వివిధ రంగాల్లో విశేషమైన కృషి చేసిన వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల భారతరత్న(BHARATHA RATNA) ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ అత్యున్నత పురస్కారం(AWARDS) పొందిన జాబితాలో ఉన్న వారికి శనివారం రాష్ట్రపతి భవన్ లో(PRESIDENT BAVAN) అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారాలను గ్రహితల వారసులకు అందజేశారు.
అయితే, భారతరత్న పొందిన వారిలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి, సోషలిస్టు నాయకుడు కర్పూరి ఠాకూర్, మాజీ ప్రధాని, దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయుడు, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు, మాజీ ప్రధాని, వ్యవసాయ రంగం పటిష్టతకు కృషి చేసి, జాట్ నేతగా పేరొందిన చౌదరి చరణ్ సింగ్, దేశంలో వ్యవసాయ విప్లవ పితామహుడిగా గుర్తింపు పొందిన వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్ ఎస్ స్వామినాథన్‌లు ఉన్నారు. ఈ నలుగురు భారత ముద్దుబిడ్డల సేవలను గుర్తించిన కేంద్రం వీరి మరణాంతరం భారతరత్న పురస్కారం ప్రకటించింది.అందుకే వీరి తరఫున వీరి వారసులు ఈ పురస్కారాలను అందుకున్నారు.
మాజీ పీఎం పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకరరావు పురస్కారాన్ని స్వీకరించారు. స్వామినాథన్ తరఫున ఆమె కుమార్తై నిత్యారావు, మాజీ పీఎం చరణ్ సింగ్ తరఫున ఆయన అవార్డును మనవడు జయంత్ సింగ్, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ తరఫున ఆయన కుమారుడు రామ్ నాథ్ స్వీకరించారు.
అయితే, మాజీ ఉపప్రధాని, బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు, సీనియర్ పొలిటీషియన్ ఎల్ కే అద్వానీకి కూడా కేంద్రం భారతరత్న ప్రకటించగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అవార్డును ప్రదానం చేయనున్నారు.