తెలంగాణాలో ఏ గ్రామానికైనా, ఏ ఊరికైనా పోదాం, అక్కడ మీరు చెప్పినట్లు కరెంటు (Electricity) రోజూ వస్తే నేను రాజీనామా చేస్తా, లేకపోతే మీరు కనీసం ప్రజలకు క్షమాపణ చెప్తారా? అని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Kotmatireddy Venkatareddy) మంత్రులు కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harishrao) లకు సవాల్ విసిరారు.
సిరిసిల్ల, గజ్వేల్, సిద్ధిపేటలో రోజూకు 15 గంటల పాటు త్రీ ఫేజ్ కరెంట్ ఇస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. కరెంట్ విషయంలో మాయ మాటలు చెప్పి రైతులను మంత్రులు మోసం చేస్తున్నారని చెప్పారు.
హరీష్ రావు, కేటీఆర్ వంటి వారికి చచ్చే వరకు పదవులు కావాలని…ప్రజా సమస్యలు, వాటి పరిష్కారాలు అవసరం లేదని విమర్శించారు. కరెంట్ విషయంలో తన మాటలు అబద్ధం కాదని, కావాలంటే తనతో మంత్రులు వస్తే నిరూవుపిస్తానని అన్నారు.
తెలంగాణాలో ఏ గ్రామంలోనైనా రోజుకు 24 గంటలు కాదు, కనీసం 20 గంటలు కరెంట్ వస్తున్నట్లు నిరూవుపించినా తన ఓటమిని ఒప్పుకుని రాజీనామా చేస్తానని అన్నారు. తన సవాల్ ను స్వీకరించేందుకు మంత్రులు సిద్ధమా అని ప్రశ్నించారు.