భారత దేశంలో సంస్కృతి, సంప్రదాయాలు, పెద్దలను గౌరవించడం వంటి అంశాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఈ అంశాల్లో బ్రిటన్ ప్రధాని (Britain Prime Minister) భారతీయ మూలాలను మర్చిపోలేదని జీ20 సమావేశాల్లో బంగ్లాదేశ్ (Bangladesh) ప్రధానితో రుషి సునక్ (Rushi Sunak) మాట్లాడిన తీరు గుర్తు చేసింది. ఈ విషయంలో బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ నెటిజన్ల మనుసుని దోచుకున్నారు.
జీ20 సదస్సులో పాల్గొనడం కోసం తొలిసారి యూకే ప్రధాని హోదాలో భారత్ వచ్చిన రిషి సునాక్ అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ ప్రధానితో రిషి సునాక్ మాట్లాడుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీలో షేక్ హసీనాతో రిషి సునాక్ భేటీ అయ్యారు.
75 ఏళ్ల షేక్ హసీనా కుర్చీలో కూర్చొని ఉండగా.. రిషి సునాక్ గౌరవంతో ఆమె వద్ద కూర్చున్న తీరు అందర్ని ఆకట్టుకుంది. బంగ్లాదేశ్ ప్రధాని హసీనాకు దగ్గరగా వెళ్లి.. ఓ మోకాలిని నేలకు ఆనించి..కూర్చిలో కూర్చున్న ఆమెతో మోకాలిపై కూర్చుని రిషి సునాక్ ఆమెతో మాట్లాడారు. సాధారణంగా మన ఇళ్లలో పెద్ద వాళ్లతో మాట్లాడేటప్పుడు ఇలాంటి దృశ్యాలు చూస్తుంటాం. సరిగ్గా అలాగే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా కూర్చుని మాట్లాడటంతో ఇది అందర్ని ముఖ్యంగా భారీయులందర్ని విపరీతంగా ఆకర్షించింది.
భారత్ దేశంలో ఏ చిన్న పదవున్న కూడా ఎంతో డాబును, బడాయిని ప్రదర్శిస్తుండం మనం చూస్తూనే ఉంటాం. కానీ బ్రిటన్ వంటి దేశానికి ప్రధానైనా అతడు చూపించిన మర్యాద మాత్రం జీ20 సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా మారింది.
యూకే లాంటి ఓ బలమైన దేశానికి ప్రధానిగా ఉన్న రిషి సునాక్ తన హోదాను పక్కనబెట్టి.. ఏ మాత్రం ఇగో లేకుండా ఇలా వ్యవహరించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.