Xi Jinping: జీ20 సమావేశాలకు జిన్ పింగ్ డుమ్మా…
ఢిల్లీలో జరిగే జీ20 (G20)సమావేశాలకు జిన్‌పింగ్ (Xi Jinping) హాజరుకావడం లేదు. ఈ విషయాన్ని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. జీ20 సమావేశాలకు జిన్ పింగ్ హాజరుకాకపోవడంపై తాను నిరుత్సాహ పడ్డానని అమెరికా అధ్యక్షుడు (America President) తెలిపారు. అయితే తాను మాత్రం జీ20 సమావేశఆలకు హాజరవుతున్నట్లు జోబైడెన్ చెప్పారు.
ఢిల్లీలో జరిగే సమావేశాల్లో పాల్గొనేందుకు 8వ తేదీన బైడెన్ ఇండియాకు రానున్నారు. అయితే ఆ సమావేశాలకు జిన్‌పింగ్ వస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ ఆయన తన ప్లాన్ మార్చుకున్నట్లు, చైనా మీడియా కథనాలు ద్వారా తెలుస్తోంది.
జిన్‌పింగ్ స్థానంలో ఆ దేశ ప్రధాని లీ కియాంగ్ తమ ప్రతినిధుల బృందంతో హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. ప్రస్తుతం భారత్, చైనా మధ్య ఉద్రిక్తత వాతావరణం ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల చైనా రిలీజ్ చేసిన కొత్త మ్యాప్ పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ ప్రదేశాలను తమ భూభాగంలో ఉన్నట్లు చైనా తన మ్యాప్‌లో ప్రచురించింది. దీన్ని భారత్ ఖండిస్తూ తన నిరసనను వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య మళ్లీ ప్రచ్ఛన్న వాతావరణం నెలకొన్నది. అందుకే జిన్‌పింగ్ జీ20 సమావేశాల కోసం ఇండియా రావడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.