దేశవ్యాప్తంగా గురువారం మొబైల్ ఫోన్ యూజర్లకు ఓ అలర్ట్ మెసేజ్ (Allert Message) వచ్చింది. సడెన్ గా అలారంతో ఆటోమేటిక్ గా ఫోన్ కు వైబ్రేషన్ మెసేజ్ రావడం కలకలం సృష్టించింది. ఆపే వరకు అలారం వస్తుండటంతో ఏం జరుగుతుందో తెలియక చాలామంది భయాందోళనకు గురయ్యారు. ఫోన్ (Phone) హ్యాక్ అయ్యిందేమోనని.. తెగ కంగారు పడ్డారు. దీనిపై తెలంగాణ (Telangana) పోలీస్ శాఖ క్లారిటీ ఇచ్చింది.
ట్విట్టర్ (ఎక్స్)లో కీలక సూచన చేశారు పోలీసులు (Police). ‘ప్రతి ఒక్కరు తమ మొబైల్ కి ఇలాంటి మెసేజ్ రావడం చూసే ఉంటారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా దేశంలో ఏదైనా అత్యవసర పరిస్థితుల సందర్భంలో పంపించే మెసేజ్ సిస్టమ్ ను కేంద్ర టెలికమ్యూనికేషన్ వారు శాంపిల్ గా పంపించారు’ అని ట్వీట్ లో పేర్కొన్నారు.
నేషనల్ డిజార్డర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA) పేరుతో ఈ సందేశం అందరికీ వెళ్తోంది. ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా సెల్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టమ్ తో పంపిస్తున్న నమూనా సందేశం. ఈ మెసేజ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ అమలు చేస్తున్న టీఈఎస్టీ పాన్-ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ కి పంపబడింది.
ఇది ప్రజా భద్రతను మెరుగుపరచడం, అత్యవసర సమయాల్లో సకాలంలో హెచ్చరికలను అందించడం లక్ష్యంగా ఉంది. మొబైల్ ఫోన్ స్క్రీన్ లపై విపత్తు సమయంలో హెచ్చరికను పంపడం కోసం ఎన్డీఎంఏ ద్వారా ఇది అమలు చేయబడుతుంది. జియో, బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ లో దీన్ని పరీక్షిస్తున్నారు.