Telugu News » World Cup 2023 : చిన్నస్వామి స్టేడియంలో పైకెగిరిన సిక్సుల తారాజువ్వలు.. టీమిండియా ఫోర్ హండ్రెడ్ వాలా!

World Cup 2023 : చిన్నస్వామి స్టేడియంలో పైకెగిరిన సిక్సుల తారాజువ్వలు.. టీమిండియా ఫోర్ హండ్రెడ్ వాలా!

బ్యాటింగ్ కు దిగిన ప్రతి ఒక్కరూ కుమ్మేశారు. స్టేడియంలో ఫోర్లు, సిక్సులతో టపాసుల మోత మోగించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ(61), గిల్ (51) అర్థ శతకాలతో శుభారంభాన్ని అందించారు.

by admin
India vs Netherlands

దీపావళి (Diwali) అంటే సందడి మామూలుగా ఉండదు. ఉదయమంతా పూజలు, నైవేద్యాలు, పిండివంటలు.. సాయంత్రమైతే రకరకాల టపాసుల మోతతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మరి, క్రికెట్ నే పండుగగా భావించే భారత్ (Bharat) లో అదే రోజు టీమిండియాకు మ్యాచ్ ఉంటే.. మామూలుగా ఉండదు కదా. ప్రపంచకప్ (World Cup) లో భాగంగా ఆదివారం నెదర్లాండ్స్ తో ఢీకొంది రోహిత్ సేన. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్‌ కు దిగిన మనోళ్లు వీరబాదుడు బాదారు.

India vs Netherlands

బ్యాటింగ్ కు దిగిన ప్రతి ఒక్కరూ కుమ్మేశారు. స్టేడియంలో ఫోర్లు, సిక్సులతో టపాసుల మోత మోగించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ(61), గిల్ (51) అర్థ శతకాలతో శుభారంభాన్ని అందించారు. రోహిత్ శర్మ లక్ష్మీ టపాసుల్లా ఫోర్లతో మోత మోగిస్తే.. తారా జువ్వల్లా సిక్సులు బాదేశాడు గిల్. తర్వాత వచ్చిన కోహ్లి(51) కూడా మెరుపులు మెరిపించాడు. శ్రేయాస్ అయ్యర్(128), కేఎల్ రాహుల్(102) సెంచరీలతో చెలరేగారు. స్టేడియంలో వీళ్లిద్దరూ దీపావళి పండుగ సందడిని తీసుకొచ్చారు.

బ్యాటింగ్ కు దిగిన అందరూ దుమ్మురేపడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీ స్కోరు చేసింది. వరల్డ్‌ కప్‌ లో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోర్. వన్డేలలో టాప్‌-5 బ్యాటర్లు హాఫ్‌ సెంచరీలు చేయడం ఇది నాలుగోసారి. వరల్డ్‌ కప్‌ చరిత్రలో అయితే ఇదే తొలిసారి.

ఇక, మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ రోహిత్ పలు రికార్డులు నెలకొల్పాడు. ఈ సంవత్సరం రోహిత్ ఇప్పటివరకు.. వన్డేల్లో 60 సిక్స్ ​లు బాదాడు. ఒక క్యాలెండర్ ఇయర్​ లో అత్యధిక సిక్స్ ​లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. సౌతాఫ్రికా బ్యాటర్ ఏబీ డివిలియర్స్​(58 సిక్స్ ​లు) రికార్డ్ బద్దలుకొట్టాడు రోహిత్. అలాగే, ఓపెనర్ ​గా 14,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేశాడు. వరల్డ్ ​కప్ హిస్టరీలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన మూడో బ్యాటర్​గా రోహిత్ (13) నిలిచాడు. ఇక, ప్రపంచకప్​ ఎడిషన్ ​లో అత్యధిక పరుగులు బాదిన టీమిండియా కెప్టెన్ గా రోహిత్ రికార్డు కొట్టాడు. ఈ వరల్డ్​ కప్​ లో ఇప్పటివరకు 503 పరుగులు సాధించాడు. తాజా హాఫ్ సెంచరీతో రోహిత్.. 100 అంతర్జాతీయ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు.

You may also like

Leave a Comment