Telugu News » HISTORY : మాకొద్దీ తెల్ల దొరతనం.. తన విప్లవ సాహిత్యంతో ప్రజలను చైతన్యం చేసిన నిజమైన వీరుడు!

HISTORY : మాకొద్దీ తెల్ల దొరతనం.. తన విప్లవ సాహిత్యంతో ప్రజలను చైతన్యం చేసిన నిజమైన వీరుడు!

స్వాతంత్ర్య ఉద్యమకాలంలో చాలా మంది వీరులు బ్రిటీషర్స్‌(Britishers)కు ఎదురొడ్డి పోరాటం సాగించారు. మరికొందరు ప్రజలను చైతన్యం చేసేందుకు తమ వంతు కృషి చేశారు. తమ విప్లవ సాహిత్యంతో స్వాతంత్య్ర(Freedom Fight) ఉద్యమానికి ఊపిరిలూదారు.అటువంటి ఉద్యమ చరిత్రకారుల్లో వీర్ గరిమెళ్ల సత్యనారాయణ పేరు లిఖంచబడి ఉంటుంది.

by Sai
The white aristocracy like us.. a real hero who made people aware with his revolutionary literature!

స్వాతంత్ర్య ఉద్యమకాలంలో చాలా మంది వీరులు బ్రిటీషర్స్‌(Britishers)కు ఎదురొడ్డి పోరాటం సాగించారు. మరికొందరు ప్రజలను చైతన్యం చేసేందుకు తమ వంతు కృషి చేశారు. తమ విప్లవ సాహిత్యంతో స్వాతంత్య్ర(Freedom Fight) ఉద్యమానికి ఊపిరిలూదారు.అటువంటి ఉద్యమ చరిత్రకారుల్లో వీర్ గరిమెళ్ల సత్యనారాయణ పేరు లిఖంచబడి ఉంటుంది. భారత స్వాతంత్ర్యం కోసం జరిగిన ఉద్యమాల్లో గరిమెళ్ల సత్యనారాయణ(Garimella Satyanarayana) తన వంతు పాత్రను పోషించినా.. స్వాతంత్య్రానంతరం అతని జీవిత చరిత్ర, విప్లవ పోరాట పటిమను చరిత్ర పుటల్లోకి ఎక్కించడంలో మన చరిత్ర కారులు నిర్లక్ష్యం వహించారు.

The white aristocracy like us.. a real hero who made people aware with his revolutionary literature!
వీర్ గరిమెళ్ల సత్యనారాయణ.. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట తాలూకాలోని గోనెపాడు గ్రామంలో జన్మించారు. ఆయన చాలా నిరాడంబరమైన కుటుంబ నేపథ్యం నుండి వచ్చారు. న్యాయవాది కన్నెపల్లి నరసింహారావు సహకారంతో బిఏ గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేయగలిగాడు. ఆ తర్వాత గరిమెళ్ల గంజాం కలెక్టర్‌ కార్యాలయంలో గుమాస్తాగా, విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే సహాయ నిరాకరణ ఉద్యమం పిలుపు మేరకు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు.

‘మాకొద్దీ తెల్ల దొరతనం’ (ఈ తెల్లదొరతనం మాకు అవసరం లేదు) పేరిట ఆయన పాడిన పాట తెలుగు ప్రజల ఇళ్ళలో ఒక గీతంగా, యుద్ధ కేకగా మారింది. ఈ పాట గురించి తెలుసుకున్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గంజాం మిస్టర్ జీటీహెచ్ బ్రాకెన్ గరిమెళ్లను పిలిచి విప్లవ సాహిత్య గేయాన్ని అతని సమక్షంలో పాడిపించుకున్నాడు. అతనికి తెలుగు భాష పెద్దగా తెలియక పోయినా అందులోని సారాంశం తెలిస్తే ప్రజలు ఎంత ఉద్వేగానికి లోనవుతారో బ్రాకెన్ గుర్తించాడు. దీంతో గరిమెళ్లను అరెస్టు చేయాలని అదేశించారు.

