Telugu News » Arindam Bagchi : హమారా మిట్టి.. హమారా దేశ్

Arindam Bagchi : హమారా మిట్టి.. హమారా దేశ్

పీవోకేపై అమిత్ షా చేసిన వ్యాఖ్యల్లో తప్పేం లేదన్నారు అరిందమ్ బాగ్చీ. ఈ విషయంలో భారత్ (Bharat) చాలా స్పష్టంగా ఉందని పేర్కొన్నారు.

by admin
arindam-bagchi-says-pok-part-of-india-no-reason-to-change-our-statement

– పీవోకే ముమ్మాటికీ మనదే
– అమిత్ షా ప్రకటనలో తప్పేముంది?
– పీవోకేపై మాకు ఓ క్లారిటీ ఉంది
– ఆ ప్రాంతం భారత్ లో భాగమే
– విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ

యుద్ధంలో గెలిచి మరీ.. భూభాగాన్ని వివాదంలో పెట్టుకున్న దేశం మనదే కావొచ్చని.. పీవోకే (POK) ని ఉద్దేశించి ప్రపంచంలో చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. నెహ్రూ (Nehru) చేసిన తప్పిదం వల్లే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను మాపుల్లో చూసూకోవాల్సి వస్తుందని బీజేపీ నేతలు తరచూ చెబుతుంటారు. తాజాగా లోక్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన ప్రకటనతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది.

arindam-bagchi-says-pok-part-of-india-no-reason-to-change-our-statement

పాక్ అక్రమిత కశ్మీర్ గురించి మాట్లాడటానికి సైతం కాంగ్రెస్ (Congress) వెనుకా ముందు ఆడే పరిస్థితి ఉండగా.. అందుకు భిన్నంగా పీవోకే మనదేనని.. అక్కడ 24 సీట్లను రిజర్వ్ చేసినట్లుగా అమిత్ షా లోక్ సభలో వెల్లడించారు. నిజానికి, ఈ విషయంలో మొదట్నుంచి బలమైన వాదనను వినిపిస్తోంది బీజేపీ (BJP). అయితే.. నెహ్రూ వల్లే ఇదంతా జరిగిందని అనడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బీజేపీకి అంత చిత్తశుద్దే ఉంటే ఇన్నాళ్లూ ఏం చేసిందని ప్రశ్నిస్తోంది. ఇదే క్రమంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ (Arindam Bagchi) స్పందించారు.

పీవోకేపై అమిత్ షా చేసిన వ్యాఖ్యల్లో తప్పేం లేదన్నారు అరిందమ్ బాగ్చీ. ఈ విషయంలో భారత్ (Bharat) చాలా స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. ఆయన ప్రకటనలో ఎలాంటి అభ్యంతరం లేదన్న ఆయన.. ముమ్మాటికీ పీవోకే భారత్ లో భాగమేనని స్పష్టం చేశారు. బుధవారం జమ్మూకశ్మీర్‌ రిజర్వేషన్‌ బిల్లు, జమ్మూకశ్మీర్‌ రీ ఆర్గనైజేషన్‌ బిల్లును లోక్‌ సభ ఆమోదించింది.

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ముమ్మాటికీ భారత్‌ లో అంతర్భాగమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా. అసెంబ్లీలో సీట్ల సంఖ్య పెరుగుతుందని, 70 ఏళ్లుగా కశ్మీర్‌ లో జరుగుతున్న అన్యాయానికి ఈ బిల్లుతో న్యాయం జరుగుతుందన్నారు. నెహ్రూ వల్లే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ సమస్య వచ్చిందని ఆరోపించారు.

You may also like

Leave a Comment