గ్రూప్-2 (Group-2) అభ్యర్థి ప్రవళ్లిక (Pravallika) ఆత్మహత్య సంచలనంగా మారింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండగా పోలీసుల (Police) వెర్షన్ మరోలా ఉంది. ఆమె చావుకు గ్రూప్-2 వాయిదాకు సంబంధం లేదని పోలీసులు చెబుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కాసేపట్లో ఈ ఇష్యూపై క్లారిటీ ఇచ్చేందుకు పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్టు సమాచారం.
గ్రూప్-2 వాయిదా పడటంతోనే ప్రవళ్లిక ఆత్మహత్య చేసుకుందనే ప్రచారం నేపథ్యంలో ఆశోక్ నగర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే.. ప్రేమ వ్యవహారంలో బాయ్ ఫ్రెండ్ మోసం చేయడంతోనే ప్రవళ్లిక ఆత్మహత్య చేసుకుందని చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆమె ఆత్మహత్యకు గ్రూప్-2 పరీక్ష వాయిదాకు ఎటువంటి సంబంధం లేదని.. దీనిపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని యాదగిరి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
మరోవైపు, ఈ ఘటనపై గవర్నర్ తమిళిసై (Tamilisai) సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రవళ్లిక మృతిపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, టీఎస్ పీఎస్సీ కార్యదర్శికి ఆదేశించారు. శుక్రవారం రాత్రి అశోక్ నగర్ హాస్టల్ లో ప్రవళ్లిక ఆత్మహత్యకు పాల్పడింది.