గత వారమంతా ఏపీ, తెలంగాణా (AP-Telangana) లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిశాయి. చాలా చోట్ల జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. రానున్న రోజుల్లో కూడా ఈ వర్షాలు పడతాయని అయితే పగటి పూట ఉష్ణోగ్రతల్లో (Temparetures) కూడా పెరుగుదల కనిపిస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం నేపథ్యంలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3 రోజులలో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. కొన్ని చోట్ల మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశముంది
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇలానే వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది
రాగల రెండు రోజుల్లో తెలంగాణా, ఏపీలతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, పుదుచ్చేరిలలోని పలు ప్రాంతాల్లో గాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.