మాదక ద్రవ్యాల కేసులో ఎస్సై(si) రాజేందర్ ను నగరంలోని రాయదుర్గంలో పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోనికి తీసుకున్నారు. కొంత కాలం క్రితం మహారాష్ట్రలో పోలీసులు చేపట్టిన ఆపరేషన్ లో భారీగా మత్తుపదార్థాలను పట్టుకున్నారు.
ఆ ఆపరేషన్ చేపట్టిన టీమ్ లో రాజేందర్ కూడా ఉన్నాడు. ఈ క్రమంలోనే రాజేందర్ సీజ్ చేసిన మాదక ద్రవ్యాల్లో కొంత భాగాన్ని రాజేందర్ తన ఇంట్లో దాచి పెట్టాడు.
వాటిని అమ్ముకోవాలని రాజేందర్ ప్లాన్ చేసినట్లు సమాచారం. కోర్టులో పట్టుకున్న మాదకద్రవ్యాలను డిపాజిట్ చేసే సమయంలో మిగిలిన అధికారులకు అనుమానం రావడంతో రాజేందర్ ను ప్రశ్నించగా అసలు విషయం బయపడింది.
మాదక ద్రవ్యాలను పట్టుకునేందుకు వెళ్లిన బృందంలో సైబర్ క్రైం ఎస్సై రాజేందర్ కూడా ఉన్నాడు. నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలలో ..కొన్నిటిని ఎస్సై మాయం చేశాడు. ఎస్సైని విచారించగా కొన్నిటిని తన ఇంటి లాకర్ లో దాచిపెట్టినట్లు వివరించాడు.
కొద్ది రోజుల తరువాత వాటిని అమ్మాలని చూసినట్లు తెలిపాడు. ఉన్నతాధికారుల విచారణలో నిజాలు తేలడంతో ఎస్సై రాజేందర్ ని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై ఇంట్లో ఉన్న మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.