Telugu News » Bhagwant Mann: ‘మీరు సీఎంను అరెస్టు చేయగలరు.. ఆయన ఆలోచనను కాదు..’!

Bhagwant Mann: ‘మీరు సీఎంను అరెస్టు చేయగలరు.. ఆయన ఆలోచనను కాదు..’!

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ (Bhagwant Mann) ఖండించారు. ఎక్స్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

by Mano
Bhagwant Mann: 'You can arrest the CM.. not his idea..'!

మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను (Arvind Kejriwal) ఈడీ అరెస్టు చేయడాన్ని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ (Bhagwant Mann) ఖండించారు. ఎక్స్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

Bhagwant Mann: 'You can arrest the CM.. not his idea..'!

‘మీరు కేజ్రీవాల్‌ను మాత్రమే అరెస్టు చేయగలరు కానీ ఆయన ఆలోచనను కాదు.. కేజ్రీవాల్ వ్యక్తి కాదు.. ఆలోచనా విధానం’ అంటూ పేర్కొన్నారు. తామంతా ఆయనతోనే నిలబడతామని తెలిపారు. కాగా, నోటీసులు ఇస్తామంటూ ఢీల్లీ ముఖ్యమంత్రి ఇంటికి వచ్చిన ఈడీ అధికారులు తర్వాత సోదాలు నిర్వహించారు.

విచారణ కోసం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాల్సిందిగా కేజ్రీవాల్‌కు అధికారులు సూచించారు. అందుకు ఆయన నిరాకరించారు. ఇంట్లోనే విచారించాలని కోరారు. కాసేపటి తర్వాత కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. అక్రమ అరెస్టుకు నిరసనగా ఆమ్‌ఆద్మీ పార్టీ నేడు దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. కాగా, సీఎం పదవిలో ఉంటూ అరెస్టయిన మొదటి నాయకుడిగా అరవింద్‌ కేజ్రీవాల్ నిలిచారు.

అయితే, చట్టప్రకారం శిక్ష పడితే ఆయన పదవి కోల్పోయే అవకాశముంది. గతంలో బీహార్‌ సీఎంగా ఉన్నప్పుడు లాలూప్రసాద్‌పై అరెస్టు వారెంట్‌ జారీ అయింది. అయితే ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి తన భార్య రబ్రిదేవికి బాధ్యతలు అప్పగించారు. ఇటీవల అరస్టయిన హేమంత్‌ సోరెన్‌ కూడా అరెస్టుకు ముందు సీఎం పదవికి రాజీనామా చేశారు. తమిళనాడు సీఎంగా ఉన్నప్పుడే జయలలితకు శిక్ష పడింది. దీంతో ఆమె పదవిని కోల్పోయారు.

You may also like

Leave a Comment