ఈస్టర్ పండుగను ఆనందంగా జరుపుకోవడానికి బస్సులో వెళ్తున్న ప్రయాణికులు(Passengers) ప్రమాదవశాత్తు 165 అడుగుల ఎత్తు నుంచి లోయలో పడి దుర్మరణం పాలయ్యారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 45 మంది ఈ ప్రమాదంలో మరణించగా(Death), 8 ఏళ్ల బాలిక మాత్రం గాయాలతో బయటపడింది. ప్రస్తుతం బాలికకు వైద్యం అందిస్తుండగా ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటన దక్షిణాఫ్రికా(South Africa)లోని బోట్స్‌వానాలో శుక్రవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.
ఈస్టర్ పండుగ కోసం బోట్స్‌వానా నుంచి మోరియాకు 45 మందితో ఓ బస్సు బయలుదేరింది. ఈ క్రమంలోనే కొండపై నిర్మించిన వంతెన వద్ద బస్సు అదుపుతప్పింది. డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోవడంతో 165 అడుగుల ఎత్తు నుంచి లోయలో పడిపోయింది. వెంటనే బస్సులో మంటలు వ్యాపించాయి. దీంతో 45 మంది స్పాట్ లోనే చనిపోయారు.
సమాచారం అందుకున్న సహాయ సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకునేలోగా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బస్సులోని ప్రయాణికులు అంతా మరణించారు. మంటలు అంటుకోవడంతో బాడీలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. అయితే, 8ఏళ్ల పాప మాత్రం తీవ్రమైన గాయాలతో బయటపడింది.ఆ బాలిక ఎలా ప్రాణాలతో బయటపడిందో అధికారులకు అర్థం కాలేదు.
ఈ ఘటనపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు.ఈ ప్రమాదంపై పలుదేశాల అధ్యక్షులు, ప్రధానులు సైతం సంతాపం వ్యక్తంచేశారు. అయితే, కొండపై ఇటీవల నిర్మించిన బ్రిడ్జిపై ఈస్టర్ సందర్భంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని, నిదానంగా వెళ్లాలని ట్రాఫిక్ అధికారులు సూచిస్తున్నారు.