Telugu News » Death Sentence : బాలుడిని చంపిన వ్యక్తికి మరణశిక్ష…పోలీసులకు పాలాభిషేకం

Death Sentence : బాలుడిని చంపిన వ్యక్తికి మరణశిక్ష…పోలీసులకు పాలాభిషేకం

ఇంటి బయట ఆడుకుంటున్న దీక్షిత్ ను శనిగపురం గ్రామానికి చెందిన మంద సాగర్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. పెట్రోల్ బంక్ కి వెళ్దామని చెప్పి.. తన బైకుపై ఎక్కించుకొని తీసుకెళ్లాడు.

by Prasanna
dikshit

మహబూబాబాద్ జిల్లా కోర్టు (Dist Court) సంచలన తీర్పు వెల్లడించింది. దీక్షిత్ రెడ్డి (Dixit Reddy) హత్య కేసులో ముద్దాయి సాగర్ కి మరణ శిక్ష (Death Sentence) విధించింది. 2020, అక్టోబర్ 18న తొమ్మిదేళ్ల దీక్షిత్ రెడ్డిని అత్యంత కిరాతకంగా చంపాడు సాగర్.

dikshit

ఇంటి బయట ఆడుకుంటున్న దీక్షిత్ ను శనిగపురం గ్రామానికి చెందిన మంద సాగర్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. పెట్రోల్ బంక్ కి వెళ్దామని చెప్పి.. తన బైకుపై ఎక్కించుకొని తీసుకెళ్లాడు. ఆ తరువాత గుట్టల్లోకి తీసుకెళ్లి మంచి నీళ్లలో నిద్ర మాత్రలను కలిపి తాగించాడు. బాలుడు మత్తులో ఉండగానే గొంతు నులిమి హత్య చేశాడు.

హత్య తర్వాత బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ. 45 లక్షలు డిమాండ్ చేశాడు. కాసేపటి తర్వాత బాలుడి ఇంటి దగ్గరికి వెళ్లి తల్లిదండ్రులు, బంధువుల రియాక్షన్ గమనించాడు. అనంతరం విషయం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో దీక్షిత్ బాడీపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. మూడు రోజుల తరువాత దీక్షిత్ రెడ్డి డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత పోలీసులు సాగర్ ని గుర్తించి అరెస్టు చేశారు.

తాజాగా జిల్లా కోర్టు తీర్పుపై దీక్షిత్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు . మహబూబ్ నగర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ తీర్పును వెలువరించారు. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులకు పాలాభిషేకం చేశారు.

You may also like

Leave a Comment