చంద్రశేఖర్ చత్రపతి సినిమా ద్వారా పాపులర్ అయిపోయారు. తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమౌళి తీసిన సినిమాల్లో మనకి ఎక్కువ చంద్రశేఖర్ కనపడుతుంటాడు. ఈయన పేరు చంద్రశేఖర్ మాత్రమే. కానీ చత్రపతి సినిమా నటించిన తర్వాత చత్రపతి చంద్రశేఖర్ గా మారిపోయారు. ఎన్నో సంవత్సరాలుగా టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కూడా కీలక పాత్ర పోషించాడు. చంద్రశేఖర్ చత్రపతి సినిమా నుండి చంద్రశేఖర్ నటుడుగా వందలాది సినిమాల్లో నటించి అలరించారు.
ఈ సినిమా కన్నా ముందు స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, సై వంటి సినిమాలు చేశాడు. చంద్రశేఖర్ కి సంబంధించి మనకి చాలా విషయాలు తెలుసు. వ్యక్తిగత విషయాలు మాత్రం చాలామందికి తెలియదు. ఆయన భార్య కూడా తెలుగు ఇండస్ట్రీ నటి అని చాలామందికి తెలియదు. చంద్రశేఖర్ భార్య పేరు నిలియా భవాని. ఆమె కిక్ 2 , జెంటిల్మెన్, సైరా నరసింహారెడ్డి వంటి సినిమాల్లో నటించింది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకుంది.
Also read:
ఆమె తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా పలు సినిమాలు చేసింది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం భవాని బుల్లితెర సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తోంది. ఈమె ఖమ్మంలో పుట్టింది చంద్రశేఖర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్లిద్దరూ ప్రేమించుకునే నాటికి చంద్రశేఖర్ ఇంకా ఇండస్ట్రీలో అడుగు పెట్టలేదు. సో ఉద్యోగం లేకపోవడంతో భవానీ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు దాంతో ఇద్దరూ హైదరాబాద్ కి వచ్చి పెళ్లి చేసుకున్నారు సినిమాల్లో అవకాశాలు కోసం ట్రై చేస్తున్నప్పుడు రాజమౌళి శాంతి నివాసం సీరియల్ లో చిన్న రోల్ ఇచ్చారు. అలా చంద్రశేఖర్ ఇండస్ట్రీకి వచ్చాడు.