తెలంగాణలో ఎన్నికలు విషయంలో చాలామంది ఊహించినది జరిగింది. తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల పూర్తి అయిపోయాయి డిసెంబర్ 3న వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ ఘనవిజయాన్ని అందుకుంది డిసెంబర్ 7న తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ పార్టీని స్టార్ట్ చేశారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు ఇవన్నీ మనం చూసాము. సీఎం బాధ్యతలు చేపట్టాక ఆరు గ్యారెంటీ పథకాలపై మొదటి సంతకం చేశారు రేవంత్ రెడ్డి. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళల కి అలానే ట్రాన్స్ జెండర్ కి ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని రేవంత్ రెడ్డి కల్పించారు. ఆరోగ్యశ్రీ ద్వారా అర్హత ఉన్న వాళ్ళకి 10 లక్షలు వరకు చేయూత పథకాన్ని మొదలుపెట్టారు.
ప్రస్తుతం మహాలక్ష్మి పథకానికి విపరీతమైన ఆదరణ అయితే వస్తోంది మహిళలు కూడా ఈ పథకం వలన సంతోషంగా ఉన్నారు. ఉచిత బస్సు సౌకర్యం వలన ఆర్టీసీ కి ఆదాయం పెరిగిందట. ఆదాయం ఎలా పెరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. మహిళలు ట్రాన్స్ జెండర్లు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని పొందుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బస్ స్టాండ్ మహిళలతో రద్దీగా మారిపోయింది రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఎక్కడికైనా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. ప్రస్తుతం తెలంగాణకి సంబంధించిన మహిళలు ఏదైనా ఒక ఐడి కచ్చితంగా చూపించే ప్రయాణం చేయాలి. ఒకవేళ ఐడీ లేకపోతే డబ్బులు పెట్టి టికెట్ తీసుకోవాలి అలా చేయకపోతే 500 రూపాయలు ఫైన్ గా చెల్లించాలి.
Also read:
ఆర్టీసీ బస్సులో సాధారణంగా 13 లక్షల మేర ప్రయాణికులు ట్రావెల్ చేస్తున్నారు. ఇందులో దాదాపు 90 శాతం మంది మహిళలే ఉంటున్నారు వాస్తవానికి దీనివలన ఆర్టీసీకి తీరని నష్టం వాటిల్లుతుంది కానీ పథకం వలన ఆర్టీసీకి ప్రభుత్వం రియంబర్స్మెంట్ కింద భారీ ఎత్తున డబ్బులు ఇస్తుంది గతంలో 13 నుండి 14 లక్షలు ఆదాయం వస్తే ఇప్పుడు ఏకంగా 18 నుండి 25 లక్షలు అది పెరిగింది. ఆర్టీసీ సిబ్బంది జీరో టికెట్ ద్వారా ప్రభుత్వానికి లెక్కలు పంపితే వాటి ఆధారంగా రియంబర్స్ పే చేస్తుంది.