కేదార్నాథ్ (Kedarnath)లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఒకే చోట కలుసుకున్నారు. అన్నదమ్ములు ఇద్దరు కలుసుకున్న ఫోటోలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్నా దమ్ముల అనుబంధం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
వరుణ్ గాంధీ యూపీలో ఎంపీగా ఉన్నారు. రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీ వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. వారిద్దరూ కలుసుకోవడం అత్యంత అరుదు. కానీ వాళ్లిద్దరినీ ఇటీవల కేదారినాథ్ కలిపింది. గత మూడు రోజులుగా రాహుల్ గాంధీ ఉత్తరాఖండ్లో పర్యటిస్తున్నారు. పర్యటన ముగింపు నేపథ్యంలో కేదారి నాథ్ ఆలయాన్ని రాహుల్ గాంధీ సందర్శించారు.
అదే సమయంలో యూపీ నుంచి వరుణ్ గాంధీకి కూడా ఆలయానికి వచ్చారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీకి వరుణ్ గాంధీ ఎదురు పడ్డారు. ఇరువురు నేతలు కాసేపు యోగక్షేమాలు విచారించుకున్నారు. వరుణ్ గాంధీ కుమార్తెను కలుసుకున్నందుకు రాహుల్ గాంధీ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
ఈ సమావేశంలో రాజకీయాల గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఇది ఇలా వుంటే గత కొంత కాలంగా బీజేపీ సమావేశాలకు వరుణ్ గాంధీ దూరంగా ఉంటున్నారు. పలు కీలక అంశాలపై కేంద్రాన్ని ఆయన విమర్శిస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీతో సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.



నీళ్లు, నిధులు, నియామకాలు నినాదాలతో తెలంగాణ పోరాటం జరిగిందని.. కానీ, అవన్నీ ఇప్పుడు నినాదాలకే పరిమితం అయ్యాయని వ్యాఖ్యానించారు. వాటిలో కనీసం ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. బీజేపీ వాళ్లను సీఎం చేస్తాం.. వీళ్లను ముఖ్యమంత్రి చేస్తామంటూ నోటితో ఇష్టానుసారం మాట్లాడలేదంటూ సీఎం కేసీఆర్ కు పరోక్షంగా పవన్ చురకలు అంటించారు.
తెలంగాణలో మార్పు దిశగా పరిణామాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ప్రజల విశ్వాసం బీజేపీ అని తెలిపారు. అన్ని వర్గాల్లోనూ మార్పు నిర్ణయం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ విరోధి అంటూ మండిపడ్డారు. నవంబర్ 30న ఈ విరోధి సర్కార్ ను విసిరి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలపై జరిగిందని.. కానీ, ప్రజలను కేసీఆర్ సర్కార్ మోసం చేసిందన్నారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ లూఠీ చేసిందని.. కాంగ్రెస్ కు ఆ పార్టీ సీ టీమ్ అని ఫైర్ అయ్యారు. బీసీ అభ్యర్థిని బీఆర్ఎస్ ఎందుకు సీఎం చేయదని ప్రశ్నించారు. బీజేపీ బీసీలు, ఆదివాసీలకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు మోడీ. రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతిని చేశామని.. ఇప్పుడు గిరిజన బిడ్డను చేశామన్నారు.