాన్ని సంతరించుకున్నాయి.
ఈ ఉదయం మేము మా చిన్నారి బాలుడిని (అంగద్ జస్ప్రీత్ బుమ్రా) ఈ ప్రపంచంలోకి ఆహ్వానం పలికాం. మేము చంద్రునిపై ఉన్నాం. మా జీవితంలో ఈ కొత్త అధ్యాయం గురించి మరింత వేచి చూడలేం’’ అంటూ జస్ప్రీత్ బుమ్రా పోస్ట్ పెట్టాడు. తమ కుమారుడి చేతి పక్కనే బుమ్రా దంపతులు చేతులు ఉంచి తీసిన ఫొటోను పంచుకున్నాడు.