Telugu News » HISTORY : కదనరంగంలోకి షహీద్ ఫూలో,ఝాన్నో ముర్ము.. 21 మంది బ్రిటీష్ సైనికుల ఊచకోత!

HISTORY : కదనరంగంలోకి షహీద్ ఫూలో,ఝాన్నో ముర్ము.. 21 మంది బ్రిటీష్ సైనికుల ఊచకోత!

బ్రిటీష్ వారు ఇండియాలో వర్తకం కోసం వచ్చి ఆ తర్వాత ఎలా దేశం మొత్తం తమ పరిపాలన సామ్రాజ్యాన్ని విస్తరించారో..ఆ తర్వాత ఆదాయ వనరుల కోసం ఎలాంటి పద్ధతులను అనుసరించారో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

by Sai
Shaheed Foo, Jhanno Murmu, 21 British soldiers massacred in the battlefield!

బ్రిటీష్ వారు ఇండియాలో వర్తకం కోసం వచ్చి ఆ తర్వాత ఎలా దేశం మొత్తం తమ పరిపాలన సామ్రాజ్యాన్ని విస్తరించారో..ఆ తర్వాత ఆదాయ వనరుల కోసం ఎలాంటి పద్ధతులను అనుసరించారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం వారు డివైడ్ అండ్ రూల్‌ని అమలు చేశారు. దేశంలో ఇదే విధానాన్ని ఇప్పటికీ మన రాజకీయ నాయకులు అనసరిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

Shaheed Foo, Jhanno Murmu, 21 British soldiers massacred in the battlefield!

ఒకప్పుడు ఛోటా నాగ్‌పూర్ పీఠభూమి, సంతాల్ పరగణాల్లో సంతాల్ ప్రజలు నివసించేవారు. వారు ప్రకృతితో మమేకమై స్థానికంగా లభించే సహజ సంపదను సమృద్ధిగా పొంది ఆనందకరమైన జీవనాన్ని గడిపేవారు. వారి జీవితాల్లోకి అనుకోకుండా ఒకరోజు బ్రిటీష్ వారు ప్రవేశించారు. ఆ సమయంలో బ్రిటీష్ వారి యజమాయిషీ వారిపై ఉండేది. సంపదను ఎలాగైనా సృష్టించాలనే ఆలోచనతో ఉన్న బ్రిటీష్ వారు గిరిజనులు తమ ఆదాయాన్ని పెంచుతారని వారు గుర్తించారు.

తద్వారా వారికి రుణ సదుపాయం కలిగించేవారు. చిన్న మొత్తంలో రుణం అందించి పెద్ద మొత్తంలో డబ్బును వారినుంచి దోచేవారు. డబ్బు చెల్లించని స్థోమత లేని వారి నుంచి భూములు, పశుసంపదను దౌర్జన్యంగా లాక్కునేవారు. వడ్డీ వ్యాపారులు, బ్రిటీష్ లాయర్లు గిరిజనుల మీద పట్టు సాధించారు. పేదవారి భూమిని వేలం వేసి అదే భూమిలో వారిని పనివారిగా మార్చేవారు.

జార్ఖండ్‌లోని బర్హైత్ సమీపంలోని బొగ్నాడిహ్‌లో ముర్ము కుటుంబంలో పెద్ద వాడైన ‘సిడో’ ఈ దౌర్జన్యాన్ని భరించలేకపోయాడు. సామూహిక తిరుగుబాటు ద్వారానే దోపిడీ వ్యవస్థకు స్వేచ్ఛ దొరుకుతుందని భావించాడు. తనకు దేవుడు ఉపదేశించాడని తన సోదరుల ద్వారా చుట్టుపక్కల గిరిజన తెగలకు ఆ సందేశం పంపించాడు. ఆ సందేశం దావాలనంగా వ్యాపించింది.

ఓ రోజు పంచకటియా అనే ప్రదేశంలో సిడో ప్రసంగం ఇచ్చాడు.ఆ టైంలో అక్కడి తెగలు అతనిపై మండిపడ్డారు. అదే టైంలో ‘డిగ్గిహ్’ పోలీసు అవుట్‌పోస్ట్‌కు అధికారిగా ఉన్న బ్రిటీష్ పోలీసు ఆ గుంపును చెదరగొట్టేందుకు వారి వద్దకు వచ్చాడు. దీంతో సిడో ఒక్కసారిగా అతని తలను శిరచ్ఛేదం చేశాడు. ఆ ఘటన చూసిన వారంతా భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత వారంతా సిడోకు జై కొట్టారు.

విల్లులు, బాణాలు, ఈటెలు, గొడ్డల్లు చేతబట్టి గుంపులు గుంపులుగా భూస్వాములపై, వడ్డీ వ్యాపారులపై, చిరు వ్యాపారులపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. వారి ఇండ్లు, ధాన్యాగారాలపై పడి మొత్తం లూటీ చేశారు. కొన్ని నెలలు పాటు గిరిజనులు దోపిడీని కొనసాగించారు. అనంతరం ఈ బృందం కలకత్తాలోని బ్రిటిష్ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలనుకుంది. కానీ, బర్హైత్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహేశ్‌పూర్ దాటి వారు ముందుకు సాగలేకపోయారు.

బ్రిటీష్ సైన్యం పక్కా ప్రణాళికతో గిరిజన గ్రూపులు, సిడోను బంధీని చేశారు. అనంతరం వారిని ఉరితీశారు. దాదాపు 10వేల మందికి పైగా సంతాల్ ప్రజలు స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించినట్లు తెలిసింది.

సంతాల్ ప్రజల వీరోచిత ప్రాణత్యాగం గురించి తెలిశాక స్వాతంత్ర్యం కోసం ఇద్దరు సోదరీమణులు ‘షాహిద్ వీరాంగనాస్ ఫూలో ముర్ము, ఝానో ముర్ము’ కదనరంగంలోకి దూకారు. బ్రిటీష్ సైనికుల శత్రు శిబిరంలోకి చొరబడి చీకటి కమ్మేసినట్టు గొడ్డలితో ఏకంగా 21 మంది సైనికులను ఊచకోత కోశారు. విప్లవోద్యమంలో వారి సహచరుల్లో స్పూర్తిని కలిగించింది. పురుషులతో సమానంగా పోరాడి వారికంటూ ప్రత్యేకంగా చరిత్రను లిఖించారు. ఆ తర్వాత బ్రిటీష్ సైన్యం చేతిలో ఆ ఇద్దరు సోదరీమణులు హతమయ్యారు. ఈ తిరుగుబాటు తర్వాత ఛోటా నాగ్‌పూర్ కౌలు చట్టం (1908),సంతాల్ పరగణా కౌలు చట్టం (1912)ను బ్రిటీష్ వారు తీసుకొచ్చారు. ఈ చట్టం ద్వారా గిరిజన ప్రజల నుంచి భూమిని గిరిజనేతరులకు బదిలీ చేయడానికి నిలిపివేసింది.

తమ పోరాటం ద్వారా ఎంతో మంది హృదయాల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిలించిన ‘ఫూలోముర్ము, ఝానో ముర్ము’ లను స్ఫూర్తిగా తీసుకుని ఆ తర్వాత కూడా పోరాటాలు కొనసాగాయి. అయినప్పటికీ వీరికంటూ చరిత్రలో చోటు దక్కలేదు.

You may also like

Leave a Comment