Telugu News » కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం..చంద్రబాబుదే!

కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం..చంద్రబాబుదే!

ఈ స్కాం ఏమిటన్నది చంద్రబాబు మనవడికి కూడ అర్ధమౌతుంది.

by Sai

పేర్ని నాని,
వైసీపీ ఎమ్మెల్యే!

స్కిల్ స్కామ్ కు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చంద్రబాబుదే. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో డబ్బులను దోచుకోవడం కోసం చంద్రబాబు ఎంతో ఆత్రంగా వ్యవహరించారు. ఈ స్కాం ఏమిటన్నది చంద్రబాబు మనవడికి కూడ అర్ధమౌతుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కుట్రకు చంద్రబాబు తెరలేపారు. ఈ క్రమంలోనే గంటా సుబ్బారావును తీసుకొచ్చి అందలం ఎక్కించారు.

former-minister-perni-nani-allges-on-chandrababu-in-ap-skill-development-case

స్కిల్ డెవలప్ మెంట్ లో ఏం జరుగుతుందో చంద్రబాబు, గంటా సుబ్బారావుకు తప్ప ఎవరికీ తెలియదు.జీవోలో రూ. 3 వేల కోట్లుంటాయి. కానీ ఆ విషయాలు బయటకు రాలేదు.జీవో ఇచ్చిన రోజునే ఒప్పందం చేసుకున్నారు.డిజైన్ టెక్ ప్రతినిధి కలిసిన 19 రోజుల్లోనే స్కిల్ డెవలప్ మెంట్ ను ఏర్పాటు చేశారు.

ఒప్పందంలో భాగంగా సీమెన్స్ కంపెనీకి కాకుండా డిజైన్ టెక్ కంపెనీకి డబ్బులు ఎందుకు పంపారు.సీమెన్స్ కు కాకుండా డిజైన్ టెక్ కు డబ్బులు పంపాలని ఎవరూ అడగలేదు.డిజైన్‌టెక్ ముందుగానే ఏర్పాటు చేసిన డొల్ల కంపెనీలకు నిధులు తరలించింది. డొల్ల కంపెనీల నుండి మరిన్ని డొల్ల కంపెనీలకు నిధులను తరలించారు.అక్కడి నుండి చంద్రబాబు పీఏ శ్రీనివాస్ కు ఆ డబ్బులు చేరాయి.

సీమెన్స్ కంపెనీ నుండి నయాపైసా రాకుండానే రూ. 371 కోట్లు ఎలా విడుదల చేశారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబునాయుడు 13 చోట్ల సంతకాలు పెట్టారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు పీఏ, కిలారి రాజేష్ కు డబ్బు చేరిందనేది వాస్తవం. పీవీఎస్‌పీ అనే షెల్ కంపెనీకి డబ్బులు బదిలీ చేశారు.డొల్ల కంపెనీల నుండి హవాలా మార్గంలో వ్యక్తులకు చేరింది.

ఎంఓయూ, జీవోకు సంబంధమే లేదు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ విషయంలో ఐఎఎస్ అధికారుల అభ్యంతరాలను పట్టించుకోలేదు. ఒప్పందంపై చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబును ఈ విషయమై సీఐడీ అధికారులు ప్రశ్నిస్తే ఏమో, నాకు తెలియదు, గుర్తు లేదనే సమాధానాలు చెబుతున్నారు.

ఈ స్కాంపై కోర్టుల్లో జరుగుతున్న విచారణ సమయంలో చంద్రబాబు లాయర్లు స్కాం జరగలేదని వాదించారు.సెక్షన్ 17ఏ వర్తించదని వాదించారు. కానీ తప్పు చేయలేదని చెప్పే ధైర్యం ఎందుకు చేయలేదు. ఈ కుంభకోణానికి సూత్రధారి ఇప్పుడు జైల్లో ఉన్నారు.వ్యక్తులు, డబ్బుల కంటే చట్టం, న్యాయం బలమైనవి

You may also like

Leave a Comment