Telugu News » యానిమల్ సినిమాలో హీరోయిన్ గా ఫస్ట్ ఛాయస్ రష్మిక కాదా ? ఆ హీరోయిన్ మిస్ అయ్యిందా ?

యానిమల్ సినిమాలో హీరోయిన్ గా ఫస్ట్ ఛాయస్ రష్మిక కాదా ? ఆ హీరోయిన్ మిస్ అయ్యిందా ?

by Sravya

హీరోయిన్ రష్మిక మందన్న గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఇప్పటికే రష్మిక తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా ఆమె సంపాదించుకుంది. రష్మిక టాలీవుడ్ లోనే కాకుండా ఇప్పుడు హిందీ సినిమాలు మీద కూడా ఫోకస్ పెట్టింది. తాజాగా రణ్ బీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా చేసింది. డిసెంబర్ 1 న ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే ముందు రష్మిక మందన్న ని హీరోయిన్ గా అనుకోలేదు దర్శకుడు.

మరి రష్మిక ని కాకుండా మొదట ఎవర్ని అనుకున్నారు అనేది చూస్తే.. పరిణితి చోప్రా ని మొదట యానిమల్ సినిమాకి రణ్ బీర్ సరసన హీరోయిన్ గా అనుకున్నారు కానీ ఆమె ఈ సినిమాలో అవకాశాన్ని వదులుకుంది. ఇలా ఈ ఛాన్స్ రష్మిక కి వచ్చింది, ఆమె స్థానంలో రష్మిక బాగా నటిస్తుందని భావించి ఆమెని ఫిక్స్ చేశారు. రష్మిక గీతాంజలి పాత్రలో మునిగిపోయింది.

Also read:

ఎంతో అద్భుతంగా నటించి అందరినీ ఆకట్టుకుంది. సినిమా అంతటా కూడా రష్మిక చాలా చక్కగా నటించింది అనవసరంగా పరిణితి చోప్రా ఈ సినిమాలో అవకాశాన్ని వదులుకున్నారని అంతా భావిస్తున్నారు. ఆమెకి వేరే మూవీ షూటింగ్ ఉండడంతో ఆమె ఈ సినిమాలో అవకాశాన్ని వదులుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా రష్మిక ఈ సినిమాలో నటించడానికి మంచి నిర్ణయమే తీసుకుంది. యానిమల్ సినిమా కి మంచి స్పందన వస్తోంది.

You may also like

Leave a Comment