అయోధ్య (Ayodhya)లో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు మూడవ రోజుకు చేరుకున్నాయి. అయోధ్యలో ‘రామ్ లల్లా’ (Ram Lalla)విగ్రహం ఈ రోజు గర్భగుడిలోకి చేరుకుంది. భారీ క్రేన్ సహాయంతో రామ్ లల్లా విగ్రహాన్ని ఈ రోజు ఉదయం రామ మందిర ఆవరణలోకి తీసుకు వచ్చారు. అనంతరం రామ్ లల్లా విగ్రహాన్ని గర్బగుడిలో ప్రతిష్టించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుల సమక్షంలో విగ్రహాన్ని ప్రతిష్టించారు.
నిన్న రాత్రి 7.30 గంటల సమయంలో రామ్ లల్లా విగ్రహాన్ని వివేక్ సృష్టి కాంప్లెక్స్ నుంచి జన్మభూమి కాంప్లెక్స్‌కు తరలించారు. ఏటీఎస్ కమాండోల భారీ భద్రత మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విగ్రహాన్ని తనలించే సమయంలో వాహనానికి అన్నివైపుల పాలిథిన్ కవర్లతో పూర్తిగా కప్పి వుంచారు. అంతకు ముందు గర్భగుడిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించే చోట శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులతో పాటు నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్ దినేంద్ర దాస్, పూజారి సునీల్ దాస్ పూజలు నిర్వహించారు.
మధ్యాహ్నం 12.20 గంటల నుంచి 1.28 మధ్య విగ్రహాన్ని ప్రతిష్టించినట్ట ట్రస్టు సభ్యుల వెల్లడించారు. విగ్రహాన్ని గర్బగుడిలోకి ప్రతిష్టించే ముందు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం జల దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అందులో భాగంగా విగ్రహానికి జలాభిషేకాన్ని నిర్వహించనున్నారు. అనంతరం గంద దివస్ ను నిర్వహించనున్నారు.
గణేశాంబిక పూజ, వరుణ పూజ, చతుర్వేదోక్త పుణ్యవచనం, మండప ప్రవేశం, పృథ్వి- కుర్మ- అనంత- వరాహ- యజ్ఞభూమి పూజలను చేయనున్నారు. ఇది ఇలా వుంటే రామ మందిర ప్రారంభోత్సవం సందర్బంగా పలు రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. యూపీ, ఛత్తీస్ గఢ్, గోవా, హర్యానాల్లో విద్యా సంస్థలకు సెలవుగా ప్రకటించారు.
మరోవైపు జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవం సందర్బంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ డే సెలవును కేంద్రం ప్రకటించింది. రామ మందిర ప్రారంభోత్సవం సందర్బంగా హాఫ్ డే సెలవు ప్రకటించాలని నిర్ణయిచింనట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. అయోధ్యకు భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.
అయోధ్యలో వాతావరణానికి సంబంధించి ప్రత్యేక అప్ డేట్ ఇవ్వనున్నట్టు పేర్కొంది. దీని కోసం వాతావరణ శాఖ వెబ్సైట్లో ప్రత్యేక పేజీని అందుబాటులోకి తీసుకు వచ్చినట్టు వెల్లడించింది. ఉష్ణోగ్రత, తేమ, గాలి వేగం సహా వాతావరణానికి సంబంధించిన పలు అంశాల వివరాలను అందులో అప్ డేట్ చేయనుంది. హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ, చైనీస్, ఫ్రెంచ్, స్పానిష్ వంటి భాషల్లో ఈ పేజీని చూడవచ్చు.
జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్బంగా సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు ఉన్నతాధికారుల ప్రత్యే క బృందాన్ని కేంద్ర హోం శాఖ పంపించింది. ఇండియన్ సైబర్ కో ఆర్డినేషన్ టీమ్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రోస్పాన్స్ టీమ్, సైబర్ విషయాల్లో నిపుణులు ఈ బృందంలో ఉండనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.