Telugu News » Adilabad : భారీ వర్షం..గొడుగు కిందే ప్రసవం

Adilabad : భారీ వర్షం..గొడుగు కిందే ప్రసవం

ప్రసవం కోసం ఆసుపత్రులకు వెళ్తుండగా...వాగు పొంగడంతో అది దాటలేకపోయారు. దాంతో ఆ వాగు పక్కనే ఆ మహిళకు ప్రసవం జరిగింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా పుత్తూరు మండలంలో జరిగింది.

by Prasanna
Adilabad

తెలంగాణా అంతటా కురుస్తున్న భారీ వర్షాలతో పట్టణాలు, నగరాలతో పాటు ఏజెన్సీ ప్రాంత వాసులు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో వర్షం వస్తే వాగులు, వంకలు పొంగిపొర్లుతూ బహ్య ప్రపంచంతో సంబంధాలు కట్ అయిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సమయంలో వైద్య సేవల అవసరం వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.

Adilabad

ఆదిలాబాద్ ఆదివాసీలకు వర్షాకాలంలో ఇటువంటి కష్టాలను ఎదుర్కొవడం పరిపాటిగా మారింది. తాజాగా ప్రసవం కోసం ఆసుపత్రులకు వెళ్తుండగా…వాగు పొంగడంతో అది దాటలేకపోయారు. దాంతో ఆ వాగు పక్కనే ఆ మహిళకు ప్రసవం జరిగింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా పుత్తూరు మండలంలో జరిగింది.

చిన్నుగూడాకు చెందిన ఓ మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి బయలుదేరారు. ఊరి మధ్యలో ఉన్న వాగు జోరుగా ప్రవహిస్తుండడంతో అతి కష్టం మీద వాగు దాటి రెండు కిలోమీటర్ల కాలి నడకన వెళ్లారు. ప్రసవ వేదనతో ఆ మహిళ అంతకు మించి నడవలేక పోయింది. దాంతో వర్షంలో గొడుగు కిందే వాగుపక్కనే గొడుగులు అడ్డు పెట్టి పురుడు పోశారు.

ఈ ఘటనలో తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. అక్కడ నుంచి 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో…వాళ్లు వచ్చిన తర్వాత ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏటా వర్షాకాలం వస్తే ఇదే పరిస్థతి ఏర్పాటుతోందని, వాగు దాటి ఆస్పత్రికి వెళ్లలేక రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి గ్రామానికి రోడ్డు వేయించి వాగుపై వంతెన నిర్మించాలని కోరుతున్నారు.

You may also like

Leave a Comment