Telugu News » Srisailam : సేవ్ శ్రీశైలం.. హిందూ క్షేత్రంలో ముస్లింలకు షాపులు!

Srisailam : సేవ్ శ్రీశైలం.. హిందూ క్షేత్రంలో ముస్లింలకు షాపులు!

దేవాదాయ శాఖ తీరు చూస్తుంటే హిందువుల కోసం పని చేస్తున్నట్టు లేదని అంటున్నాయి. శ్రీశైల క్షేత్రంలో సుమారు 150 మందికి పైగా ముస్లింలకు నివాస గృహాలు కేటాయించారని.. హిందూ ఆలయాల దగ్గర ఇతరులకు షాపులు కేటాయించడమేంటని నిలదీస్తున్నాయి. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి హిందూ సంస్థలు.

by admin

– శ్రీశైల క్షేత్రంలో హిందూ వ్యతిరేక చర్యలు
– 13 మంది ముస్లింలకు షాపుల కేటాయింపు
– హిందువులు వ్యతిరేకిస్తున్నా..
– లెక్క చేయని దేవాదాయ శాఖ
– ప్రభుత్వ తీరుపై హిందూ సంస్థల ఆగ్రహం

శ్రీశైల (Srisailam) క్షేత్రంలో ఇప్పటికే అన్యమతస్తుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయినా కూడా దేవాదాయ శాఖ (AP Endowment Department) పట్టించున్నట్టు కనిపించడం లేదు. తాజాగా 13 మంది ముస్లింలకు శ్రీశైలం దేవస్థాన ప్రాంగణంలో షాపులు కేటాయించింది. ఈ ఉత్తర్వులపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్ని పోరాటాలు చేసినా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ జగన్ (Jagan) ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపడుతున్నాయి.

srisailam

చాలాకాలంగా అన్యమతస్తులకు షాపుల కేటాయింపుపై వివాదం నడుస్తోంది. దీనిపై కొందరు హిందువులు పోరాటం చేస్తుండగా.. దాడులు జరిగిన సందర్భాలున్నాయి. అయినా కూడా ప్రభుత్వ ఆధీనంలోని దేవాదాయ శాఖ మొత్తం 24 షాపుల్లో 13 ముస్లింలకు కేటాయించింది. ఇక్బాల్, జిలానీ బాష, రబ్బాని, జమీల్ అహ్మద్, ఎస్ఎం బాష, మహమూద్ అలీ, జాఫర్ బీ, రెహ్మతుల్లా, నూర్జహాన్ బీ, మాలిక్, మహ్మద్ రఫీ, నైమద్, ఎండీ రఫీలకు ఆఘమేఘాల మీద షాపుల ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని ఫైరవుతున్నాయి హిందూ సంస్థలు.

దేవాదాయ శాఖ తీరు చూస్తుంటే హిందువుల కోసం పని చేస్తున్నట్టు లేదని అంటున్నాయి. శ్రీశైల క్షేత్రంలో సుమారు 150 మందికి పైగా ముస్లింలకు నివాస గృహాలు కేటాయించారని.. హిందూ ఆలయాల దగ్గర ఇతరులకు షాపులు కేటాయించడమేంటని నిలదీస్తున్నాయి. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి హిందూ సంస్థలు. ఇక్కడ వ్యాపారం చేస్తూ లాభాలు ఆర్జించే ముస్లింలు.. హిందూ ఆలయాల కోసం ఏమైనా ఖర్చు చేస్తారా? అని అడుగుతున్నాయి. దేవాలయాల దగ్గర వ్యాపారాలు చేస్తూ.. హిందువుల డబ్బుతో ఎదిగి.. మసీదులు, దర్గాలు అభివృద్ధి చేసుకోవడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నిస్తున్నాయి.

హిందూ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న దేవాదాయ శాఖ మనుకు అవసరమా? అని అడుగుతున్నాయి హిందూ సంస్థలు. ఇప్పటికైనా హిందువుల్లో చైతన్యం రావాలని.. మన దేవాలయాలు మన హక్కు అంటూ నిలదీయాలని సూచిస్తున్నాయి. శ్రీశైలంలో వ్యాపారం ముస్లింలు తమ హక్కు అంటూ కోర్టులకు సైతం వెళ్తున్నారని.. లాయర్లకు లక్షలకు లక్షలు ఫీజు ఇచ్చి పోరాటం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నాయి. ఎలాగైనా సరే శ్రీశైలంలో తమకు షాపులు కావాలని ముస్లింలు అడగడం ఏంటని అడుగుతున్నాయి. ఇది కుట్ర కాక ఇంకేంటని నిలదీస్తున్నాయి. దీని వెనుక రాజకీయం కూడా ఉందని మండిపడుతున్నాయి. దేవాలయాలు ప్రభుత్వ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయాయని.. హిందూ సంఘాల్లో కూడా ఐక్యత రావాలని పిలుపునిస్తున్నాయి. దేవాలయాలు పూర్వీకులు ఇచ్చిన వారసత్వ సంపదని.. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతీ హిందువుపై ఉందని చెబుతున్నాయి హిందూ సంస్థలు.

You may also like

Leave a Comment