Telugu News » Diwali 2023 : దీపావళి రాగానే కాలుష్యం గుర్తొస్తుందా..!?

Diwali 2023 : దీపావళి రాగానే కాలుష్యం గుర్తొస్తుందా..!?

సాధారణంగా దీపావళి నాడు వచ్చే కాలుష్యం 4 నుంచి 5 శాతం మాత్రమేనని.. పర్యావరణ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. వ్యవసాయ వ్యర్థాలు కాల్చడం, వాహనాల నుండి వెలువడే పొగ, పారిశ్రామిక, నిర్మాణ పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యం 95 శాతం ఉంటోందని వీటి గురించి ఎంతమంది మాట్లాడుతున్నారని అడుగుతున్నాయి హిందూ సంఘాలు.

by admin
conspiracy on Hindu festivals 1

– హిందూ పండుగులపై కుట్ర జరుగుతోందా?
– 364 రోజులు గుర్తుకురాని కాలుష్యం
– దీపావళి సమయంలోనే ఎందుకు గుర్తొస్తోంది?
– పారిశ్రామిక, నిర్మాణ, ఇతర వ్యర్థాలపై..
– మాత్రం నోరు మెదపరు?
– హిందూ పండుగ నాడు బాణాసంచా కాల్చితే..
– ఎక్కడలేని బాధ్యత వస్తుందా?
– హిందూ సంఘాల నిలదీత

భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి హిందూ పండుగలు (Hindu Festivals). వాటిలో ఎంతో ఆనందంగా జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగ దివ్య దీప్తుల దీపావళి (Diwali). చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటాం. దీపాల శోభతో వెలుగొందే గృహాలు.. పిండివంటల ఘుమఘుమలు.. బాణాసంచా చప్పుళ్ళు.. ఈ దివ్య దీపావళి వెలుగులు. ఇంతటి విశిష్టత కలిగిన పండుగ వచ్చిందంటే దేశమంతా సంబరంగా ఉంటుంది. కానీ, వివాదాలు సృష్టించడం ఈమధ్య ట్రెండ్ గా మారిందనే వాదన బలంగా వినిపిస్తోంది. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని అంటున్నాయి హిందూ సంఘాలు.

conspiracy on Hindu festivals 2

హిందూ పండుగలు భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా పని చేస్తాయి. శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపడంతోపాటు చాలా ఉపయోగాలు ఉన్నాయి. కానీ, కొన్ని సంస్థలు, పార్టీలు, కొందరు సెలెబ్రిటీలు అజ్ఞానంతో, కుట్ర కోణంతో హిందూ పండుగలపై అతి చేస్తున్నారనేది హిందూ సంస్థల వాదన. దీపావళి పండుగలో టపాసులు పేల్చడం ఆనవాయితీ వస్తోంది. కానీ, దీనివల్ల విపరీతంగా కాలుష్యం (Pollution) పెరిగిపోతోందంటూ ప్రచారం మొదలుపెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పైగా, సంవత్సరంలో 364 రోజులూ కాలుష్యంపై నోరెత్తని వాళ్లు.. ఒక్క దీపావళి సమయంలోనే మాట్లాడుతుండడంపై మండిపడుతున్నాయి.

conspiracy on Hindu festivals

సాధారణంగా దీపావళి నాడు వచ్చే కాలుష్యం 4 నుంచి 5 శాతం మాత్రమేనని.. పర్యావరణ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. వ్యవసాయ వ్యర్థాలు కాల్చడం, వాహనాల నుండి వెలువడే పొగ, పారిశ్రామిక, నిర్మాణ పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యం 95 శాతం ఉంటోందని వీటి గురించి ఎంతమంది మాట్లాడుతున్నారని అడుగుతున్నాయి హిందూ సంఘాలు. హిందూ పండుగలు కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తున్నాయని వివరిస్తున్నాయి. ఈసారి దీపావళికి 120 కోట్లకు పైనే బిజినెస్ జరుగుతున్నట్టు అంచనా. అనేక మంది భారతీయుల జీవనోపాధి పండుగలపై ఆధారపడి ఉంది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక పరిస్థితులతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయగల శక్తి హిందూ పండుగలకు ఉందని చెబుతున్నాయి.

conspiracy on Hindu festivals 1

బాణాసంచా తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం తమిళనాడులోని శివకాశి. దేశవ్యాప్తంగా టపాసులు ఈ పట్టణం నుంచే ఎగుమతి అవుతుంటాయి. దాదాపు 6.5 లక్షల కుటుంబాలు బాణాసంచా తయారీపై ఆధారపడి ఉన్నాయి. బేరియంపై విధించిన నిషేధంతోపాటు బాణాసంచాపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న ఆంక్షల కారణంగా ఈ మధ్య కాలంలో లక్షా 50వేల మంది నిరుద్యోగులు అయ్యారని అంటున్నాయి హిందూ సంస్థలు. ఇతర వర్గాలు పండుగల పేరుతో లక్షలాది జంతువులను వధిస్తూ పరిసరాలను కలుషితం చేస్తున్నా.. ప్రార్థనల పేరుతో లౌడ్ స్పీకర్లు పెట్టి బహిరంగంగా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నా.. నోరు మెదపని వారంతా కేవలం హిందూ పండుగలను మాత్రమే టార్గెట్ చేయడంపై మండిపడుతున్నాయి. ఇది హిందువులకు వారి ఆచారాలను దూరం చేసే కుట్రగా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అదీగాక, పండుగలపై ఆధారపడే భారతీయ మార్కెట్ ను దెబ్బతీసి దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసే కుతంత్రం అని చెబుతున్నాయి హిందూ సంఘాలు.

You may also like

Leave a Comment