పేరడీ పాటలతో జర్నీ స్టార్ట్ చేశాడు. నెమ్మదిగా జబర్దస్త్(Jabardast)టీమ్ లోకి ఎంటరై…కమెడియన్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అంత వరకూ బాగానే ఉంది..! పనిలో పనిగా ఓ యువతిని ఆకర్షించాడు. నెమ్మది వాట్సాప్ చాటింగ్ లు స్టార్ట్ చేశాడు. ప్రేమ పేరుతో ముగ్గులోకి దించాడు..ఆమె పెళ్లిప్రస్తావన తీసుకు రాగానే సడన్ గా కమెడియన్ కాస్తా విలన్ గా మారిపోయాడు. నెమ్మదిగా ఆమెను అవైడ్ చేయడం మొదలెట్టాడు. ప్రస్తుతం ప్రేమించిన యువతి ఎవరో తెలియనట్టుగా నటించేస్తున్నాడు. ఆ మహానటుడి పేరు నవ సందీప్.
తనకి న్యాయం చెయ్యాలంటూ ఆ యువతి పోలీసులను ఆశ్రయించడంతో సందీప్ అసలు రంగు బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జబర్దస్త్ కమెడియన్ (Jabardasth Comedian), గాయకుడు నవ సందీప్(Singer Nava Sandeep) ప్రేమ పేరుతో ఓ యువతి(28) మభ్య పెట్టాడు.
2018లో యువతితో వాట్సాప్ చాటింగ్స్ పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్త.. ప్రేమగా మారింది. ఈ విషయం యువతి ఇంట్లో తెలిసింది. దాంతో ప్రియురాలిని తన స్వగ్రామం నుంచి హైదరాబాద్‌కు రప్పించుకున్నాడు. షేక్‌పేటలోని ఓ హాస్టల్లో ఉంచాడు. ఆమె 4 సంవత్సరాలుగా అక్కడే ఉంటుంది.
ఈ క్రమంలో నవ సందీప్ యువతిని పలుమార్లు ఓయో, హోటళ్లకు తీసుకెళ్లి తన లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు. ప్రతిసారి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి…యువతితో శారీరకంగా తన కోరికలన్నీ తీర్చుకున్నాడు(Fulfilled All His Desires Physically).
తీరా పెళ్లి మాటెత్తేసరికి చేతులు దులిపేసుకున్నాడు. పెళ్లి చేసుకోమని అడిగితే.. పెళ్లి లేదు.. ఏం లేదంటూ మాట మార్చాడు.పెళ్లి చేసుకోలేను..నువ్వంటే నాకు ఇష్టం లేదంటూ తేల్చి చెప్పాడు. దీంతో ప్రేమికురాలు పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కింది. పోలీసుల దగ్గర తన గోడును వెల్లబోసుకుంది.
వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ప్రియుడు చెప్తున్నాడని వాపోయింది. ఇప్పుడు తన జీవితం అంధకారమైందని..అటు ఇంట్లోంచి బయటికొచ్చి…ఇటు ప్రియుడి చేతిలో మోసపోయానని..తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది.
ఈ మేరకు ఫిర్యాదు చేయడంతో గోల్కొండ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం కేసును మధురానగర్ ఠాణాకు బదిలీ చేశారు. ఈ మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.