Telugu News » Congress : ఆ పార్టీ ఖాళీ చెంబు కర్నాటక-ఉత్త మట్టి ఏపీ-గాడిద గుడ్డు తెలంగాణకు ఇచ్చింది.. రేవంత్ మాస్ సైటెర్స్..!

Congress : ఆ పార్టీ ఖాళీ చెంబు కర్నాటక-ఉత్త మట్టి ఏపీ-గాడిద గుడ్డు తెలంగాణకు ఇచ్చింది.. రేవంత్ మాస్ సైటెర్స్..!

పార్లమెంట్‌లో ప్రధాని మోడీ తెలంగాణను అవమానించారని తెలిపిన రేవంత్.. బండి సంజయ్ ఆ సమయంలో సభలోనే ఉన్నారని.. రాష్ట్రాన్ని అవమానిస్తుంటే చూస్తూ కూర్చున్నాని మండిపడ్డారు..

by Venu
If you don't want reservations, vote for BJP. If you want, vote for Congress!

పార్లమెంట్ లో విజయాన్ని అందించి.. ఆ క్రెడిట్ కూడా తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్న రేవంత్.. ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటనలు చేస్తుండటం తెలిసిందే.. ఈ క్రమంలో నేడు జమ్మికుంట (Jammikunta)లో జనజాతర (Janajatara) పేరిట కాంగ్రెస్ (Congress) బహిరంగా సభ నిర్వహించింది. ఈ సభకు హాజరైన సీఎం రేవంత్.. బీజేపీ, బీఆర్ఎస్ పై సెటైర్లు వేశారు.. తెలంగాణకు ఆయన ఇచ్చింది గాడిద గుడ్డు అని ఎద్దేవా చేశారు.

cm revanth reddy key announcement 2050 mega master plan for the development of telangana soonపదేళ్ల పాలనలో ప్రధాని మోడీ (Modi) తెలంగాణ (Telangana)కు ఇచ్చిందేమి లేదని విమర్శించిన సీఎం.. బీజేపీ కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉండి కర్నాటకకు ఖాళీ చెంబు, ఏపీకి ఉత్త మట్టి, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని వ్యంగ్యాస్త్రాలు వదిలారు.. రాజకీయ అవసరాల కోసం రాముడిని కూడా వదిలిపెట్టలేదని మండిపడ్డారు.. మాయ మాటలతో బీజేపీ వంచిస్తోందని ఆరోపణలు గుప్పించారు.

దేశంలో బీజేపీ దేవుడి పేరుతో ఓట్లు అడుక్కునే దిక్కుమాలిన స్థితికి వచ్చిందని విమర్శించినా రేవంత్ రెడ్డి (Revanth Reddy).. మొన్న జరిగిన సెమీ ఫైనల్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో.. సెమీస్‌లో కేసీఆర్‌ను చిత్తుచిత్తుగా ఓడించామని.. ఫైనల్‌లో ప్రధాని మోడీని సైతం ఓడించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందని అన్నారు.. అదేవిధంగా కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఐదేళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి తెచ్చిందేంటని ధ్వజమెత్తారు..

మరోవైపు పార్లమెంట్‌లో ప్రధాని మోడీ తెలంగాణను అవమానించారని తెలిపిన రేవంత్.. బండి సంజయ్ ఆ సమయంలో సభలోనే ఉన్నారని.. రాష్ట్రాన్ని అవమానిస్తుంటే చూస్తూ కూర్చున్నారు తప్ప ఏమి అనలేదని మండిపడ్డారు.. కానీ ఇక్కడ వచ్చి ప్రసంగాలు ఇవ్వమంటే.. ఉన్నవి లేనివి కలిపించి విమర్శించడం అలవాటు చేసుకొన్నారని దుయ్యబట్టారు..

You may also like

Leave a Comment