‘పేదరికం,నిస్సహాయత’ను ప్రధాన ఎజెండాగా చూపిస్తూ ఆయన రాసిని గేయానికి గాను ఒక ఏడాది పాటు కఠిన కారాగార శిక్షకు గురయ్యాడు. అసలు ఆ విప్లవ గేయంలోని సారాంశాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

‘మేము ఒక డజను అద్భుతమైన పంటలను పండిస్తాము
కానీ, మనం పొందే ఆహారం ఒక్క ముక్కకి సరిపోదు
ఉప్పు ముట్టుకోవడం నేరం
మేము ఉప్పును తాకినప్పుడు
మన నోట్లో బురద వేస్తారు
ఆహారం కోసం మేము కుక్కలతో పోరాడము”

ఇలా ప్రజల నిరాశ, నిస్సహాయత, పేదరికాన్ని గురించి ఆయన రాసిన విప్లవ గేయం స్థానిక ప్రజలను చైతన్య వంతులుగా మార్చింది. ఉద్యమం వైపు వారిని ఉసిగొల్లింది.
దీంతో 09 ఫిబ్రవరి 1922న గరిమెళ్లను తెల్లదొరలు అరెస్టు చేసి ఏడాది పాటు జైలులో ఉంచారు. ఆ తర్వాత ‘ది హిందూ’ దినపత్రిక 11 ఫిబ్రవరి 1922లో గరిమెళ్ల గురించి ఓ కథనాన్ని ప్రచురించింది.

‘ప్రియమైన సోదర, సోదరీమణులారా.. నేను నా వంతు చిన్న పనిని చేశాను. అందుకు కొలమానంగా తెల్లదొరలు తమను సుదీర్ఘ విశ్రాంతికి పంపించారు. బ్రిటీష్ బ్యూరోక్రసీ ప్రకారం ఏడాది పాటు నాకు శిక్ష విధించారు. నా కలం, నా స్వరాన్ని ఒక ఏడాది పాటు బంద్ చేయాల్సి తీర్పునిచ్చారు. నేను ప్రజల ప్రశాంతతకు, అంటే వారి ఉనికికి ప్రమాదకరమని భావించడం వారికి తెల్లదొరలకు సంతోషాన్నిచ్చింది. నేను నిజంగా అలాంటివాడిని అని వారు అనుమానించి నన్ను పట్టుకున్నారు. నాలో ఉన్న మంచిని దేశానికి ఇచ్చాను. నా భౌతిక శరీరం జైలులో లాక్ అయ్యింది. కానీ, నా ఆత్మను నేను సాహిత్యం ద్వారా దేశంలోకి విడిచిపెట్టాను.దానిని సేకరించి ఏకీకృతం చేసి, పని చేయనివ్వండి, ఇది నా బలహీనమైన శరీరం కంటే ఎక్కువగా పనిచేస్తుంది. స్వరాజ్య స్థాపన, భారత కీర్తిని గానం చేయడం కోసం మీ మధ్యలోకి తిరిగి రావాలని దేవుడు నన్ను అనుగ్రహిస్తాడని భావిస్తున్నాను’అని పేర్కొంది.

ఏడాది తర్వాత గరిమెళ్ల జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత కాలంలోనూ ఆయన ఉద్యమంలో పాల్గొన్నారు. తన సొంత గ్రామం నుంచి ప్రతి పల్లెకూ తిరుగుతూ జనాల్లో చైతన్యం కలిగించేలా ప్రేరణాత్మక పాటలను పాడటం ప్రారంభించాడు.దీంతో మరోసారి ఆయనకు రెండేళ్ల పాటు జైలు శిక్ష పడింది. జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో అతని భార్య, తండ్రి, తాత మరణించారు. అయితే, స్వాతంత్య్రం వచ్చాక ఎప్పటిలాగే గరిమెళ్ల విప్లవ సాహిత్యాన్ని, అతని పోరాటం గురించి మన చరిత్రకారులు మర్చిపోయారు. కాగా, తన చివరి రోజుల్లో గరిమెళ్ల పూర్తి పేదరికంలో గడపుతూ మరణించాడు.

 

You may also like

Leave a Comment