అమరావతి (Amaravathi) ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి నారా లోకేష్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (High Court) తోసిపుచ్చింది. దర్యాప్తు అధికారుల ముందు హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు విచారణ చేపట్టిన హైకోర్టు లోకేష్ బెయిల్ పిటీష్ ను కొట్టేసింది. సీఐడీ విచారణకు హాజరుకావాలని సూచించింది. మరోవైపు 41 ఏ నోటీసులు అందించాలని సీఐడీని ధర్మాసనం ఆదేశించిది. చట్ట ప్రకారమే నడుచుకుంటామని చెప్పిన ఏజీ శ్రీరామ్, లోకేష్ కు 41 ఏ నోటీసు ఇస్తామని కోర్టుకు తెలిపారు. అయితే దర్యాప్తు అధికారి ముందు లోకేష్ హాజరుకావాలని ఆయన కోరారు.
రాజధాని పేరుతో అమరావతిలోని అన్ని రోడ్లను కలుపుతూ ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) వేసే ప్రాజెక్టు పేరిట నాటి టీడీపీ స్కాంకు పాల్పడినట్లుగా కేసు నమోదు చేసిన సీఐడీ, ఏ14గా లోకేష్ ను చేర్చిన సంగతి తెలిసిందే.
ఈ కేసుతో పాటు.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు నారా లోకేష్. ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని హైకోర్టును కోరారు లోకేష్ తరఫున న్యాయవాదులు. ఇవి ఈ మధ్యాహ్నానికి హైకోర్టులో విచారణకు రానున్నాయి.