Telugu News » Medak: మెదక్‌ లో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీహెచ్‌వో!

Medak: మెదక్‌ లో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీహెచ్‌వో!

మెదక్‌ బస్టాండ్‌ సమీపంలో ఫహీంపాషాకు లంచం ఇస్తుండగా, అధికారులు అదుపులోకి తీసుకున్నారు

by Sai
acb-caught-asst-director-school-education-red-handed-while

మెదక్‌ జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో పని చేస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ (సీహెచ్‌వో) (CHO)ఫహీంపాషా రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి (ACB)చిక్కాడు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో ఫిజియోథెరపీ కేంద్రం ఏర్పాటుకు సతీశ్‌ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. నెల రోజులుగా ప్రాసెస్‌ కోసం తిరుగుతున్నాడు.

acb-caught-asst-director-school-education-red-handed-while

ఈ విషయంపై సీహెచ్‌వోను సంప్రదించగా లంచం డిమాండ్‌ చేశాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు బాధితుడు గురువారం సాయంత్రం మెదక్‌ బస్టాండ్‌ సమీపంలో ఫహీంపాషాకు లంచం ఇస్తుండగా, అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని డీఎంహెచ్‌వో కార్యాలయానికి తీసుకెళ్లి విచారించారు. కార్యాలయంతో పాటు ఫహీంపాషా ఇంటి వద్ద రాత్రి దాకా సోదాలు చేశారు.

ఇదిలా ఉండగా..స్కూల్‌ అప్‌గ్రేడేషన్‌కు ఎన్వోసీ ఇవ్వడానికి లంచం తీసుకుంటూ విద్యాశాఖకు చెందిన అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఏడీ) ఏసీబీకి దొరికాడు. ఏడీతో పాటు అతనికి సహకరించిన సూపరింటెండెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు గురువారం అరెస్ట్‌ చేశారు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రీజినల్‌ జాయిం ట్‌ డైరెక్టర్‌ (ఆర్జేడీ) కార్యాలయంలో అయోస్లా సాయి పూర్ణచందర్‌రావు ఏడీగా, దొడ్డి జగ్జీవన్‌ సూపరింటెండెంట్‌గా, ఆర్జేడీ పీఏగా జూనియర్‌ అసిస్టెంట్‌ సతీశ్‌ పని చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలానికి చెందిన శేఖర్‌ తన స్కూల్‌ను అప్‌గ్రేడ్‌ చేయాలని దరఖాస్తు చేసుకోగా, పని కావాలంటే ఏడీ, సూపరింటెండెంట్‌కు రూ.80 వేలు లంచం ఇవ్వాలని సతీశ్‌ డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం బాధితుడు సూపరింటెండెంట్‌ ద్వారా అసిస్టెంట్‌ డైరెక్టర్‌కు 80 వేలు ఇవ్వగా, అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరు అధికారులతో పాటు ఆర్జేడీ పీఏను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు.

You may also like

Leave a Comment