ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమకు ఏకంగా 10 సినిమాలు నేషనల్ అవార్డులు అందడం, అలాగే 69 ఏళ్ళగా ఒక తీరని కలలా ఉన్న బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వరించడంతో టాలీవుడ్ అంతా ఫుల్ ఖుషీలో ఉంది. ఇది ఇలా ఉంటే, కొంతమంది ఆడియన్స్ నాని ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాకి అవార్డు వచ్చి ఉంటే బాగుండేది అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు.
కానీ కొంతమంది మాత్రం అల్లు అర్జున్ కి అవార్డు(national award) రావడం పట్ల విచారంగా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. నేచురల్ స్టార్ నాని(nani) హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాకి అవార్డులు వచ్చి ఉంటే బాగుండేదని నాని ఫ్యాన్స్ అంటుంటే..నాని (nani) మాత్రం జై భీమ్(jai bheem) సినిమాకు అవార్డు రానందుకు అసంతృప్తిని వ్యక్త పరిచాడు.
సోషల్ మీడియా వేదికగా జై భీమ్ అని ఓ హార్ట్ బ్రేక్ సింబల్ ను పెట్టాడు. అంతే ఇక నాని టార్గెట్ అయిపోయాడు. నిన్న కాక మొన్న వచ్చిన వారు కూడా తెలుగు సినిమాని విమర్శించే స్థాయికి ఎదిగారు అంటూ పోస్టులు పెడుతున్నారు. మనకు వచ్చినందుకు గర్వపడకుండా తమిళ సినిమాకు రాలేదని బాధ పడటం ఏమిటని కొందరు నెటిజెన్లు అదే పనిగా పెట్టుకుని ట్రోల్స్ చేస్తున్నారు.
తెలుగు వాళ్లకు సినిమా నచ్చితే భాష ఏంటనేది కూడా ఆలోచించకుండా నెత్తిన పెట్టుకుని ఊరేగుతారు. నాని సైతం దానికి మినహాయింపు కాదు. అంత గొప్ప సినిమాకు నేషనల్ అవార్డు రాలేదని కాస్త నిరాశ చెందాడు. గతం లో కూడా నాని పాన్ ఇండియా హీరో అంటే దుల్కర్ అనే మాటను నిర్మొహమటంగా చెప్పాడు.
అప్పటి వీడియోలను పట్టుకుని ఇప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారు. మనకి రాలేదని ఏడుపా? పక్కవారికి వచ్చిందని కుళ్లా అంటూ నాని మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరి ఈ ట్రోలింగ్ ఏ స్థాయికి చేరుతుందో చూడాలి.